సాక్షి, మైదుకూరు(చాపాడు) : అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఆదివారం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గంలో తమ బలాబలాలను బేరీజు వేసుకునేందుకు ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉండగా.. మేము సైతం పోటీలో అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఉండగా.. తాము ఉన్నారో లేదో ఇప్పటి వరకూ జనసేన తమ మిత్రపక్ష పార్టీలో తెరపైకి రాలేదు.
నేటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ వేడి..
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆదివారం విడుదల కావటంతో సాయంత్రం నుంచే మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఆయా పార్టీలకు చెందిన నేతలు, నాయకులు, కార్యకర్తలు ప్రచార వ్యూహ రచనలో పడ్డారు.
సాయంత్రం 5 గంటల నుంచి అన్ని మండలాల్లోని కూడళ్లు, టీ కొట్లు, స్టాపింగ్‌లతో పాటు సోషల్ మీడియాలో సామాన్యుడి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలపైనే చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ వ్యాప్తంగా మూడేళ్లుగా పలు రకాలైన కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటోంది.
వైఎస్సార్‌సీపీ–టీడీపీ మధ్యే ప్రధాన పోటీ..
2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో సైతం ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే నెలకొం ది. శెట్టిపల్లె రఘురామిరెడ్డి– వైఎస్సార్‌సీపీ, పుట్టా సుధాకర్‌యాదవ్–టీడీపీ మధ్య పోటీ ఉండగా.. తమ పార్టీ ఉందని కాంగ్రెస్ అభ్యర్థిగా కోటయ్యగారి మల్లికార్జునమూర్తి గత కొంత కాలంగా గ్రామాల్లో తిరుగుతూ కాం గ్రెస్ పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.
మూడేళ్లుగా వైఎస్సార్‌సీపీ గడప గడపకు వైఎస్సార్‌సీపీ, గతేడాది నుంచి రావాలి జగ న్ కావాలి జగన్ అంటూ ఎమ్మెల్యే రఘురా మిరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పుకుంటూ ప్రజలను కలుసుకుంటున్నారు. రెండేళ్లుగా టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఏడాదిగా చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ విధులు నిర్వర్తిస్తూ నియోజకవర్గ ప్రజలకు కాస్త దూరంగా ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment