ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే చూసిన ముంబై.. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక ముంబై ఓడిపోతే ఇక అంతే సంగతి. దీనికి తోడూ రోహిత్ శర్మ అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా ఘోరంగా విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి రోహిత్ .. 41,10, 3,26 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లిలాగే రోహిత్ శర్మ సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్సీ వదిలేస్తాడనుకున్నా. కోహ్లి కూడా గత సీజన్‌లో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఇక రోహిత్ కూడా కెప్టెన్సీ బాధ్యతలు పొలార్డ్‌కు అప్పజెప్పి తాను బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తే బాగుండేది. టీమిండియా కెప్టెన్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టకముందు రోహిత్ ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్నాడు. ఐదుసార్లు ముంబైని చాంపియన్‌గా నిలిపాడు.
కానీ దేశానికి కెప్టెన్ అనే పదం రోహిత్‌ను ఒత్తిడిలో పడేసింది. ఆ ప్రభావం ఐపీఎల్‌లో కనిపిస్తుంది. ఇప్పటికైనా రోహిత్.. పొలార్డ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెపితే బాగుంటుంది. కెప్టెన్‌గా పొలార్డ్‌కు చక్కని అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో విండీస్ కెప్టెన్‌గా పొలార్డ్ వ్యవహరిస్తున్నాడు. ఒక రకంగా పొలార్డ్‌కు కెప్టెన్సీ ఉంటేనే బ్యాటింగ్‌లో రాణిస్తాడని అంటారు. కెప్టెన్సీ అతనికి బలంగా మారుతుంది.. సిక్సర్లు అవలీలగా సందిస్తాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2022: 'రిటైర్డ్ ఔట్'.. ఇది ఆరంభం మాత్రమే : అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment