Tough fight
-
Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
లోక్‌సభ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుతోంది. ఇప్పటిదాకా ఆరు విడతల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 57 సీట్లకు ఆఖరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరగనుంది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం సీట్లకూ ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్‌లోని మిగిలిన సీట్లలో ఎన్నికల క్రతువు ముగియనుంది. చివరి విడత నియోజకవర్గాలను విశ్లేషిస్తే గత ఫలితాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు తెరపైకొచ్చాయి...చివరి విడతలో పోలింగ్ జరగనున్న 57 స్థానాల్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీయే చక్రం తిప్పింది. ఈ 57 స్థానాల్లో రెండుసార్లూ 25 సీట్ల చొప్పున కొల్లగొట్టింది. కాంగ్రెస్ 2014లో కేవలం 3, 2019లో 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఓట్లపరంగానూ బీజేపీదే పైచేయి. బీజేపీకి 28 సీట్లలో 40 శాతం ఓట్లు రాగా 12 సీట్లలో 30 నుంచి 40 శాతం దక్కాయి. కాంగ్రెస్‌కు 18 సీట్లలో 10 శాతం ఓట్లు కూడా రాలేదు. మొత్తమ్మీద ఈ 57 సీట్లలో 24 చోట్ల పలు పారీ్టలు పటిష్టంగా ఉన్నాయి. తృణమూల్, బీజేపీలకు చెరో 8 సీట్లు కంచుకోటలు. మూడింట బిజూ జనతాదళ్, రెండేసి చోట్ల కాంగ్రెస్, అకాలీదళ్, ఒక చోట జేడీ(యూ) పటిష్టంగా ఉన్నాయి. ఈ స్థానాల్లో గత మూడు ఎన్నికల్లోనూ ఆ పారీ్టలే గెలిచాయి. మరో 14 సీట్లలో ప్రత్యర్థులకు బీజేపీ గట్టి సవాలు విసురుతోంది. వాటిలో 2009 నుంచి కనీసం రెండుసార్లు బీజేపీ గెలిచింది. ఆ లెక్కన 22 చోట్ల బీజేపీదే జోరు. కాంగ్రెస్ బలంగా ఉన్న సీట్లు 6 మాత్రమే. క్లీన్స్వీప్లన్నీ కమలానివే... ఏడో విడత పోలింగ్ జరిగే స్థానాల్లో గత ఎన్నికల్లో ఐదు చోట్ల క్లీన్‌స్వీప్‌లు నమోదయ్యాయి. అంటే గెలిచిన, ఓడిన పార్టీ మధ్య ఓట్ల తేడా 35 శాతం పైగా నమోదైంది. వీటిలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, హమీర్పూర్, సిమ్లా, కాంగ్రా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోనే పడటం విశేషం. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో వారణాసిలో 45.2 శాతం ఓట్ల మెజారిటీ సాధించారు!ఆ స్థానాల్లో హోరాహోరీ... ఏడో విడత స్థానాల్లో గత ఎన్నికల్లో పలు స్థానాల్లో నువ్వానేనా అనేలా టఫ్ ఫైట్ జరిగింది. అవి జలంధర్ (పంజాబ్), బలియా, చందౌలీ (యూపీ), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్ (బిహార్). ఈ స్థానాల్లో గెలుపు మార్జిన్ 2 శాతం లోపే! వీటితో పాటు ఏ పారీ్టకీ స్పష్టమైన మొగ్గు లేని స్వింగ్ సీట్లు 11 ఉన్నాయి. గడచిన మూడు ఎన్నికల్లో వీటిలో ఏ పార్టీ కూడా రెండోసారి గెలవకపోవడం విశేషం. గాజీపూర్, ఘోసి, రాబర్ట్స్‌గంజ్, మీర్జాపూర్ (యూపీ), ఆనంద్‌పూర్ సాహిబ్, ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహిబ్, పటియాలా (పంజాబ్), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్, కరాకట్ (బిహార్) ఈ స్వింగ్ సీట్ల జాబితాలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమేథీలో రాహుల్‌కు ఎదురుగాలి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈసారి ఎదురుగాలి వీయనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్ తెలిపింది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన అమేథీలో రాహుల్‌కు బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతీఇరానీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌కు 4,08,651 ఓట్లు రాగా, ఆయనపై పోటీచేసిన స్మృతి ఏకంగా 3,00,748 ఓట్లను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చని సర్వే తేల్చింది. కాగా, రాహుల్ పోటీచేస్తున్న మరో నియోజకవర్గం వయనాడ్(కేరళ)లో ఆయన విజయం నల్లేరుపై నడకేనని సర్వే స్పష్టం చేసింది. వయనాడ్‌లో యూడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ 7.30 లక్షల ఓట్ల మెజారిటీ(70 శాతం ఓట్ల)తో విజయం సాధించబోతున్నారని తెలిపింది. ఎల్డీఎఫ్ అభ్యర్థి, సీపీఐ నేత పి.పి.సునీర్ 23 శాతం ఓట్లతో 2.50 లక్షల ఓట్లను దక్కించుకుంటారని వెల్లడించింది. బీజేపీ–భారత్ ధర్మజనసేన(బీడీజేఎస్) అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లె 7 శాతం ఓట్లను దక్కించుకుంటారని పేర్కొంది. రాయ్‌బరేలీ సోనియాదే: యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో సోనియాగాంధీ ఘనవిజయం సాధిస్తారని తెలిపింది. 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సోనియా మరోసారి ఈ స్థానాన్ని నిలుపుకుంటారని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన దినేశ్ ప్రతాప్‌సింగ్‌ను బీజేపీ సోనియాపై పోటీకి నిలిపింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు ఇక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. జయప్రదకు షాక్.. ఎస్పీ నేత ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఈ నియోజకవర్గం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత, నటి జయప్రదకు రాంపూర్‌లో ఓటమి తప్పకపోవచ్చని సర్వేలో తేలింది. రాంపూర్ ప్రజలు ఆజంఖాన్‌కు పట్టం కట్టబోతున్నారని వెల్లడించింది. జయప్రదతో పోల్చుకుంటే ఆజంఖాన్ రాంపూర్‌లో అందరికీ తెలిసిన వ్యక్తికావడం ఆయనకు లాభించిందని అభిప్రాయపడింది. భోపాల్ ప్రజ్ఞా సింగ్‌దే: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు షాక్ తగలనుందని సర్వే తెలిపింది. భోపాల్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దిగ్విజయ్ సింగ్‌ను ఓడించబోతున్నారని ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. మాండ్యలో సుమలత జయభేరి.. కర్ణాటకలోని మాండ్యలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి సుమలత విజయదుందుభి మోగించబోతున్నారని సర్వే తెలిపింది. సీఎం కుమారస్వామి కొడుకు జేడీఎస్–కాంగ్రెస్ అభ్యర్థి నిఖిల్ గౌడకు పరాజయం తప్పదని స్పష్టం చేసింది. మాండ్యలో బీజేపీ సుమలతకు మద్దతు పలికింది. బెగుసరాయ్‌లో కన్హయ్య ఓటమి.. బిహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఘనవిజయం సాధిస్తారని తేలింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తన్వీర్ హసన్ రెండో స్థానంలో, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత, సీపీఐ అభ్యర్థి కన్హయ్యకుమార్ మూడో స్థానంలో నిలుస్తారని పేర్కొంది తిరుగులేని ‘షా’ గాంధీనగర్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్ తెలిపింది. ఈ ఎన్నికల్లో షా 8,92,775 ఓట్లు(67 శాతం) దక్కించుకోనుండగా, కాంగ్రెస్ అభ్యర్థి సీహెచ్ ఛవ్దా 3,31,602 ఓట్లు(26 శాతం), ఇతరులు నాలుగు శాతం ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది. సర్వే ప్రకారం.. ► యూపీలోని మైన్‌పురిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ మధ్య హోరాహోరీ పోరు. ► కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఎల్డీఎఫ్ అభ్యర్థి దివాకరణ్పై ఘనవిజయం సాధిస్తారు. ► బిహార్‌లోని పట్నాసాహిబ్‌లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్నసిన్హాపై గెలుస్తారు. ► ఈశాన్యఢిల్లీలో కాంగ్రెస్ నేత షీలాదీక్షిత్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారు. ► తూర్పుఢిల్లీలో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ కాంగ్రెస్ నేత అర్విందర్ లవ్లీపై గెలుస్తారు. ► తమిళనాడులోని శివగంగ నుంచి కాంగ్రెస్ నేత పి.కార్తి చిదంబరం, బీజేపీ నేత హెచ్.రాజాపై విజయం సాధిస్తారు. ► యూపీలోని సుల్తాన్‌పూర్‌లో కేంద్ర మంత్రి మేనకాగాంధీ, బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ మధ్య హోరాహోరీ పోరు. స్వల్ప మెజారిటీతో మేనక గట్టెక్కే అవకాశం. ► తమిళనాడులోని తూత్తికుడిలో బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్‌పై డీఎంకే నేత కనిమొళి విజయం. ► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో బీజేపీ నేత సన్నీడియోల్ చేతిలో కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ జాఖర్ ఓటమి. ► పిలిభిత్‌లో ఎస్పీ అభ్యర్థి హేమరాజ్ వర్మపై బీజేపీ నేత వరుణ్‌గాంధీ విజయం. ► ఛింద్వారాలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి నకుల్‌నాథ్, ఆనంద్‌పూర్ సాహిబ్‌లో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ఘనవిజయం. ► న్యూఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్‌ను మట్టికరిపిస్తారు. ► కేంద్రమంత్రి రామ్‌కృపాల్ యాదవ్ పాటలీపుత్ర నుంచి మరోసారి మిసాభారతి(ఆర్జేడీ)ని ఓడిస్తారు. ► ఉత్తర ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ మతోండ్కర్, దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్రాకు ఓటమి తప్పదు. ► పూరీ నుంచి బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర, నాగ్‌పూర్ నుంచి కేంద్రమంత్రి గడ్కారీ, బారామతి నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే విజయం సాధిస్తారు. ► మధ్యప్రదేశ్‌లోని గుణాలో జ్యోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్), కేపీ యాదవ్ (బీజేపీ)మధ్య హోరాహోరీ పోరు. -
మేజిక్ రిపీట్!
కిందటి పార్లమెంటు ఎన్నికల్లో (2014) బీజేపీ మొత్తం 26 సీట్లూ గెలుచుకున్న రాష్ట్రం గుజరాత్. 1995 అసెంబ్లీ ఎన్నికల నుంచి కాషాయ పక్షానికి కంచుకోటగా మారింది ఈ రాష్ట్రం. అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మధ్యలో రెండున్నరేళ్లు మినహా ఇప్పటి వరకు అధికారంలో బీజేపీయే కొనసాగుతోంది. పదో లోక్‌సభ (1991) ఎన్నికల నుంచి 2014 వరకూ జరిగిన ఏడు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గుజరాత్‌లోనే గెలుచుకుంది. 1989 ఎన్నికల్లో సైతం బీజేపీ 12 సీట్లు కైవసం చేసుకుంది. పన్నెండున్నరేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ.. 2014 మేలో ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని పదవి చేపట్టిన మూడున్నర సంవత్సరాల తరువాత జరిగిన 2017 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీతో అధికారంలోకి రావడం ఆయన ‘ఇమేజ్’కు స్వల్పంగా దెబ్బ తగిలింది. తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రెండున్నరేళ్లకే పదవికి రాజీనామా చేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న మొదటి గుజరాతీ ప్రధాని మోదీ పదవిలో ఉండగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కారణంగా మరోసారి అత్యధిక సీట్లు గెలుచుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అసెంబ్లీలో 99కి తగ్గిన బీజేపీ బలం మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా మూడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115కి పైగా సీట్లు సాధించగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం 120 నుంచి 99 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ తన బలాన్ని 57 నుంచి 78 సీట్లకు పెంచుకోగలిగింది. బీజేపీ, కాంగ్రెస్ వరుసగా 49.1 శాతం, 41.4 శాతం ఓట్లు సంపాదించాయి. అసెం బ్లీ ఎన్నికల ఫలితాలు, ఇతర పరిణామాల కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం నాలుగు నుంచి ఏడు వరకు గెలుచుకునే అవకాశాలున్నాయని ఎన్నికల పండితులు అంచనా వేస్తున్నారు. తాము 12 సీట్ల వరకూ గెలుచుకోగలమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఈ నెల మొదట్లో ప్రకటించిన టైమ్స్‌నౌ–వీఎంఆర్ ఎన్నికల సర్వే మాత్రం బీజేపీకి 22, కాంగ్రెస్‌కు నాలుగు లోక్‌సభ సీట్లు దక్కే అవకాశం ఉందని జోస్యం చెప్పింది. పొరుగు రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో మాదిరిగానే గుజరాత్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ముఖాముఖి పోటీ జరుగుతోంది. మొత్తం 26 సీట్లకు ఈ నెల 23 (మంగళవారం)న పోలింగ్ జరగనుంది. 40 శాతానికి పైగా పట్టణాల్లోనే.. దాదాపు ఆరున్నర కోట్ల జనాభా ఉన్న గుజరాత్లో 42.6 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. 57.4% జనం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నా రు. జాతీయ సగటుకు మించి రాష్ట్రంలో అక్షరాస్యత (80%) సాధించారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న తేడాల కారణంగా ఎన్నికల ఫలితాలపై కచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. పత్తి అధికంగా పండే ఈ రాష్ట్రంలో వేరుశనగ, జీలకర్ర విస్తారంగా పండిస్తున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలోనే ఈ పంటలు బాగా వేస్తారు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతుల కోర్కె.. యువకులకు ఉద్యోగాలు కావాలన్న డిమాండ్ కారణంగా పెద్దగా వినిపించడం లేదు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ బాగా వినిపించింది. ఈ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరి రాష్ట్రంలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నా.. ఈ కోటా సంగతి ఎవరూ మాట్లాడట్లేదు. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం స్పల్పంగానైనా ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ రంగ సంక్షోభం, గ్రామీణ ప్రాంత సమస్యల వల్ల 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్రలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. అడ్వాణీ అడ్డాలో అమిత్‌షా బీజేపీ అగ్రనేతలు మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి ఒకసారి, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అడ్వాణీ ఆరుసార్లు గెలిచిన గాంధీనగర్ నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా బరిలో దిగారు. గతంలో గుజరాత్ అసెంబ్లీకి, రాజ్యసభకు ఎన్నికైన షా పార్లమెంటుకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఆయనపై కాంగ్రెస్ తరఫున సీజే చావ్డా పోటీకి దిగారు. 1999 ఎన్నికల్లో అడ్వాణీపై కాంగ్రెస్ టికెట్‌పై మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ పోటీ చేసి ఓడిపోయారు. 1996లో ఇక్కడి నుంచి గెలిచాక వాజ్‌పేయి రాజీనామా వల్ల జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బాలీవుడ్ నటుడు రాజేశ్ ఖన్నా ఓడిపోయారు. అడ్వాణీకి టికెట్ ఇవ్వరన్న విషయం తెలిశాక తనకు ఈ ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి లేదని ఆయన ప్రకటించారు. 2017 చివర్లో అమిత్‌షా గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే గాంధీనగర్లోనే అత్యధికంగా 19 లక్షల 21 వేలకు పైగా ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వాటిలో ఐదు పట్టణ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మిగిలిన రెండు సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉత్తర గాంధీనగర్ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డా ఠాకూర్ క్షత్రియ వర్గానికి చెందిన పశు వైద్యుడు. అయితే రాజకీయాల్లోకి రాక ముందు ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ‘ఇది అమిత్‌షాకు, సీజే చావ్డాకు మధ్య పోరాటం కాదు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు. బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్‌షా సురక్షిత స్థానాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? తీవ్ర పోటీ ఉండే సీటు నుంచి పోటీకి దిగవచ్చుకదా!’ అని చావ్డా వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాజ్‌పేయి, అడ్వాణీ గెలిచిన గాంధీనగర్‌లో స్థానికుడినైన తాను పోటీ చేయడం ఎంతో గర్వంగా ఉందని అమిత్‌షా చెప్పారు. అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు ముందు సర్ఖేజ్ నుంచి నాలుగుసార్లు, తర్వాత నారాన్పురా నుంచి ఒకసారి షా ఎన్నికయ్యారు. గాంధీనగర్ నుంచి షా పోటీ చేస్తారనే విషయం తెలియగానే బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నించింది. పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌ను ఇక్కడ బరిలోకి దింపాలన్న ఆలోచనకు కోర్టు ఆదేశంతో అడ్డుకట్ట పడింది. ప్రభావం చూపని పాటీదార్ల ఆందోళన ఉత్తరాది హిందీ రాష్ట్రాలైన యూపీ, బిహార్‌తో పోలిస్తే గుజరాత్ రాజకీయంగా అంత సంక్లిష్టమైన రాష్ట్రం కాదు. ఇక్కడ రాజకీయ సుస్థిరత ఎక్కువ. ఈ రెండు హిందీ రాష్ట్రాల్లో మాదిరిగా మతం ప్రభావం ఎన్నికల్లో ఉంది. కానీ, కులం సూటిగా కాకుండా పరోక్షంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. రాష్ట్రంలో ఆధిపత్య, అభివృద్ధి చెందిన సామాజికవర్గంగా భావించే పాటీదార్లు (పటేళ్లు) 2016లో తమను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలంటూ ఉద్యమించిన ఫలితంగా వారు పాలక పక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా మారారనే అభిప్రాయం కలిగింది. ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం పాటీదార్లలో కొంత మందే కాంగ్రెస్ వైపు మళ్లారని బీజేపీకి వచ్చిన సీట్లు, ఓట్ల శాతం సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కొంత మేరకు జనాదరణ కోల్పోయినా పాటీదార్లందరూ బీజేపీకి దూరం కాలేదు. దక్షిణ గుజరాత్లో బీజేపీ హవా దక్షిణ గుజరాత్ బీజేపీ బలం చెక్కుచెదరకపోవడంతో కాంగ్రెస్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటికి మారిన రాజకీయ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని అత్యధిక సీట్లలో పాలక పక్షం నుంచి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. దక్షిణ గుజరాత్లో బీజేపీ దాదాపు అన్ని సీట్లూ కైవసం చేసుకునే వీలుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతంలో భరూచ్, బార్డోలీ, సూరత్, నవాసారి, వల్సాద్ లోక్‌సభ సీట్లున్నాయి. ఈ ఐదింటిలో సూరత్, నవాసారి, భరూచ్‌లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమే. మిగిలిన రెండు స్థానాల్లోనే కాంగ్రెస్ మోస్తరు పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు. 1989 నుంచీ సూరత్‌ను వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. 2014లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి దర్శనా జర్దోష్ 5 లక్షల 33 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఈసారి ఆమె తనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, సౌరాష్ట్రకు చెందిన పాటీదార్ అశోక్ అధేవడాపై సునాయాసంగా గెలుస్తారని అంచనా. అయితే బీజేపీ మెజారిటీ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నవాసారిలో కిందటిసారి బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ 5 లక్షల 58 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సూరత్ నగరంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు నవాసారి పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ బీజేపీకి బలమైన ప్రాంతాలు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న కోలీ వర్గం (మత్స్యకారులు) నేత ధర్మేష్ పటేల్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. అయినా బీజేపీ గెలుపు తేలికేనని అంటున్నారు. భరూచ్‌లో త్రిముఖ పోటీ భరూచ్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతోంది. ఈ సీటును బీజేపీ 1989 నుంచీ వరుసగా తొమ్మిదిసార్లు గెలిచింది. ఇక్కడా బీజేపీకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. ఐదుసార్లు వరుసగా గెలిచిన మన్సుఖ్ వాసవాను బీజేపీ మరోసారి ఇక్కడ నిలబెట్టింది. యువజన కాంగ్రెస్ నాయకుడు షేర్‌ఖాన్ పఠాన్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. అయితే, ఎమ్మెల్యే, బీటీపీ నేత చోటూ వాసవా ఇక్కడ నామినేషన్ వేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీతో తనకు ముఖాముఖి పోటీ జరిగేలా చూడడానికి వాసవా కాంగ్రెస్ మద్దతు కోరారు. కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన బీటీపీ నేత.. ఆదివాసీ జనాభా ఉన్న మరి కొన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపారు. మధ్య, దక్షిణ గుజరాత్ బీజేపీ కంచుకోట.. గుజరాత్ మధ్య, దక్షిణ ప్రాంతాలు బీజేపీకి బలమైన కేంద్రాలు. కాంగ్రెస్‌కు సౌరాష్ట్ర, కఛ్ ప్రాంతాల్లో మంచి జనాదరణ ఉంది. కాంగ్రెస్‌కు తిరుగులేని పట్టు ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలను గత పాతికేళ్లలో గణనీయ సంఖ్యలో బీజేపీ ఆకట్టుకోగలిగింది. పాటీదార్ల ఆందోళనకు కేంద్ర స్థానమైన ఉత్తర గుజరాత్లో మాత్రం కాషాయపక్షం బలహీనపడింది. మళ్లీ ఇక్కడ బలం పుంజుకోవడానికి వెనుకబడిన తరగతుల నేత అల్పేష్ ఠాకూర్ మద్దతు కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. ఆయన ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇంకా ఎవరికీ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించలేదు. ఆదివాసీలు ఎక్కువ మంది ఉన్న ఉత్తర గుజరాత్లో నాలుగు సీట్లు ఎస్టీలకు, రెండు స్థానాలు ఎస్సీలకు రిజర్వు చేశారు. బార్డోలీలో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఆదివాసీలకు రిజర్వు చేసిన బార్డోలీలో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి తుషార్ చౌధరి తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రభు వాసవా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్ సభ్యుడైన వాసవా 2014లో చౌధరిని లక్షా 24 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ అభ్యర్థి తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాని, తన విజయం ఖాయమని చౌధరి నమ్ముతున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బార్డోలీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని 12 వేల ఓట్లకు తగ్గించగలిగామని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. స్థానిక నేతలతో తుషార్ చౌధరికి మంచి సంబంధాలు లేకపోవడం వల్ల బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది. వల్సాద్.. ఎవరో వస్తాద్? వల్సాద్ (ఎస్టీ) సీటులో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత సభ్యుడు కేసీ పటేల్‌పై కాంగ్రెస్ తన అభ్యర్థిగా సీనియర్ ఎమ్మెల్యే జీతూ చౌధరిని నిలబెట్టింది. ఇక్కడ గెలిచే పార్టీకే అత్యధిక సీట్లు వస్తాయనే నమ్మకం ఆనవాయితీగా ఉంది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో పటేల్ రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీతూ చౌధరి కప్రాదా స్థానంలో కేవలం 170 ఓట్లతో గట్టెక్కారు. వల్సాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మెజారిటీ లక్షా 39 వేలకు పడిపోయింది. ఇంతటి భారీ ఆధిక్యం బీజేపీకి ఉన్నా జీతూ చౌధరి జనాదరణ ఉన్న ఆదివాసీ నాయకుడు కావడంతో ఆయనకు విజయావకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. పోటీలో కోటీశ్వరులు తూర్పు అహ్మదాబాద్ నియోజకవర్గం బరిలో ఉన్న 26 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమకు కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్టు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి సోమాభాయ్ పటేల్‌కు 7.46 కోట్లుండగా, బీఎస్పీ అభ్యర్థి గణేశ్ వాఘేలాకు రూ.7 కోట్లు, కాంగ్రెస్ అభ్యర్థి గీతా పటేల్‌కు రూ.4 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పోటీ చేస్తున్న గాం ధీనగర్‌లో ఐదుగురు కోటీశ్వరులున్నారు. షా తనకు రూ.40 కోట్లకు పైగా ఆస్తులున్నాయని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాకు రూ.12 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. చోటు వాసవా, అమిత్ చావ్డా,అమిత్ షా హార్దిక్, గీతా పటేల్, దర్శనా జర్దోష్, సీజే చావ్డా షేర్‌ఖాన్, ప్రభు వాసవా, మాన్సుఖ్ వాసవా, కేసీ పటేల్ తుషార్ చౌధరి, సోమాభాయ్ పటేల్ -
నాగర్‌కర్నూల్‌లో ప్రచారం.. హోరాహోరీ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎన్నికలు సమీపిస్తుండడంతో నాగర్‌కర్నూల్ నియోజకవకర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు విస్తృతంగా ప్రచారం చేయడంతో గ్రామాల్లో సైతం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ఎవరికి వారు తమ సొంత అంచనాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మండలాల వారికి వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుని నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ రోడ్ షో... నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సంబంధించి ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముమ్మరమైంది. ఇప్పటికే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షోలు ఇతర కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడంతో పాటు ఎమ్మెల్యే ఎన్నికల మాదిరి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 259 పోలింగ్ బూత్‌లు ఉండగా 2,14,095మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,07,525మంది పురుషులు, 1,06,567మంది స్త్రీలు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. కాగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీఆర్ఎప్ పార్టీకు సంబంధించి అన్ని మండలాల్లో కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్ యాదవ్, జక్కా రఘునందన్‌రెడ్డిలు నియోజకవర్గంలోని గ్రామాల్లో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగం జనార్దన్‌రెడ్డి ఓటమి పాలవ్వడంతో పార్టీకి చెందిన క్యాడర్ మొత్తం నిస్తేజంలో ఉండిపోయింది. పార్టీకి ఎంపీగా పోటీచేస్తున్న మల్లు రవి నాగర్‌కర్నూల్‌కు పాత వ్యక్తి కావడం, కొంత మంది మద్దతు ఉన్నారు. పోటీ.. హోరాహోరీ నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల ముందు టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఫలితాలు రావడంతో నియోజకవర్గంలో పరిస్థితులు కూడా మారాయి. ఎన్నికల తర్వాత కొంత మంది కాంగ్రెస్ నాయకులు పార్టీలో ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించడానికి కూడా క్యాడర్ లేని పిరిస్థితి నెలకొందనేది కొందరి వాదన. ఇటీవల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కొంత ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బండారు శ్రుతి ఇప్పటికే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో తన ప్రచారం ముమ్మరం చేసింది. బీజేపీలో ఉన క్యాడర్ మొత్తం తనకు సహకరిస్తుండడంతో ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. -
మోగిన ఎన్నికల నగారా..గెలుపెవరిదో.!
సాక్షి, మైదుకూరు(చాపాడు) : అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఆదివారం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గంలో తమ బలాబలాలను బేరీజు వేసుకునేందుకు ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉండగా.. మేము సైతం పోటీలో అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఉండగా.. తాము ఉన్నారో లేదో ఇప్పటి వరకూ జనసేన తమ మిత్రపక్ష పార్టీలో తెరపైకి రాలేదు. నేటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ వేడి.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆదివారం విడుదల కావటంతో సాయంత్రం నుంచే మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఆయా పార్టీలకు చెందిన నేతలు, నాయకులు, కార్యకర్తలు ప్రచార వ్యూహ రచనలో పడ్డారు. సాయంత్రం 5 గంటల నుంచి అన్ని మండలాల్లోని కూడళ్లు, టీ కొట్లు, స్టాపింగ్లతో పాటు సోషల్ మీడియాలో సామాన్యుడి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలపైనే చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నియోజకవర్గ వ్యాప్తంగా మూడేళ్లుగా పలు రకాలైన కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటోంది. వైఎస్సార్సీపీ–టీడీపీ మధ్యే ప్రధాన పోటీ.. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో సైతం ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే నెలకొం ది. శెట్టిపల్లె రఘురామిరెడ్డి– వైఎస్సార్సీపీ, పుట్టా సుధాకర్‌యాదవ్–టీడీపీ మధ్య పోటీ ఉండగా.. తమ పార్టీ ఉందని కాంగ్రెస్ అభ్యర్థిగా కోటయ్యగారి మల్లికార్జునమూర్తి గత కొంత కాలంగా గ్రామాల్లో తిరుగుతూ కాం గ్రెస్ పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా వైఎస్సార్సీపీ గడప గడపకు వైఎస్సార్సీపీ, గతేడాది నుంచి రావాలి జగ న్ కావాలి జగన్ అంటూ ఎమ్మెల్యే రఘురా మిరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పుకుంటూ ప్రజలను కలుసుకుంటున్నారు. రెండేళ్లుగా టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఏడాదిగా చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ విధులు నిర్వర్తిస్తూ నియోజకవర్గ ప్రజలకు కాస్త దూరంగా ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. -
అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ: ఒబామా
జాక్సన్ విల్లే: అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ గట్టిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ బాగా పుంజుకున్నారని సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చూడాలని మద్దతుదారులకు ఒబామా సూచించారు. అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన ఫ్లోరిడాలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాక్సన్ విల్లేలో మద్దతుదారులకు ఉద్దేశించి ప్రసంగించారు. 'అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ తప్పదు. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికల్లో మనం గెలవకపోతే గత ఎనిమిదేళ్లలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా నిరూపయోగమవుతుంది. వచ్చే ఐదు రోజులు మనసుపెట్టి పనిచేయండి. ఈ ఎన్నికలపైనే మన భవిష్యత్ ఆధారపడివుందని గుర్తుంచుకోవాల'ని ఒబామా అన్నారు. శ్వేతసౌధంలో అడుగుపెట్టే అర్హత ట్రంప్ కు లేదని ఆయన పునరుద్ఘాటించారు. హిల్లరీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
