మైదుకూరు టౌన్ : ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ ఎన్‌ఎంయూ కార్మికులు డిపో గేట్ వద్ద ఎర్రబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి వి.ఎస్ రాయుడు మాట్లాడుతూ కార్మికులకు రావాలసిన బకాయిలు, కార్మికులపై యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు అన్నిడిపోల వద్ద ధర్నా, ఎర్రబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తుందన్నారు. కార్మికులకు గత ఏడాది నుంచి ఇవ్వవలసిన డీఏ బకాయిలు, సమైక్యాంద్ర ఉద్యమంలో 60 రోజులను స్పెషల్ లీవ్‌ల పరిగణించాలని, 2017 వ సంవత్సరంలో ఏప్రియల్ నుంచి నూతన స్కేల్ పై తక్షణం స్పందించి జీతం పెంచాలని డిమాండ్ చేశారు.
అర్హత ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరిని రెగ్యులర్ చేయడంతో పాటు కార్మికుల పై పెడుతున్న పనిభారాన్ని తగ్గించి తదితర డిమాండ్లు వెంటనే పరిష్కారించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఇలానే వ్యవహరిస్తూ పోతే రాబోవు కాలంలో తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాశం శీనయ్య, టి.పీ మునెయ్య, రమణారెడ్డి, పీ.వీ ఆంజనేయులు, కె.సీ కొండయ్య, జెవీఎస్ రెడ్డి, ఆచారీ, వినోద్‌కుమార్, ఎంసీ నాయక్, యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
Published Fri, Apr 28 2017 4:18 PM | Last Updated on Mon, Aug 20 2018 3:30 PM
Advertisement