ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్ ఒక్క విజయం సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఐదుసార్లు ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్సేనా ఇప్పుడు ఆడుతుంది అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2015 ఐపీఎల్ సీజన్‌లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసినప్పటికి.. ఆరో మ్యాచ్‌లో విజయం సాధించి.. ఆ తర్వాత చాంపియన్‌గా నిలిచింది.
కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇక ముంబై ఇండియన్స్ కోలుకోవడం కష్టమే అనిపిస్తుంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు మూట గట్టుకుంది. ఒక సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇంతకముందు 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2019లో ఆర్‌సీబీ తమ తొలి ఆరు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయాయి. అంతేకాదు ఈ జట్లు ఆయా సీజన్లను చివరి స్థానంతో ముగించాయి. ఇప్పుడు ముంబై కూడా అదే తరహాలో పయనిస్తోంది. ముంబై ఆటతీరు చూస్తుంటే సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
చదవండి: IPL 2022: సిక్స్ కొట్టగానే నవ్వింది.. ఆమె ఎవరి గర్ల్‌ఫ్రెండ్ తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment