mydukuru
-
తాడిపత్రి, మైదుకూరు ఎవరి వైపు?
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి, వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. దీంతో ఈ రెండుచోట్లా ఏ పార్టీకి చైర్పర్సన్ పీఠం దక్కుతుందో అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయగా.. ఈ 2 మున్సిపాలిటీల్లో మాత్రం వైఎస్సార్సీపీతో టీడీపీ పోటాపోటీగా నిలిచింది. కానీ, సొంతంగా చైర్పర్సన్ పదవిని దక్కించుకునే మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ సాధించలేకపోయాయి. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగే 18వ తేదీపైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఆ రోజు అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ రెండుచోట్లా ఎక్స్అఫిషియో సభ్యుల ఓట్లూ కీలకంగా మారనున్నాయి. మైదుకూరులో ఎక్స్ ఆఫిషియో ఓట్లు వైఎస్సార్సీపీకే ఎక్కువ మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం 26 ఓట్లు ఉన్నట్లు లెక్క. ఇందులో 14 ఓట్లు ఏ పార్టీకి వస్తే వారికి చైర్పర్సన్ పదవి దక్కుతుంది. ఇక్కడ మొత్తం 24 వార్డుల్లో వైఎస్సార్సీపీ 11 చోట్ల, తెలుగుదేశం 12 చోట్ల, జనసేన ఒక స్థానంలో గెలుపొందాయి. వైఎస్సార్సీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప లోకసభ సభ్యుడు అవినాష్‌రెడ్డి మైదుకూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకోవడంతో ఇక్కడ వైఎస్సార్సీపీ బలం 13కు పెరిగింది. జనసేన టీడీపీకి మద్దతు పలకని పక్షంలో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఒకవేళ టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చినా కూడా టీడీపీకి చైర్పర్సన్ పదవి దక్కదు. ఎందుకంటే.. జనసేనతో కలిపి టీడీపీ బలం 13కు పెరిగి వైఎస్సార్సీపీతో సమానమవుతుంది. ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే టాస్ వేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. తాడిపత్రిలోనూ అదే గందరగోళం.. మైదుకూరు మాదిరిగానే తాడిపత్రిలో మున్సిపాల్టీలోనూ సస్పెన్స్ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18చోట్ల.. వైఎస్సార్సీపీ 16 చోట్ల విజయం సాధించాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొకచోట గెలుపొందారు. ఇక్కడ స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఎక్స్అఫిషియో ఓటును ఇప్పటికే నమోదు చేసుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ బలం 17కి పెరిగింది. అనంతపురం ఎంపీ రంగయ్య ఇప్పటి దాకా తన ఎక్స్ అఫిషియో ఓటు ఇంకా ఎక్కడా నమోదు చేసుకోలేదని మున్సిపల్ శాఖ అధికారులు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్–5 క్లాజ్ (3) ప్రకారం.. పొలింగ్ తేదీ తర్వాత 30 రోజుల్లోపు ఆయన ఎక్కడో ఒకచోట తన పేరును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో తలారి రంగయ్య తన ఓటును తాడిపత్రి మున్సిపాలిటీలో నమోదు చేసుకునే పక్షంలో అక్కడ వైఎస్సార్సీపీ బలం కూడా 18కు పెరిగి టీడీపీతో సమానంగా ఉంటుంది. అప్పుడు సీపీఐ, స్వతంత్ర సభ్యుల ఓట్లు కీలకంగా మారతాయి. వారు ఎవ్వరికీ మద్దతివ్వని పక్షంలో.. లేదా చేరొక పార్టీకి మద్దతిచ్చినా ఇక్కడా టాస్ తప్పకపోవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఇద్దరూ కలిసి ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ చైర్పర్సన్ పీఠం దక్కించుకుంటుంది. మొత్తంగా ఇక్కడా చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. మైదుకూరులో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన టీడీపీ సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మునిసిపాలిటీ ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మునిసిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. వైఎస్సార్సీపీ 11 వార్డుల్ని, టీడీపీ 12 వార్డులు, జనసేన ఒక వార్డు గెలుచుకున్నాయి. మునిసిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యత రావాలంటే 13 వార్డులు గెలవాల్సి ఉంది. ఈ మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫిషియో సభ్యులు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి 13 మంది ఉన్నట్లవుతుంది. దీంతో ఈ మునిసిపాలిటీ వైఎస్సార్సీపీకే దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ తమ 12 మంది వార్డు సభ్యులను ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయానికి తరలించారు. సభ్యులపై నమ్మకంలేక వారిని నిర్బంధించినట్లు సమాచారం. మరోవైపు జనసేన సభ్యుడితోనూ టీడీపీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రహస్య ప్రాంతానికి టీడీపీ విజేతలు తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఇక్కడ హంగ్ ఏర్పడడంతో తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. వారు ఎక్కడ జారిపోతారోనని ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే ఆయన వారందరినీ తన నివాసంలోనే నిర్బంధించారు. అభ్యర్థుల తరఫున కేవలం ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం టీడీపీ విజేతలందరినీ రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. -
‘నిరూపించకపోతే సెంటర్లో నిలబడి లెంపలేసుకో’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అటవీ భూముల ఆక్రమణపై టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపణలను మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆసైన్మెంట్ కమిటీ ద్వారా ఎంతో మంది పేదలకు పట్టాలు ఇచ్చినట్లు, బి.మఠంలో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. తను అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు చేసిన ఆరోపణలను నెల రోజుల్లో నిరూపించాలని పుట్టా సుధాకర్ యాదవ్‌కు సవాల్ విసిరారు. (బలమైన శక్తుల పేర్లు ఉన్నందు వల్లేనా!?) ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే హక్కు లేదన్నారు. తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. (ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా విజేతలు!) -
మానవత్వం చాటిన ఎమ్మెల్యే
సాక్షి, మైదుకూరు(కడప) : బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి వెళుతూ అప్పుడే జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పట్ల మానవత్వం చూపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బి.మఠం మండలంలోని పెద్దిరాజుపల్లెలో రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి జీవీ సత్రం మీదుగా కారులో వెళుతున్నారు. జెడ్పీ హైస్కూల్ సమీపంలో మోటారు సైకిల్‌ను లారీ ఢీ కొనడంతో మోటారు సైకిల్‌పై వెళుతున్న ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కారును ఆపి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడి వివరాలు తెలుసుకున్నారు. బి.కోడూరు మండలం మేకవారిపల్లెకు చెందిన గురవయ్య అని తెలుసుకున్నారు. బాధితుడి పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చికిత్స కోసం రూ.10వేలు నగదును అందజేశారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పరిసరాల్లోని ప్రజలు ఎమ్మెల్యే ఔదార్యాన్ని ప్రశంసించారు. -
మైదుకూరులో రెండు వర్గాల మధ్య తోపులాట
-
ఎంతరా.. మీ బ్రతుకులు?
-
చంద్ర‘గృహ’ణం
స్థల సేకరణకే పరిమితం:ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం హుళక్కి మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలో ఎన్టీఆర్ అర్బన్ గృహ నిర్మాణం పథకం స్థలసేకరణకే పరిమితమైంది. మున్సిపాలిటీకి 920 ఇళ్లు మంజూరైనా వాటి నిర్మాణం కోసం స్థల సేకరణపైనే కాలం కరిగిపోయి జాప్యం జరిగింది. స్థానిక వనిపెంట రోడ్డులోని ఇందిరమ్మ కాలనీకి దగ్గరలో సర్వే నంబర్ 1963లో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం కోసం 12 ఎకరాల స్థలాన్ని సేకరించారు. గత ఏడాది డిసెంబర్ 11న జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న ఆ స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇళ్ల నిర్మాణం కోసం ఆ 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారా లేదా అనే విషయాన్ని రెవెన్యూ అధికారులు వెల్లడించలేదు కానీ మున్సిపల్ అధికారులు మాత్రం స్థలాన్ని సేకరించినట్లు చెబుతున్నారు. 920 ఇళ్లకు 6వేలు దరఖాస్తులు ఎన్టీఆర్ అర్బన్ హౌసెస్ కింద మున్సిపాలిటీకి 6వేల మంది ఇళ్లులేని నిరుపేదల నుంచి దరఖాస్తులు అందాయి. అయితే 920 ఇళ్లు మాత్రమే మంజూరు కావడంతో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు 1400 దరఖాస్తులను పరిశీలించారు. పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై), హౌసింగ్ ఫర్ ఆల్ (ఎన్టీఆర్ నగర్)లో అపార్ట్మెంట్ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దీన్ని కాంట్రాక్టు తీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్ వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఇళ్లు నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో సరోజినీ నగర్ వద్ద దీన్ని మొదలు పెట్టారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్, రాయచోటి, ఎర్రగుంట్లలో ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. షియర్ వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఈ ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లు ఎంత పటిష్టంగా ఉంటాయో ఉన్న అనుమానంతో ప్రజలు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపలేదు. సాధారణంగా చిన్న ఇళ్లకు సైతం 12ఎంఎం ఇనుప కడ్డీలు వాడుతారు, అపార్ట్మెంట్లకైతే 16 ఎంఎం కడ్డీలు వాడుతుంటారు. ఎన్టీఆర్ హౌసింగ్‌లో నిర్మించే ఈ ఇళ్లకు మాత్రం కేవలం 8ఎంఎం సైజు కడ్డీలు ఉపయోగించి బెత్తెడు వెడల్పు మందంతో గోడలు నిర్మించారు. 8ఎంఎం కడ్డీలతోనే జీ ప్లస్ 3 అపార్ట్మెంట్లు నిర్మించారు. స్లాబ్ మందం మాత్రం 6 ఇంచ్‌లు వేస్తుండటంతో ఆ బరువును నాలుగు ఇంచ్ మందం ఉన్న గోడలు ఎంతమేరకు భరిస్తాయోనన్న అనుమానాలు ఉన్నాయి. ఏ ఇంటికైనా స్లాబ్ వేసినప్పుడు కనీసం 18 రోజులైనా క్యూరింగ్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఇళ్లు మొత్తం సిమెంటు కాంక్రీటుతోనే నిర్మిస్తున్నందున ఈ తరహాలోనే క్యూరింగ్ చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ మాత్రం వాల్‌షీట్లు వేసి అందులో సిమెంటు కాంక్రీటు వేసి ఆరిపోగానే తీసివేస్తున్నారు. ఏడు రోజులు మాత్రమే నీళ్లు పోసి క్యూరింగ్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇంటి నిర్మాణాలు పగుళ్లు బారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ హామీతో ముందుకొచ్చిన లబ్ధిదారులు ఎన్టీఆర్ నగర్లో ప్లాట్లు తీసుకోవడానికి మొదట ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇళ్లన్నీ తక్కువ విస్తీర్ణంలో అగ్గిపెట్టెల తరహాలో ఉండటం, బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బు లక్షల్లో ఉండటం, సన్నటి కడ్డీలతో నిర్మించడం వల్ల నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరాపై ఉన్న అనుమానాలతోనే చాలా మంది ముందుకు రాలేదు. ఇళ్లకు సరఫరా చేసే నీటి ట్యాంకులు చిన్నవిగా ఉండటం కూడా మరో కారణం. కాగా ఎన్టీఆర్ నగర్లలో ఇళ్లు పొందిన లబ్ధిదారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బ్యాంకులకు కంతులు చెల్లించే అవసరం లేకుండా ఆ ఇళ్లను వారిపేరుతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో వాటికి డిమాండ్ పెరిగింది. మొదట కొంత మొత్తం చెల్లించి ప్లాట్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా ఇల్లు వస్తుంది కదా అని కొందరు ముందుకు వచ్చి ప్లాట్లు తీసుకున్నారు. మొండిగోడలతో దర్శనమిస్తున్న ఇళ్లు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద మూడు దశల్లో మొత్తం 19232 ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాగా మొదటి దశలో మొత్తం 4092 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కడపలో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. రెండవ దశలో 13213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2281, ప్రొద్దుటూరులో 2150, బద్వేల్లో 808, రాయచోటిలో 1011, రాజంపేటలో 1279, ఎర్రగుంట్లలో 2046, జమ్మలమడుగులో 1415, పులివెందులలో 2143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడవ దశలో 1927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా ఇందులో మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. కాగా మైదుకూరు మినహా అన్ని మున్సిపాలిటీల్లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే అన్ని ప్రాంతాల్లో ఇళ్లన్నీ అసంపూర్తిగా మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. కడప, జమ్మలమడుగులో నిర్మిస్తున్న ప్లాట్లు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. కడపలో 2600 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 940 ఇళ్లు మాత్రమే పూర్తి కావడంతో, 670 ఇళ్లే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రెండవ దశలో ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. జమ్మలమడుగులో కూడా అరకొరగానే ఇళ్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ నగర్ పనులు చేపట్టి ఉంటే ఈ పాటికి అన్ని ఇళ్లు పూర్తయి ఉండేవి. కానీ ఆఖరు సంవత్సరంలో పనులు మొదలు పెట్టడం వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇళ్లే పూర్తికాని ఎన్టీఆర్ నగర్లలో రోడ్లు, కాలువలు, విద్యుత్, డ్రై నేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు అసలే కల్పించలేదు. అసంపూర్తి నిర్మాణాలు రాయచోటి అర్బన్:రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుండుపల్లె మార్గంలో 13. 11 ఎకరాల విస్తీర్ణంలో పిఎంఏవై, అర్బన్ ఎన్టిఆర్ హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2017–18 సంవత్సరానికి గా ను ఫేజ్– 2 కింద రాయచోటికి 1011 ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనుల వేగం పూర్తి స్థాయిలో మందగించింది. ఇళ్ల మంజూరు కోసం 1011మందిలో కేవలం 290 మంది లబ్ధిదారులు మాత్రమే డిపాజిట్ సొమ్మును చెల్లించారు. డిపాజిట్ చెల్లించిన 290 మందిలో కూడా 200 మందికే అధికారులు బ్లాకులలో ప్లాట్లు కేటాయించి మిగిలిన వారికి మంజూరు చేయలేదు. పునాదులకే పరిమితమైన బ్లాకుల నిర్మాణం పనులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా సెంటులోపే ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇస్తాయి. 300 చదరపు అడుగులు(రూ.6.03లక్షలు), 365 చదరపు అడుగులు(రూ.7.08లక్షలు), 430 చదరపు అడుగులు(రూ.8.20లక్షలు) వంటి మూడు కేటగిరీలలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఈ మొత్తంలో ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు బ్యాంకుకు కంతుల రూపేణ చెల్లించాలి. రెండు, మూడు కేటగిరి ఇళ్లను ఎంచుకునే వారు లబ్ధిదారుని వాటా కింద వరుసగా రూ.50వేలు, లక్ష రూపాయలు నాలుగు విడతల్లో చెల్లించాలి. ఇందులో మొదటి రెండు కేటగిరీలు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లుకాగా, మూడో కేటగిరి డబుల్బెడ్రూమ్ ఇళ్లు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఎడమ వైపు న ఉన్న ఇళ్లకు బెడ్రూమ్కు వంటగదికి మధ్య బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేశారు. ఎవరూ కూడా వంటగది పక్కన బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోరు. అలాంటిది ఎన్టీఆర్ నగర్ ఇళ్లలో ఇలా ఉండటంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు కేటగిరిల్లో పెద్దదిగా చెప్పబడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం సెంటు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ భారం మోయలేం ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డుల్లో నివాసం ఉంటున్న పేదలకు హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద మొదటి విడతలో 2000 గృహాలు, రెండో విడతలో 2,150 గృహాలు మంజూరయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రజలకు చెప్పినట్లు ఉచితంగా ఇళ్లు కట్టివ్వకపోగా ఒక్కొక్కరిపై రూ.8 లక్షల భారం మోపడంతో లబ్ధిదారులు ఎవ్వరూ ఈ ఇళ్లు తీసుకునేందుకు ముందుకు రాలేదు. మూడు రకాల ఇళ్లు కట్టిస్తున్నామని రూ.500 కడితే ఇళ్లు సొంతం అవుతుందని మొదటలో అధికార పార్టీ నేతలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత రూ.2.65 లక్షలు బ్యాంకు నుంచి రుణం కాంట్రాక్టర్ తీసుకొని దాన్ని ప్రజలు 20 ఏళ్లపాటు ప్రతి నెల అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.3000 కట్టాల్సి వస్తుందని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రెండో రకం ఇంటికి లబ్ధిదారుడు రూ.50వేలు, మూడో రకం ఇంటికి రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఉచితం అయితే తీసుకుంటాం కానీ డబ్బు మా వద్దలేదని ప్రజలు అధికార పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ఇప్పటి దాకా కేవలం 850 ఇళ్లకే అంగీకార పత్రాలు వచ్చాయి. పైన పటారం.. లోన లొటారం కడపలో సరోజినీ నగర్ వద్ద కట్టిన ఎన్టీఆర్ నగర్ ఇళ్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఐదేళ్లు పూర్తయినా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అర్బన్ హౌసింగ్ పథకం కింద అపార్ట్మెంట్ పద్ధతిలో ముక్కాలు సెంట్లో నిర్మించే ఇంటికి రూ.8లక్షలకుపైగా పేదలు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు సబ్సిడీతోనే ఇల్లు నిర్మించే అవకాశం ఉన్నా బ్యాంకు రుణాల పేరుతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. – ఉస్మాన్, ప్రొద్దుటూరు పిచ్చుకగూళ్లు..! జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు పట్టణ వాసులకు గూడెంచెరువు సమీపంలో 1415 మందికి మూడు రకాల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణానికి దాదాపు మూడున్నర కిలోమీటర్లు దూరంగా ఉండటంతో ప్రజలు అంతదూరం వెళ్లాలా అంటూ మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు.. ఏపీ టిట్కో ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాలు సక్రమంగా లేవనే విమర్శలు వస్తున్నాయి. భవన నిర్మాణాల కోసం ఏర్పాటు చేసిన కడ్డీలు బయట పడుతున్నాయి. కొన్ని చోట్ల అపార్టుమెంట్‌కు నెర్రెలు చీలుతున్నాయి. ఇవన్నీ చూసిన లబ్ధిదారులు ఈ అపార్టుమెంట్ ఎంతకాలం నిలబడుతుందో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చేనేతలకు ఉపయోగకరంగా లేవు.. నియోజకవర్గంతోపాటు జమ్మలమడుగు పట్టణంలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వారు మగ్గం పెట్టుకోవటానికి విశాలమైన స్థలం కావాలి. అపార్టుమెంట్ నిర్మాణం చేసి ఇస్తే ఉండటానికి మాత్రమే పనికి వస్తాయి. పనులు చేసుకోవటానికి పనికిరావు. చేనేతలు ఎలా బతుకుతారు. – రమేష్, చేనేత ఐక్యవేదిక నియోజకవర్గ కన్వీనర్ క్యూరింగ్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు పేద ప్రజల కోసం నిర్మించే ఇళ్లు పది కాలాల పాటు ఉండాలి. అలాంటి నిర్మాణాల్లో ఏపీ టిట్కో కంపెనీ అధికారులు భవనాలకు క్యూరింగ్ లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారు. ఇద్దరు నివాసం ఉండటానికి ఇళ్లు సరిపోతాయి. మూడో వ్యక్తి ఇంట్లోకి వెళితో మరో వ్యక్తి బయటికి రావాల్సిందే. – పి.నాగేశ్వరరెడ్డి, గూడెంచెరువు. -
చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు
-
పుట్టా సుధాకర్‌కు చేదు అనుభవం
-
పుట్టా సుధాకర్‌ను బూతులు తిడుతూ...
సాక్షి, చాపాడు : టీటీపీ ఛైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో నిలబడ్డ పుట్టా సుధాకర్‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. చాపాడు మండలంలోని సీతారామపురం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనకు సొంత పార్టీ కార్యకర్తలే దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఏం చేశావని ఓటు అడగటానికి వచ్చావంటూ పుట్టా సుధాకర్‌ను పచ్చి బూతులు తిడుతూ నిలదీశారు. ఏ ఒక్క సాయం చేకుండా అయిదేళ్లు దోచుకుని, ఇప్పుడు ఓట్లు కోసం వస్తారా అంటూ రాయడానికి వీలులేని భాషలో నోటికి పని చేశారు. తక్షణమే అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ వాగ్వివాదానికి దిగారు. దీంతో బిక్కచచ్చిపోయిన పుట్టా సుధాకర్....చేసేదేమీ లేకా అక్కడ నుంచి మౌనంగా వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మోగిన ఎన్నికల నగారా..గెలుపెవరిదో.!
సాక్షి, మైదుకూరు(చాపాడు) : అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఆదివారం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గంలో తమ బలాబలాలను బేరీజు వేసుకునేందుకు ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉండగా.. మేము సైతం పోటీలో అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఉండగా.. తాము ఉన్నారో లేదో ఇప్పటి వరకూ జనసేన తమ మిత్రపక్ష పార్టీలో తెరపైకి రాలేదు. నేటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ వేడి.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆదివారం విడుదల కావటంతో సాయంత్రం నుంచే మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఆయా పార్టీలకు చెందిన నేతలు, నాయకులు, కార్యకర్తలు ప్రచార వ్యూహ రచనలో పడ్డారు. సాయంత్రం 5 గంటల నుంచి అన్ని మండలాల్లోని కూడళ్లు, టీ కొట్లు, స్టాపింగ్లతో పాటు సోషల్ మీడియాలో సామాన్యుడి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలపైనే చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నియోజకవర్గ వ్యాప్తంగా మూడేళ్లుగా పలు రకాలైన కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటోంది. వైఎస్సార్సీపీ–టీడీపీ మధ్యే ప్రధాన పోటీ.. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో సైతం ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే నెలకొం ది. శెట్టిపల్లె రఘురామిరెడ్డి– వైఎస్సార్సీపీ, పుట్టా సుధాకర్‌యాదవ్–టీడీపీ మధ్య పోటీ ఉండగా.. తమ పార్టీ ఉందని కాంగ్రెస్ అభ్యర్థిగా కోటయ్యగారి మల్లికార్జునమూర్తి గత కొంత కాలంగా గ్రామాల్లో తిరుగుతూ కాం గ్రెస్ పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా వైఎస్సార్సీపీ గడప గడపకు వైఎస్సార్సీపీ, గతేడాది నుంచి రావాలి జగ న్ కావాలి జగన్ అంటూ ఎమ్మెల్యే రఘురా మిరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పుకుంటూ ప్రజలను కలుసుకుంటున్నారు. రెండేళ్లుగా టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఏడాదిగా చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ విధులు నిర్వర్తిస్తూ నియోజకవర్గ ప్రజలకు కాస్త దూరంగా ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. -
మైదుకూరులో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం
-
మైదుకూరులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
వైఎస్సార్సీపీ నేతల రాస్తారోకో
సాక్షి, వైఎస్సార్ : కేసీ కెనాల్ నుంచి సాగునీరు విడుదల చేయాలంటూ మైదుకూరు నేషనల్ హైవేపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రఘరామిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా పాల్గొన్నారు. ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది
మైదుకూరు టౌన్: భర్తను కాదని వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తనను భర్త ఎలాగైనా చంపేస్తాడనే భయంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళ ఉదంతమిది. మైదుకూరు మండల గంగవరం గ్రామానికి చెందిన అందె లక్ష్మినరసయ్య(47) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు మైదుకూరు డీఎస్పీ బి.ఆర్. శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మైదుకూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన అందె లక్ష్మినరసయ్యకు 25 ఏళ్ల క్రితం రమణమ్మతో వివాహమైంది. వీరికి కూతురు జయలక్ష్మి, కుమారుడు సురేష్‌బాబులు ఉన్నారు. అయితే భార్య ప్రవర్తనను అనుమానించిన లక్ష్మినరసయ్య రమణమ్మను కువైట్‌కు పంపాడు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు 2003లో హత్యకు గురయ్యాడు. కుమారుడి మృతి అనంతరం భార్యభర్తల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం కువైట్ నుంచి వచ్చిన రమణమ్మ మైదుకూరులోనే నరసింహులు అలియాస్ సన్నోడు అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తనను ఎలాగైనా భర్త చంపుతాడనే భయంతో రమణమ్మ ప్రియుడు సన్నోడుతో కలిసి భర్తను హత్య చేయాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈనెల 10వతేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కశెట్టి వెంకటేష్‌ను గ్రామంలోకి పంపించి అతని ట్రాక్టర్లో లక్ష్మినరసయ్యను పిలుచుకుని రమ్మని చెప్పారు. ఆ మేరకు వెంకటేష్ తన ట్రాక్టర్లో లక్ష్మినరసయ్యను ఎక్కించుకొని వనిపెంటలోని ఓ వైన్‌షాపులో మద్యం తాపించి బ్రహ్మంగారి మఠం వెళ్లే దారివైపు తీసుకెళ్లాడు. బహిర్భూమికి వెళ్లాలనే సాకు చూపి ట్రాక్టర్‌ను డ్రైవర్ తెలుగుగంగ కాలువ వద్ద ఆపాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడ మాటు వేసి ఉన్న సన్నోడు తన వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మినరసయ్య తలపై నరికాడు. అంతేకాకుండా కసితీరా గొంతు కోసి కాలువలో పడేశాడు. నిందితులు సన్నోడు,రమణమ్మ, ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారు ఉపయోగించిన ట్రాక్టర్, కత్తి, ద్విచక్రవాహనం, 3సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు రామకృష్ణ, లక్షుమయ్య పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మైదుకూరు టౌన్ : ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ ఎన్ఎంయూ కార్మికులు డిపో గేట్ వద్ద ఎర్రబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి వి.ఎస్ రాయుడు మాట్లాడుతూ కార్మికులకు రావాలసిన బకాయిలు, కార్మికులపై యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు అన్నిడిపోల వద్ద ధర్నా, ఎర్రబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తుందన్నారు. కార్మికులకు గత ఏడాది నుంచి ఇవ్వవలసిన డీఏ బకాయిలు, సమైక్యాంద్ర ఉద్యమంలో 60 రోజులను స్పెషల్ లీవ్‌ల పరిగణించాలని, 2017 వ సంవత్సరంలో ఏప్రియల్ నుంచి నూతన స్కేల్ పై తక్షణం స్పందించి జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరిని రెగ్యులర్ చేయడంతో పాటు కార్మికుల పై పెడుతున్న పనిభారాన్ని తగ్గించి తదితర డిమాండ్లు వెంటనే పరిష్కారించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఇలానే వ్యవహరిస్తూ పోతే రాబోవు కాలంలో తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాశం శీనయ్య, టి.పీ మునెయ్య, రమణారెడ్డి, పీ.వీ ఆంజనేయులు, కె.సీ కొండయ్య, జెవీఎస్ రెడ్డి, ఆచారీ, వినోద్‌కుమార్, ఎంసీ నాయక్, యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కబేళాలకు తరలుతున్న పశువులు
– పట్టించుకోని ప్రభుత్వాలు – పోషణభారమై సంతలో విక్రయిస్తున్న రైతులు – నిత్యం మైదుకూరు సంతలో వందల గేదలు కలేబరాలకు తరలింపు మైదుకూరు టౌన్: రోజు రోజుకు పశువుల పోషణ భారమై.. పాల ఉత్పత్తి దూరమై ప్రజలు సంతలో పశువులను కలేబలాలకు తరలిస్తున్నారు. పాడి ఉన్న ఇంట్లో సిరి సంపనలకు కొదవ ఉండేది కాదని ఒకప్పటి మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాడి పోషణ రైతులకు భారంగా మారింది. శనివారం వచ్చిందంటే చాలు సంతలో పోషణ భారమైన పోషించలేక కబేళాకు తరలిస్తున్న ఘటనలు మైదుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. నియోజవర్గంలో పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్న బి.మఠం, దువ్వూరు, వనిపెంట, మైదుకూరులో వేలాది మంది రైతులు జీవిస్తున్నారు. ఒక్కసారిగా పాడి పరిశ్రమ దెబ్బతినడుటంతో రైతులు తీవ్రం గా నష్టపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లోని రైతులు పాడి పరిశ్రమకు స్వస్తి పలుకుతుండడంతో పాల కొరత ఏర్పడుతోంది. ఆహార పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు పాడిపరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో పాడి పరిశ్రమ కూడా సంక్షోభంలో కూరుకుపోతుండంతో రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ సాగు సమయంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొనడంతో దిగుబడి చేతికందక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వేసవిలో పశుగ్రాసం కొరత ఉండడంతో పల్లెలో పాలు ఉత్పత్తికి గడ్డుకాలం దాపురించింది. పశుగ్రాసం, దానా తదితర ఖర్చులు రెట్టింపు పెరగడంతో పాడి పెంపకంపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. లీటరు రూ.55 చెల్లిద్దామన్నా నాణ్యమైన పాలు దొరకడం లేదు. భారమైన పశుపోషణ: గతంలో గేదెలను మేతకు పొలానికి తోలుకెళ్లేతే పశువుల కాపర్లకు ఏడాదికి రూ.15వేలు చెల్లిస్తే సరిపోయోది. ప్రస్తుతం రూ. 40వేలు చెల్లించినా పశువుల కాపరులు దొరకడం లేదు. దీనికి తోడు పశువుల ధరలు అమాంతంగా పెరిగాయి. వేసవికాలంలో వర్షాభావం కారణంగా పల్లెల్లో గడ్డిపోచ కరువైంది. ఎక్కడా పశువులకు మేత దొరకని పరిస్థితి. గేదెలను మేపడం వీలుకాక చాలామంది పాడి రైతులు ఒకటి, రెండు గేదెలతో సరిపెట్టుకొంటున్నారు. మిగిలిన వాటిని అమ్మేసుకుంటున్నారు. పాడి ఆవులు, గేదెలకు అందించే గడ్డితోపాటు దాణా, తౌడు ధరలు పూర్తిగా పెరిగిపోయాయి. గిట్టుబాటు కాకా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఎండుగడ్డి ధర రూ.15వేలు ఉంటే ప్రస్తుతం ట్రాక్టర్ గడ్డి రూ.25వేలకు చేరింది. బస్తా తౌడు ధర రూ.1700లకు చేరింది. ఒక గేదకు అయ్యే ఖర్చు పాలదిగుబడికంటే అధిగమౌతోంది. దీంతో పాడి రైతులు నష్టాల పాలవుతున్నారు. చేసేది ఏమిలేక గేదలు బక్కచిక్కిపోవడం తట్టుకోలేక కలేబలాలకు తరలిస్తున్నారు. గిట్టుబాటు గాని పాల ధర: పాల ధర గిట్టుబాటు కావటం లేదు. డెయిరీల్లో 10 పాయింట్లు వెన్న శాతం చూపిస్తేనే లీటరు రూ.50 నుంచి55వరకు ధర చెల్లిస్తున్నారు. వెన్నశాతం తక్కువగా ఉన్న పాలకు రూ. 40నుంచి45 మించి చెల్లించడం లేదు. పశులు పోషణ,మేత ఖర్చులకు వచ్చే రాబడి ఏమాత్రం సరిపోక రైతులు పశువులు కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం సబ్సీడీతో పశుగ్రాసం ప్రోత్సాహాలను అందించాలని పాడి రైతులు కోరుతున్నారు. రోజు రోజుకు పశువుల పోషణ భారమైంది..: కరువు పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుండటతో పశువుల పోషణ భారమైంది. ఒక్క తౌడు మూట కొనాలన్నా.. వాటి కి ధానా వేయాలన్నా.. ట్రాక్టర్ చెత్త కొనాలన్నా వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చేసేది ఏమీలే పశువులను సంతలో విక్రయించాల్సి వస్తోంది. పాల ఉత్పత్తి వచ్చ అధాయం కాన్న.. వాటి పోషణే భారమవుతోంది. -
రైతుల పక్షాన న్యాయపోరాటం:వైఎస్ జగన్
కడప: పసుపు రైతులకు అండగా ఉంటామని, వారి పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు వెళ్లిన జగన్‌ను అక్కడి పసుపు రైతులు కలిశారు. తమ బాధలు ఆయనకు చెప్పుకున్నారు. ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పంట నష్టపోయినట్లు వారు తెలిపారు. కలుపుకు ముందు మందు పిచికారీ చేయడం వల్ల పసుపు పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వారు జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ కాలేదు సరికదా, రెన్యువల్ కూడా కాలేదన్నారు. అన్నదాతలకు కొత్త రుణాలు ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులు పంట బీమా కోల్పోయినట్లు జగన్ తెలిపారు. ఇదిలా ఉండగా, మైదుకూరులో వైఎస్ఆర్ సీపీ నేత దస్తగిరి కూతుర్నీ, అల్లుడినీ వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ** -
చెట్టును చూపి కాయలమ్ముకునే చంద్రబాబు: విజయమ్మ
-
చెట్టును చూపి కాయలమ్ముకునే చంద్రబాబు: విజయమ్మ
కడప: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెట్టును చూపి కాయలమ్ముకొనే వ్యక్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో వైఎస్ఆర్సిపి జనపథం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు 9 ఏళ్ల పరిపానలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఓట్లు, సీట్లు కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్టే లక్షా 30వేల రూపాయలని, రైతుల రుణాలు లక్షా 27వేల కోట్లు ఉంటే ఎలా మాఫీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఆయన అవినీతిపరుడు కాబట్టే ఉద్యోగస్థులందని అవినీతిపరులన్నారన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటున్నారు. ఆయన నిక్కర్లేసుకున్నప్పుడే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉంది. బీసీలను నిర్వీర్యం చేసిన వ్యక్తి. వందలాది మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారకుడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీని తెలుగుకాంగ్రెస్గా మార్చారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే సత్తా జగన్‌కే ఉందని విజయమ్మ చెప్పారు. కౌన్సిలర్లు గెలిస్తే ఎమ్మెల్యేలు గెలిచినట్లేనని, ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్ గెలిచనట్లేనని, జగన్ గెలిస్తే వైఎస్ఆర్ సీపీ గెలిచినట్లేనని ఆమె అన్నారు. 30 సంవత్సరాలపాటు వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. బంగారు ఆంధ్రప్రదేశ్‌గా ఉంచాలన్న వైఎస్ఆర్ కలను జగన్ నిజం చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడే నాయకులను ఎన్నుకొనే అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రజలపై ఒక్క పైసా పన్ను భారం పడకుండా పరిపాలన వైఎస్ఆర్ వల్లే సాధ్యమైందన్నారు. లక్షా 20వేల మంది మహిళలకు అభయహస్తం పథకం వైఎస్ఆర్ అందించారని గుర్తు చేశారు. మహిళలకు పావలావడ్డీ రుణాలను తీసుకొచ్చిన ఘనత ఆయనదేన్నారు. సామాన్యప్రజలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదేనని చెప్పారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం జలయజ్ఞాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.