ముగిసిన పవిత్రోత్సవం
ముగిసిన పవిత్రోత్సవం
Published Thu, Oct 20 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
అహోబిలం (ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. తెల్లవారుజామునే నిత్యపూజ, హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమాలను అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠకోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్, ప్రధానార్చకులు శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్, మఠం ప్రతినిథి సంపత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పండితులు నిర్వహించారు.
పవిత్రోత్సవ విశిష్టత ఇదీ:
ఏడాది పొడువునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక మహోత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలసీ తెలియక చేసిన తప్పుల వలన ఏర్పడిన దోష నివారణకు ప్రతి ఏడాది నియమనిష్టలతో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
Advertisement