టఫ్ ఫైట్
-
జాకీచాన్ రేంజ్లో వడివేలు ఫైట్
చెన్నై: వడివేలు అని పేరు వింటుండగానే చటుక్కున మన ముఖాల్లో నవ్వులు విరబూస్తుంటాయి. స్వతహాగా తమిళ హాస్య నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో ఆయన భాష పలికే తీరు, ఆ సమయంలో హావభావాలు కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి. అయితే, ఎప్పుడూ నవ్వించే ఆయన ఈసారి మాత్రం ఔరా అని అనిపించనున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఈసారి హీరోల మాదిరిగా గాల్లో ఎగురుతూ ఫైట్ చేయనున్నారు. అవి అలాంటిఇలాంటి పోరాటాలు కాదు.. ఏకంగా జాకీచాన్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉండేలా ఆయన ఫైట్ చేయబోతున్నారు. ఎప్పుడూ తనను హాస్య నటుడుగానే చూసే ప్రేక్షకులు ఫైట్ చేసే హీరోగా చూడలేరని, తాను ఈసీన్ చేయలేనని చెప్పినా.. డైరెక్టరే స్వయంగా పట్టుబట్టి మరీ ఈ సీన్ చేయిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్ర డైరెక్టర్ యువరాజ్ స్వయంగా చెప్పారు. గత కొన్ని రోజులుగా తెరమరుగైనా వడివేలు ఇప్పుడు 'ఎలి' అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్రంలోనే ఈ పైట్లు కనిపించబోతున్నాయి. -
టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఎక్కువ పోటీ!
25న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన సాక్షి, రంగారెడ్డి జిల్లా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రాజకీయ పార్టీల్లో భిన్న అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఆదివారం నాటి పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్యే ఎక్కువ పోటీ ఉన్నట్లు కనిపించింది. గత రెండు దఫాలుగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కె.నాగేశ్వర్ అనూహ్య విజయం సాధించగా.. ఈసారి స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా 31మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. జిల్లాలో మాత్రం టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ శాసన మండలి ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ఎన్నుకోవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 31 మంది పోటీలో నిలిచారు. ఇందులో అభ్యర్థులందరికీ ఓటు వేయొచ్చు. కానీ ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అభ్యర్థులకు ఓటు వేయాలి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకే కాకుండా స్వతంత్రంగా నిలిచిన వారికి సైతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో తొలి రెండు ప్రాధాన్యత ఓట్లు టీఆర్ఎస్, బీజేపీలకు పోలయినట్లు తెలుస్తోంది. అటు ఇటుగా.. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఉద్యోగ సంఘం నేత దీవీప్రసాద్ పోటీ చేయగా.. బీజేపీ తరపున ఎన్.రాంచందర్‌రావు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం తోడవడంతో పాటు ఉద్యోగ సంఘాలు సైతం మద్దతుగా నిలిచాయి. దీంతో మెజార్టీ ఓట్లు తమకే వస్తాయని భావించి.. ఆ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ క్రమంలో జిల్లాలోని కొన్ని ఉద్యోగ సంఘాల్లో కొంత చీలిక రావడం, ఎక్కువ ఓటర్లుగా ఉన్న టీచర్లు దేవీప్రసాద్ అభ్యర్థిత్వానికి సహకరించకపోవడంతో పరిస్థితి కొంత తారుమారైంది. అదే తరుణంలో బీజేపీ అభ్యర్థికి ఏబీవీపీ, టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్లు బాసటగా నిలిచాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలు అంతర్గతంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఓటర్లను ఆకర్షించడంతో తమదైన శైలిలో ముందుకెళ్లారు. దీంతో చివరి నిమిషంలో వారికి మద్దతు పెరిగింది. మొత్తంగా ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో ఒకరు విజయం సాధిస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ జిల్లాలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో ఈ పరిస్థితి ఎవరికి మేలు కానుందో వేచిచూడాల్సిందే. ఈ నెల 25న ఓట్ల లెక్కింపుల్లో జాతకాలు బయటపడనున్నాయి. -
''మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు గట్టిపోటి ఇచ్చాం''