NMU
-
ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చే యాల్సిన రెండు వేతన సవరణ బకాయిల్లో ఒకదా న్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. 2017లో జరగాల్సిన వేతన సవరణకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ఫిట్మెంట్ కాకుండా మధ్యంతర భృతితో సరిపెట్టింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 21 శా తం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ న అందుకోబోయే మే నెల వేతనంతో దీని చెల్లింపు ప్రారంభం కానుంది. ఈ ఏడేళ్లకు సంబంధించిన బ కాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించను న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ లేకుండా బకా యిలను మాత్రమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఇలా పేరుకుపోయి: రాష్ట్ర విభజనకు ముందు 2013లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, నాటి విభజన హడావుడిలో ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ లో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంటుంది. 2013 వేతన సవరణ తర్వాత 2017లో, మళ్లీ 2021లో జరగాల్సి ఉంది. ఈ రెండూ అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2017 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు 2018లో సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్ప టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ప్రభు త్వం దాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల చ ర్చల అనంతరం 16 శాతం మధ్యంతర భృతిని కమిటీ ప్రకటించింది. 2018 జూన్ నుంచి అది కొనసాగుతోంది. ఈలోపు 20 21లో మరో వేతన సవరణ గడువు దాటి పోయింది. గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు బకాయిల చెల్లింపుపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. త్వరలో పార్ల మెంటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం, ఒక వేతన సవరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బస్‌భవన్‌లో ప్రకటించారు. ఎంత పెరుగుతుందంటే..: గత ఆరేళ్లుగా 16 శాతం ఐఆర్‌ను లెక్కగడుతూ ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇప్పుడు దాన్ని తొలగించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి చెల్లిస్తారు. ఉద్యోగుల మూల వేతనంపై మాత్రమే ఐఆర్‌ను లెక్కిస్తారు. దీంతో ఆ పెరుగుదల తక్కువ గా ఉంటుంది. ఫిట్‌మెంట్‌ను మూలవేతనంతో పా టు కరువు భత్యం, ఇంక్రిమెంట్లపై లెక్కిస్తారు. దీంతో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీపై రూ.418.11కోట్ల భారం పడనుందని అంచనా. కాగా, ఆర్టీసీ ఉద్యో గుల్లో 41.47 శాతం మంది కండక్టర్లు, 35.20 శాతం మంది డ్రైవర్లు, 5 శాతం మంది మెకానిక్‌లు, 3.34 శాతం మంది శ్రామిక్లున్నారు. వీరి వేతనాల్లో పెరుగుదల ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. స్వాగతిస్తున్నాం: టీఎంయూ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పే స్కేలు, బాండ్స్ డబ్బులు ఇచ్ఛిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌కు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నిర్ణయం: ఎన్ఎంయూ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేయడం గొప్ప నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి, నరేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పీఎఫ్ వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిల సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘30 శాతం అనుకుంటే.. 21 శాతమే ఇచ్చారు’ వేతన సవరణ 30 శాతం చేస్తుందనుకుంటే 21శాతంతో సరిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణగౌడ్, సుద్దాల సురేశ్ ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. -
హీటెక్కిన ఆర్టీసీ.. సమ్మె రూటులో
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్, టీజేఎంయూ సమ్మె నోటీసు ఇవ్వగా, గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయూ, మరో ప్రధాన సంఘం ఎన్‌ఎంయూలు బుధవారం నోటీసులిచ్చాయి. టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు బస్‌భవన్‌లో ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఎన్ఎంయూ నేతలు కూడా మంత్రి సమక్షంలోనే ఇన్చార్జి ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బస్‌భవన్‌లో అత్యవరసర భేటీ అయ్యారు. అయితే రవాణా శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో ఆర్టీసీ, రవాణా శాఖలపై అవగాహన, అధికారులతో పరిచయం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితి, అప్పులు, వాటిపై చెల్లిస్తున్న వడ్డీ, వేతనాలకు డబ్బుల్లేని పరిస్థితి ఉందని అధికారులు వివరించారు. ఆర్టీసీలో సమ్మె మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిపై తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కూడా సొంత వనరులు పెంచుకోవాలని, ఆదాయాన్ని పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా సంస్థ స్వరూపం, బస్సుల నిర్వహణ, సంస్థాగత విషయాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కాగా, సమావేశానికి ముందు ఎన్ఎంయూ నేత నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో బస్‌భవన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్లో ఆర్టీసీకి కేవలం రూ.550 కేటాయించటం సంస్థను అవమానపరచడమే అని ఆరోపించారు. రూ.800 కోట్ల పాతబకాయిలు చెల్లించి బడ్జెట్ కేటాయింపులను కనీసం రూ.3 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లపై తాను సీఎంతో మాట్లాడతానని, ఎవరూ తొందరపడొద్దని కార్మిక సంఘాల నేతలకు మంత్రి హామీ ఇచ్చారు. రవాణా శాఖ అధికారులతోనూ.. రవాణా శాఖ అధికారులతోనూ మంత్రి సుదీర్ఘరంగా చర్చించారు. రవాణా శాఖ సమకూర్చుకుంటున్న ఆదాయంతో పాటు విధివిధానాలను మంత్రి తెలుసుకున్నారు. శాఖలో పారదర్శకత కోసం ఆన్లైన్ విధానంతో పాటు ఎం–వాలెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చెక్‌పోస్టుల దగ్గర వాహనాలను తనిఖీ చేయడం, అక్రమ రవాణాను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 2019 ఆగస్టు వరకు రూ.1,418 కోట్లు ఆదాయం వచ్చిందని, రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగేలా ఉన్న వాహనాల నియంత్రణపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం నాయక్, టీవీ రావు, యాదగిరి, రవాణా శాఖ సంయుక్త కమిషనర్లు రమేశ్, పాండురంగ నాయక్‌తోపాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఈయూదే ఆధిక్యం
నెహ్రూనగర్(గుంటూరు): ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకు ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎటువంటి ఘటనలు జరుగుకుండా పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 13 డిపోల్లో 4,737 ఓట్లు ఉండగా, 4, 653 ఓట్లు పోలయ్యాయి. డిపోల వారీగా పోలింగ్ శాతం పరిశీలిస్తే వరుసగా గుంటూరు–1 డిపోలో 717 ఓట్లగాను 703, గుంటూరు–2 డిపోలో 500 ఓట్లకు గాను 491, తెనాలి డిపోలో 421 ఓట్లకు గాను 412, మంగళగిరి 226 ఓట్లకు గాను 221, పొన్నూరు 231 గాను 225, బాపట్ల 204 గాను 201, రేపల్లె 254 గాను 249, నరసరావుపేట 395 గాను 384, చిలకలూరిపేట 433 గాను 428, సత్తెనపల్లి 251 గాను 247, వినుకొండ 398 గాను 392, పిడుగురాళ్ల 312 గాను 309, మాచర్ల 395 గాను 391 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు రీజియన్‌లో జరిగే ఎన్నికలు లేబర్ అధికారుల సమక్షంలో జరిగాయి. గుంటూరు 1, 2 డిపోలో జరిగే ఎన్నికలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ యు.మల్లేశ్వరకుమార్ పరిశీలించారు. -
ఆర్టీసీలో హోరాహోరీ
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ మిత్రపక్షాలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డడంతో గురువారం నాటి ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయి. ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో గురువారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాత్రికి ఫలితాలు వెల్లడించనున్నారు. విశాఖలోని వాల్తేరు, మద్దిలపాలెం, గాజువాక, కూర్మన్నపాలెం, సింహాచలం, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం, మధురవాడ, విశాఖరూరల్ డిపోలతో పాటుగా రీజనల్ మేనేజర్ కార్యాలయంలోను పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశారు. ముమ్మరంగా ప్రచారం : ఎన్ఎంయూ, ఈయూ, మిత్రపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ప్రచారం మంగళవారంతో ముగిసింది. ప్రతిష్ట కోసం ఎన్ఎంయూ, పరువు కోసం ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎన్నికలలో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎంయూ అధికారంలో ఉండడం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌కు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వంటి యూనియన్లు మద్దతు ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా యూనియన్ల రాష్ట్ర స్థాయి నాయకులు అన్ని డిపోల్లో ముమ్మరంగా ప్రచారం చేసి వెళ్లారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, ఆర్ఎం కార్యాలయ సిబ్బంది, ఆర్టీసీ డిస్పెన్సరీ సిబ్బంది ఈ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కార్మికశాఖ అన్ని చర్యలు చేపట్టింది. తెల్లవారుజామునే కార్మికశాఖ సిబ్బంది పోలింగ్‌బూత్‌లకు చేరుకోనున్నారు. కాగా, గురువారం సెలవులో వుండే ఆర్టీసీ సిబ్బందికి ఆయా యూనియన్లు డిపోలో పనులు పురమాయించారు. హామీల వర్షం : ఈ సారి ఆర్టీసీ ఎన్నికలలో మునుపెన్నడూ లేని రీతిలో యూనియన్లు పోటాపోటీగా హామీల వర్షం కుíరిపించడం విశేషం. పదేళ్లపాటు ట్యాక్స్ హాలీడే, మహిళా కండక్టర్లు రాత్రివేళ త్వరగా డ్యూటీ దిగేలా చర్యలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడం, అద్దె బస్సులకు మంగళం పాడడం, అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై చర్యలు, గూడ్స్ రవాణా, మెరుగైన వేతన ఒప్పందం, కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేయడం, డిపో స్పేర్విధానం రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై యూనియన్లు హామీలు గుప్పించాయి. సందడిగా డిపోలు : నగర, గ్రామీణ జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల్లో సందడి నెలకొంది. డిపోల ఆవరణలో ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ కటౌట్లు, స్వాగతద్వారాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆయా యూనియన్ల ఆఫీసులు కొద్దిరోజులుగా సందడిగా కనిపిస్తున్నాయి. రాత్రి పొద్దుపోయే దాకా ఎన్నికల సరళిపై డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులు విశ్లేషించుకుంటున్నారు. ఆర్టీసీ సిబ్బది డ్యూటీ దిగిపోయాక సంబంధిత యూనియన్ కార్యాలయాల బాట పడుతున్నారు. ఇక బస్సుల్లో కూడా ఆర్టీసీ సిబ్బంది ఎన్నికల గురించే చర్చించుకోవడం విశేషం. పకడ్బందీగా ఏర్పాట్లు గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుధేష్‌కుమార్ తెలిపారు. సింహాచలం ఆర్టీసీ గ్యారేజీ డిపోలో పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఇక్కడ ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించారో డిపో మేనేజర్ సీహెచ్ దివ్యను ఆరా తీశారు. విశాఖలో 4,478 మంది కార్మికులు ఓటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. ఎక్కడి డిపోలో కార్మికులు అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పది డిపోలతో పాటు రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద నాన్ ఆపరేషన్ యూనిట్‌కు బూత్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరు పర్యటన నేపథ్యంలో బస్‌లు ఆ దిశగా పంపిస్తున్న తరుణంలో డ్రైవర్లు, కండక్టర్లు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రణాళిక చేశామన్నారు. ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఆరు వరకూ ఓటింగ్ జరుపుతామని వివరించారు. ఈ నెల 13, 14 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు ఎన్ఎంయూ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఈ నెల 11 నుంచి తలపెట్టిన సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) మద్దతు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. ఏకపక్ష వైఖరితో కార్మికులకు నష్టం కలిగేలా గుర్తింపు కార్మిక సంఘం వ్యవహరిస్తోందని ఎన్ఎంయూ నేతలు నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, నరేందర్, మౌలానా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ సిబ్బందికి తక్కువ వేతనాలున్నందున తాము 62 శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేశామని, కానీ టీఎంయూ 50 శాతం ఫిట్‌మెంట్‌నే కోరిందన్నారు. -
19 అర్ధరాత్రి నుంచి సమ్మె
