జాకీచాన్ రేంజ్లో వడివేలు ఫైట్ | Vadivelu pulls off a tough fight sequence for 'Eli' | Sakshi
Sakshi News home page

జాకీచాన్ రేంజ్లో వడివేలు ఫైట్

Published Mon, Apr 6 2015 12:19 PM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

జాకీచాన్ రేంజ్లో వడివేలు ఫైట్ - Sakshi

జాకీచాన్ రేంజ్లో వడివేలు ఫైట్

చెన్నై:  వడివేలు అని పేరు వింటుండగానే చటుక్కున మన ముఖాల్లో నవ్వులు విరబూస్తుంటాయి. స్వతహాగా తమిళ హాస్య నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో ఆయన భాష పలికే తీరు, ఆ సమయంలో హావభావాలు కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి. అయితే, ఎప్పుడూ నవ్వించే ఆయన ఈసారి మాత్రం ఔరా అని అనిపించనున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఈసారి హీరోల మాదిరిగా గాల్లో ఎగురుతూ ఫైట్ చేయనున్నారు.

అవి అలాంటిఇలాంటి పోరాటాలు కాదు.. ఏకంగా జాకీచాన్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉండేలా ఆయన ఫైట్ చేయబోతున్నారు. ఎప్పుడూ తనను హాస్య నటుడుగానే చూసే ప్రేక్షకులు ఫైట్ చేసే హీరోగా చూడలేరని, తాను ఈసీన్ చేయలేనని చెప్పినా.. డైరెక్టరే స్వయంగా పట్టుబట్టి మరీ ఈ సీన్ చేయిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్ర డైరెక్టర్ యువరాజ్ స్వయంగా చెప్పారు.  గత కొన్ని రోజులుగా తెరమరుగైనా వడివేలు ఇప్పుడు 'ఎలి' అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్రంలోనే ఈ పైట్లు కనిపించబోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement