holy festival
-
అంబరాన్నంటిన హోలీ సంబరాలు: వైరల్ వీడియోలు
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సందడి జోరుగా సాగుతోంది. రంగులను చల్లుకుంటూ, డీజే డ్యాన్స్‌లతో పిల్లా పెద్దా అంతా ఆడిపాడుతున్నారు. ‘హ్యాపీ హోలీ’ నినాదాలతో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు అందించుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా సంబరాలకు దూరమైన ప్రజలు ఈ హోలీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రంగుల్లో మునిగి తేలుతున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ.. అన్న తేడా లేకుండా వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. క శ్మీర్ బారాముల్లా జిల్లాలోని బోనియార్‌లో ఇండియన్ ఆర్మీ జవాన్లు హోలీని జరుపుకున్నారు. అలాగే ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు లాఠ్మార్ పేరుతో హోలీని జరుపుకుంటారు, బిహార్‌లోని పాట్నాలో ఒకరిపై ఒకరు పాదరక్షలు విసురుకుంటూ హోలీ జరుపుకోవడం విశేషంగా నిలిచింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. దీంతోపాటు హోలీ సందర్భంగా కొన్ని ఉత్సవాల వీడియోలు, ఇతర జోయ్ఫుల్ అండ్ ఫన్నీ వీడియోలు కోసం.. #WATCH Assam | Multitudnous crowd of people celebrate #Holi with colours while dancing to the tunes of songs in Guwahati pic.twitter.com/M1CfX1jgBD — ANI (@ANI) March 18, 2022 Holi Celebrations in my college...💥#BheemlaNayak #BlockBusterBheemLaNayak @MusicThaman ❤️ pic.twitter.com/pDDvCF88cX — King of Tollywood 💫💫 (@King_of_Twood) March 17, 2022 #WATCH | Locals of Boniyar, Baramulla district dance and celebrate #Holi with Indian Army jawans in remote areas of the district in Jammu and Kashmir. (Source: Indian Army) pic.twitter.com/R6Poq7HVSH — ANI (@ANI) March 18, 2022 HAPPY MUSICAL HOLI to all !! 🎶❤️🎶 MUSIC is COLOURFUL.. HOLI is MUSICAL !! 💃😁🎶❤️🎶😁🕺 pic.twitter.com/AQfNVZmzew — DEVI SRI PRASAD (@ThisIsDSP) March 18, 2022 How is the day going ? Wishing you all a fun Holi ♥️💙💚💛🧡 🌈🏳️🌈🌊💦💧⛈️ pic.twitter.com/kG93dlg3e5 — Tarana Hussain (@hussain_tarana) March 18, 2022 पटना की ‘चप्पल मार’ होली …ऐसी होली देखी है कहीं? pic.twitter.com/U5xuTN3Lk7 — Utkarsh Singh (@UtkarshSingh_) March 17, 2022 #WATCH Maharashtra | Children play #Holi with each other with colours and water guns in Pune pic.twitter.com/OWcFqFiAoK — ANI (@ANI) March 18, 2022 -
రోహిత్‌ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రెండేళ్లుగా మాయదారి కరోనాతో రంగుల పండుగకు దూరమైన ప్రజలు ఈసారి మాత్రం రెట్టింపు ఉత్సాహంతో వేడుకను జరుపుకుంటున్నారు. మరి క్రికెటర్లు కూడా హోలీ వేడుకలు తమస్టైల్లో జరుపుకోవడం చూస్తుంటాం. అయితే హోలీ రోజు సాయంత్రానికో.. లేక మరునాడో వాళ్ల పండుగ సెలబ్రేషన్స్‌ను వీడియో రూపంలో షేర్ చేస్తుంటారు. అయితే క్రికెటర్లు ఆ వీడియో పెట్టడానికి ముందే ఏ విధంగా హోలీ పండుగ జరుపుకుంటారనేది ముందుగానే తెలుసుకుందాం. దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాల పద్దతుల్లో హోలీ జరుపుకుంటారు. మరి మన క్రికెటర్లు ఏ జాబితాలో ఉన్నారు.. అభిమానులు వారిని ఎక్కడ ఉంచారనేది ఊహాతీతంగా చూద్దాం. -సాక్షి, వెబ్‌డెస్క్ బెలూన్ ఫైటింగ్ హోలీ బెలూన్స్లో రంగు నీళ్లు నింపి ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ సరదాగా ఆడుకుంటారు. కాస్త చిన్నపిల్లలు ఎక్కువగా ఆడే ఈ ఆటకు మన క్రికెటర్లు కొందరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రిషబ్ పంత్, యజ్వేంద్ర చహల్, జేమ్స్ నీషమ్, డేవిడ్ వార్న్‌ర్ ఈ జాబితాలో ఉంటారు. నో కలర్.. పీస్ హోలీ హోలీ పండుగ రోజున బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ మ్యూజిక్‌ను ఆస్వాధిస్తూ పండుగను జరుపుకుంటారు. స్వతహగా రంగులు చల్లుకోవడం, బెలూన్స్ ఫైటింగ్ హోలీ ఆడడం వీళ్లకు ఇష్టం ఉండదు. ఈ జాబితాలో చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, మహ్మద్ నబీ లాంటి క్రికెటర్లు ఉంటారు. పెయింట్ అండ్ గ్రీస్ హోలీ ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది. ముఖానికి గ్రీస్, పెయింట్ లాంటివి పూసుకొని పండుగను జరుపుకుంటున్నారు. ఇటువంటి వారిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మనకు తెలిసినంత వరకు ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, ఇషాన్ కిషన్, డ్వేన్ బ్రేవో లాంటి క్రికెటర్లు ఉంటారు. స్వతహగా మైదానంలో ఈ క్రికెటర్లు ఎంతో చురుకుగా ఉంటారు. కచ్చితంగా హోలీ రోజు సాయంత్రం మాత్రం ఎక్కువసేపు బాత్‌టబ్‌లో ఉండడానికి ఇష్టపడుతారు. ఎకో ఫ్రెండ్లీ హోలీ పర్యావరణానికి హాని కలిగించకుండా సహజమైన రంగులతో జరుపుకోవడానికి ఇష్టపడుతారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనితో పాటు విరాట్ కోహ్లి, భువనేశ్వర్, డుప్లెసిస్‌లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆట లేనప్పుడు వీరు ఎక్కువగా ఫ్యామిలీతో ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడుతారు. స్వీట్, ఫుడ్ హోలీ సెలబ్రేషన్స్ హోలీ రోజున అందరు రంగులతో ఆడుకుంటే.. కొంతమంది మాత్రం తమకు ఇష్టమైన ఫుడ్‌ను లాగించేస్తుంటారు. అందరిలో భిన్నంగా కనిపించే ఇలాంటి వారిలో మన క్రికెటర్లు కూడా ఉన్నారు. మంచి ఆహార ప్రియుడైన రోహిత్ శర్మ ఈ జాబితాలో కచ్చితంగా ఉంటాడు. రోహిత్‌తో పాటు శిఖర్ ధావన్, రవిశాస్త్రి, మార్కస్ స్టోయినిస్ సహా మరికొంతమంది ఆటగాళ్లు పండుగ రోజున తమ ఇష్టమైన ఆహారాన్ని లాగించేందుకు ఇష్టపడుతారు. చదవండి: Womens WC 2022 WIW vs BANW: విండీస్ క్రికెటర్ వింత ప్రవర్తన.. సూపర్ అంటున్న ఫ్యాన్స్ IPL 2022: కప్ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు -
కప్ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్ తాజా చర్యతో అభిమానుల మనసులు గెలుచుకుంది. కరోనా కారణంగా ఈసారి సీజన్‌ను ముంబై, పూణే వేదికగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. వాంఖడే, డీవై పాటిల్, సీసీఐ బ్రబౌర్న్ స్టేడియాల్లోనే ఈసారి మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో హోలీ పండుగ పురస్కరించుకొని ముంబై ఇండియన్స్.. ఐపీఎల్లో ఉన్న మిగతా 9 జట్లకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్.. ముంబై రోడ్లలో బిల్‌బోర్డులను ఏర్పాటు చేసి ఆయా ప్రాంచైజీలకు స్వాగతం పలికింది. 9 జట్లకు తొమ్మిది రకాల స్లోగన్స్ ఇచ్చి వారిని ఉత్సాహపరుస్తూ వచ్చింది. మరి ముంబై ఇండియన్స్ ఇచ్చిన 9 స్లోగన్స్‌ను ఇప్పుడు చూద్దాం. రాజస్తాన్ రాయల్స్- వెల్కమ్.. హల్లా బోల్.. దిల్ కోల్ కే ఎస్ఆర్హెచ్- వెల్కమ్.. షైన్ కరో.. దిల్ కోల్ కే.. దిల్ కోల్ కే కేకేఆర్- వెల్కమ్.. కోర్బో..లోర్బో.. జీత్బో.. దిల్ కోల్ కే లక్నో సూపర్ జెయింట్స్- వెల్కమ్.. కేల్ నవాబీ.. దిల్ కోల్ కే ఢిల్లీ క్యాపిటల్స్- వెల్కమ్.. కేలో ధిల్లీ..దిల్ కోల్ కే పంజాబ్ కింగ్స్- వెల్కమ్.. చక్ దే పత్తే.. దిల్ కోల్ కే గుజరాత్ టైటాన్స్- వెల్కమ్.. మజా థీ రామ్‌జో.. దిల్ కోల్ కే సీఎస్కే- వెల్కమ్.. విజిల్ పోడూ.. దిల్ కోల్ కే ఆర్సీబీ- వెల్కమ్.. ప్లే బోల్డ్.. దిల్ కోల్ కే ముంబై ఇండియన్స్ చేసిన పనిని క్రికెట్ ఫ్యాన్స్ తెగమెచ్చుకుంటున్నారు. మీరు కప్ గెలుస్తారో లేదో తెలియదు కానీ మా మనసులు మాత్రం గెలిచేశారు.. లవ్ యూ ముంబై అంటూ కామెంట్ చేశారు. ఇక గత సీజన్లో అంతగా ఆకట్టుకోని ముంబై ఇండియన్స్ ఈసారి సరికొత్త ప్రణాళికతో బరిలోకి దిగనుంది. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. చదవండి: PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే IPL 2022: 'దీపక్ చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అతడికే ఉంది' Ravichanran Ashwin: ‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్ చేసేయండి’ -
వద్దంటే వద్దనే
అంతేగా! వద్దంటే వద్దనే. ‘అర్థమైంది లెద్దూ. హోలీక్కూడానా!’.. అంటారా? అవును.. హోలీక్కూడానే. ‘టేకిటీజీ.. ఇట్స్ హోలీ’ అని తప్పించుకోలేం. ‘రంగు పడబడుతుంది’. బాయ్స్ మిమ్మల్నే. వినపడుతోందా? హోలీ కదా.. చూసీ చూడనట్లు పోతార్లెమ్మని చేతుల మీద, చెంపల మీద.. ఇంకా ఎక్కడెక్కడైనా... అమ్మాయిల్ని టచ్ చేశారా.. ‘అమిత్ ఇల్లు ఇదేనా?’ అని షీ టీమ్స్ దిగిపోతాయి. అమిత్ ఎవరనేనా! అర్జున్‌రెడ్డి లవర్ ప్రీతికి హోలీరంగులు పూసి వెళ్లిన అమిత్. అర్జున్‌రెడ్డి వెళ్లి కుమ్మేస్తాడు. గుర్తొచ్చిందా? రంగులు పూసి వెళ్లాక ఆ పిల్ల ఏడుస్తుంటే అర్జున్‌రెడ్డి వస్తాడు. నేరుగా ప్రీతి దగ్గరకి వెళ్లకండా, అక్కడున్న జూనియర్ స్టూడెంట్స్ దగ్గరికెళ్లి.. ఏం జరిగిందీ, ఎక్కడ పూసిందీ అడుగుతాడు. ఎక్కడెక్కడ పూసి వెళ్లాడో బిక్కుబిక్కుమంటూ చెప్తారు వాళ్లు. తర్వాతి సీన్లో అమిత్ దవడ పగిలిపోతుంది.‘ప్రతి అమ్మాయికీ ఓ అర్జున్‌రెడ్డి ఉంటాడు.. ఆమెకు ఇష్టం లేకుండా రంగు పూస్తే, పూసినవాడి దవడ పగలగొడతాడు’ అని కాదు ఈ సన్నివేశంలోని నీతి. ఇష్టం లేకపోతే రంగులు పూయొద్దని, రంగునీళ్లు చల్లొద్దని. ఇష్టం లేదని ఎలా తెలుస్తుంది? చెప్తారు వాళ్లు. ‘సారీ బ్రో’ అనో, ‘నాకిష్టం లేదు నో’ అనో చెప్తారు. నోటితో చెప్పలేకపోయినా ‘స్టే అవే ఫ్రమ్ మీ’ అనే ఫీలింగ్ వాళ్ల ముఖంలో కనిపిస్తుంది. అది నోటీస్ చెయ్యాలి. చెయ్యకుండా.. అమ్మాయి హోలీ అడుతోందని ఆమె దగ్గరకు వెళ్లి.. హోలీరే, హోలీరే అని గెంతులేస్తే.. వంతులవారీగా వచ్చి ఒకటిచ్చిపోతారు.. అమ్మాయికి అయినవాళ్లు, కానివాళ్లు కూడా. అసలు వాళ్లంతా ఎందుకు? అమ్మాయే ఛెళ్లుమనిపిస్తుంది. ఎవరు సహిస్తారు? ఎవరో స్ట్రేంజర్. ముక్కూముఖం తెలీదు. మనుపు మాట్లాడింది లేదు. ఎప్పుడూ కలుసుకున్నది లేదు. బైక్ మీద వచ్చి, రంగులు చల్లేసి, రయ్‌మని వెళ్లిపోతే.. ఎక్కడో ఒకచోట దొరక్కపోతారా?! ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకుని లటుక్కున పట్టేస్తాయి షీ టీమ్స్. చిన్న కంప్లయింట్ చాలు. బాయ్స్.. పండగ పూట భయపెట్టడం కాదిది. భద్రం చెప్పడం. వంకల కోసం చూసే మీలోని కుంకలు కొందరు అమ్మాయిల్ని టచ్ చెయ్యడానికి హోలీ మంచి టైమ్ అనుకుంటారు. వాళ్లకు చెప్పండి. టైమ్ బాగోలేకపోతే కలర్‌ఫుల్ ఫెస్టివల్ కాస్తా.. బ్లాక్ అండ్ ఫెస్టివల్ అయిపోతుంది. నేరాల్ని, ఘోరాల్ని బ్లాక్ అండ్ వైట్‌లో చూపిస్తుంటారు కదా టీవీల్లో.. అలా! అమ్మాయిలు అబ్బాయిల్లా కాదు. వాళ్లు కొంచెం స్పేస్ కోరుకుంటారు. ఆ స్పేస్‌లోకి సొంతవాళ్లైనా రాకూడదనుకుంటారు. ‘ఆ స్పేస్ తగ్గించడానికే కదా హోలీ పండగ’ అనేవాళ్లూ ఉండొచ్చు. కానీ పండగ కన్నా స్పేస్ ముఖ్యం అని అమ్మాయి అనుకున్నప్పుడు ఆమె స్పేస్‌ని రెస్పెక్ట్ చెయ్యాల్సిందే. టచ్ చెయ్యకూడదు. రద్దీ సిటీబస్సులో అనుకుని నిల్చున్నట్లు, అమ్మాయి పక్కన సీటు దొరికింది కదా అంటుకుని కూర్చున్నట్లు.. అదే ఫార్ములాతో హోలీ రోజు రంగులతో ఆమె స్పేస్‌లోకి చొరబడితే.. మన రంగు మన మీద పడినట్లే. శ్రీ కృష్ణుడు కూడా తెలిసిన ఆడవాళ్లతోనే హోలీ ఆడాడు కానీ, అపరిచిత మహిళల దాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఎంత ఆడినా ఆ గోపికలతోనే.. ఆ రాధమ్మతోనే. నందగ్రామం కృష్ణుడి బర్త్‌ప్లేస్. అక్కడికి దగ్గర్లోని బర్సానా విలేజ్ రాధమ్మ స్వగ్రామం. యూపీలోని ఈ రెండు ప్రాంతాలకీ హోలీ ఆడ్డం కోసమే పనిగట్టుకుని మరీ విదేశీ టూరిస్టులు వస్తుంటారు. వాళ్లలో వాళ్లే హోలీ ఆడతారు. లోకల్ వాళ్లను టచ్ కూడా చెయ్యరు! అదొక భక్తిపారవశ్యపు ఉల్లాసంలా ఉంటుంది తప్ప స్వేచ్ఛగా టచ్ చెయ్యడానికి వీసాతో వచ్చినట్లు ఉండదు. మర్యాదగా ఉంటారు. గౌరవంగా ఉంటారు. వాళ్లతో మనవాళ్లూ అలాగే ఉంటారు. ఎవరైనా ఇష్టపడితే చెంప మీద చిన్న చిలకరింపు పొడి. అంతే. ఎక్కువగా బ్లూ, పింక్ రంగులు ఉంటాయి. హోలీకి ఒకరోజు సరిపోవడం లేదని ఇప్పుడు పదిరోజులు ఆడుతున్నారు. పండుగలు ఏవైనా.. మనుషుల మధ్య, మతాల మధ్య హద్దులు చెరిపేయడానికే. దీపావళి, ఈద్, క్రిస్మస్. కలిసిమెలిసి చేసుకునే పండుగలు. హోలీ కూడా అలాంటిదే. అంతరాలు లేని రంగుల లోకంలో విహరించడం. అయితే ఆ విహారంలో ‘టచ్’ అనే అపశృతి దొర్లకుండా జాగ్రత్త పడాలి. రంగునీళ్లు.. కర్రదెబ్బలు.. లడ్డూ ముక్కలు! హోలీ పండగ అంటే ఎక్కడైనా రంగునీళ్లు చల్లుకోవడం చూశాం కానీ, ఇదేంటీ ఈ మహిళలు ఇలా కర్రలు తీసుకుని ఫెడేల్ ఫెడేల్మని కొడుతున్నారు..? నిజానికి వాళ్లు కొట్లట్లేదు కానీ, కొట్టినంత పని చేస్తున్నారంతే! సరదా సరదాగా కర్రలపెళ్లిలా సాగే ఈ ఉత్సవానికే లామార్ హోలీ అని పేరు. ఈ ఆచారం ఈ నాటిది కాదు. ద్వాపరయుగం నాటిది. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికల మీద రంగులు కలిపిన నీళ్లు చల్లబోతే, వారందరూ కలసి కృష్ణుడిని బెదిరించడానికి కర్రలు తీసుకుని వెంటబడ్డారట. కృష్ణుడంతటి వాడు రంగునీళ్లక్కడ వదిలేసి పరుగందుకున్నాడట. కృష్ణుడు వెళ్లిపోయాడులే, ఇక తమ మీద రంగునీళ్లు పడవని గోపికలు ఆ కర్రలన్నింటినీ పక్కన పడేసి కుచ్చిళ్లు దోపుకుని పనిలోకి దిగబోతుండగా అందరి కళ్లూ కప్పి ఎక్కడినుంచి వచ్చాడో ఏమో కృష్ణుడు వాళ్ల మీద రంగునీళ్లు పోయనే పోసేశాడట. దాంతో వాళ్లు చిరుకోపంతో మళ్లీ కర్రలందుకుని తరుముతుంటే, నగర వీధుల్లోకి పరుగుదీశాడట కృష్ణుడు. ఇది నగర ప్రజలందరి కంటా పడడంతో వాళ్లందరూ కూడా ఇదేదో బాగుందని ఆటలాడారట. అదే హోలీ వేడుక. ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలతో, తమ నగరాన్ని ‘మధురంగా’ మార్చివేసిన అలనాటి ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పోగొట్టుకోకుండా కొనసాగిస్తున్నారు మధురానగర వాసులు. హోలీకి సరిగ్గా వారం రోజుల ముందు పురుషులందరూ కలసి బర్సానాలో మూడేళ్ల వాళ్లనుంచి మూడుకాళ్ల వాళ్లదాకా వయోభేదం లేకుండా పురుషులందరూ కలసి బకెట్లలో, కూజాల్లో, క్యానుల్లో... ఇలా తమ చేతికందిన వాటిలో రంగులు కలిపిన నీళ్లను నింపుకుని పాటలు పాడుకుంటూ వరసయిన, మనసైన మగువల వెంబడి పడతారు. వారు కూడా చిన్నా చితకా తేడా లేకుండా వెదురు కర్రలను చెక్కి, నున్నగా లాఠీల్లా తయారు చేసి, తమ వెంటపడుతున్న వాళ్లను కొడతామన్నట్లు బెదిరిస్తారు. మీ కర్ర దెబ్బలకు మేమేమీ భయపడేది లేదంటూ మీదికొచ్చి మరీ రంగునీళ్లు పోసేవాళ్లను తలా రెండు తగిలిస్తారు. ఆ కర్రదెబ్బలు తగలకుండా తోలుతో తయారు చేసిన డాలు వంటి దానిని అడ్డం పెట్టుకుని కొందరు, నాలుగు దెబ్బలు తగిలితే తగిలినాయిలే, తమకు వరసైన వారిని రంగునీళ్లలో ముంచెత్తుదాంలే మరికొందరు రంగునీళ్లు చల్లుతూనే ఉంటారు. అదో సరదా వాళ్లకి. దీనినే లామార్ హోలీ పిలుస్తారు అక్కడివాళ్లు. తమ చేత ఇలా కర్ర దెబ్బలు తిన్న మగవాళ్లకి లడ్డూలు తినిపిస్తారు ఆడవాళ్లు. దానికి లడ్డూ హోలీ అని పేరు. ఇక అసలు సిసలు హోలీ రోజున మాత్రం అందరూ రంగేలీ మహల్ వద్ద కాచుకుని కూర్చుంటారు రంగులతో, రంగునీళ్లతో, మొతం్త మీద ఈ పండుగ చాలా ఉల్లాసంగా జరుగుతుంది బార్సానా, మధురలలో. – డి.వి.ఆర్. -
ముగిసిన పవిత్రోత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. తెల్లవారుజామునే నిత్యపూజ, హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమాలను అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠకోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్, ప్రధానార్చకులు శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్, మఠం ప్రతినిథి సంపత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పండితులు నిర్వహించారు. పవిత్రోత్సవ విశిష్టత ఇదీ: ఏడాది పొడువునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక మహోత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలసీ తెలియక చేసిన తప్పుల వలన ఏర్పడిన దోష నివారణకు ప్రతి ఏడాది నియమనిష్టలతో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. -
సికింద్రాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక రైలు
హైదరాబాద్: హోలీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-పాట్నా (02793/02794) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ ఆదివారం రాత్రి 9.40 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 10 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ శుక్రవారం ఉదయం 9.30కు పాట్నా నుంచి బయలుదేరి శనివారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
ట్విట్టర్ లో వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు ట్విట్టర్లో హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనానికి సూచనగా దేశవ్యాప్తంగా ఉల్లాసంగా జరుపుకొనే ఈ రంగుల పండుగ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని తాను మనసారా కోరుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్లో ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు. అలాగే హోలీ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సహజ రంగులనే వాడాలని వైఎస్ జగన్ సూచించారు. Wishing you, your family and friends a fun-filled, colourful #Holi! Be safe, use organic colours. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 6, 2015 -
రంగుల పండుగ అందరికీ ఆనందాన్నివ్వాలి
తెలుగు ప్రజలకు జగన్ హోలీ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనానికి సూచనగా దేశవ్యాప్తంగా ఉల్లాసంగా జరుపుకొనే ఈ రంగుల పండుగ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని జగన్ మనసారా ఆకాంక్షించారు.