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజయనగరం రీజనల్ మేనేజర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నామని ఆర్టీసీలో గుర్తింపు సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) రీజనల్ అధ్యక్షుడు వై.అప్పయ్య, డివిజనల్ అధ్యక్షుడు శ్రీనివాసరావులు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ రెండో డిపో గ్యారేజీ ఎదురుగా ఎన్ఎంయూ నాయకులు బుధవారం గేట్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం రీజనల్ మేనేజర్‌కు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ ఏడాది జనవరి 9న మెమోరాండం ఇచ్చామన్నారు. సమస్యలపై విడతల వారీగా చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ఎంయూ రీజనల్ కమిటీ నిర్ణయం మేరకు నెక్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నామని వెల్లడించారు. ప్రధానంగా కార్మికులకు ఓటీ డ్యూటీలు రద్దు చేయాలని, ఎంటీడబ్ల్యూ చట్టం ప్రకారం డ్యూటీలు సరి చేయాలని, సిక్కు గురైన వారికి జీతాలు ఇవ్వాలని, కార్మికులందరికీ సెలవు సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే డీఎస్ఎం గేజ్ అయిన ఎస్సీ/ఎస్టీ డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని, ఒన్‌మన్ సర్వీసులను రద్దు చేయడంతోపాటు పాడైపోయిన టిమ్‌ల స్థానంలో కొత్త వాటిని సరఫరా చేయాలని, గ్యారేజీలో సూపర్వైజర్ల పక్షపాతవైఖరి నశించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు ఎన్ఎంయూ నేతలు చెప్పారు. గేట్ మీటింగ్‌లో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల కార్యదర్శులు ఎంఎన్ రావు, వి.శాంతరాజు పాల్గొన్నారు. -
‘ట్రావెల్స్ అక్రమ రవాణాను అడ్డుకోండి’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ అక్రమ రవాణాతో ఆర్టీసీకి రూ.వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నేతలు ఎం.నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, మౌలానా, రఘురాం తదితరులు పేర్కొన్నారు. రవాణా శాఖ తక్షణమే వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి నియమించిన కో ఆర్డినేటర్ చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. తక్షణమే ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోకపోతే రవాణా శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని గురువారం హెచ్చరించారు. -
వ్యవస్థలో మార్పులు చేస్తేనే ఆర్టీసీ మనుగడ
► అధికార, కార్మిక భాగస్వామ్యంతోనే ప్రగతిబాట ► ఎన్ఎంయూ రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ధనుంజయరెడ్డి నెల్లూరు(బృందావనం) : ఆర్టీసీలో అధికారులు పాత విధానాలకు స్వస్తి పలికి, వ్యవస్థలో మార్పులు తెచ్చి కార్మికులను భాగస్వామ్యం చేస్తేనే సంస్థ మనుగడ సాగిస్తుందని ఎన్ఎంయూ రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ కొడవలూరు ధనుంజయరెడ్డి అన్నారు. నెల్లూరులోని పురమందిరంలో గురువారం జరిగిన ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నెల్లూరు రీజియన్ 10వ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టీసీ ప్రగతిచక్రంలో పయనించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం సుమారు 70 ఏళ్లనాటి విధానాలనే అమలుపరుస్తోందన్నారు. ఈ కారణంగా ఆర్టీసీ మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ లాభాలబాటలో పయనించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేయాలన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరంచేసే ఆలోచన విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లాచంద్రయ్య, వై.శ్రీనివాసరావు, రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, నెల్లూరు రీజియన్ నాన్ ఆపరేషన్ గౌరవాధ్యక్షుడు గాదిరాజు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
► ఆర్టీసీ యాజమాన్యంపై ఎన్‌ఏంయూ నేతల ధ్వజం బస్‌స్టేషన్ (విజయవాడ తూర్పు) : ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఉందని ఎన్‌ఏంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్) గ్యారేజి వర్క్‌షాపు నేతలు ధ్వజమెత్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్‌ఏంయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం గ్యారేజీ వర్క్‌షాపు నేతలతో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్సుల పనితీరును పరిశీలించే విభాగంపై యాజమాన్యం వహిస్తున్న నిర్లక్ష్య ధోరణితో వస్తున్న సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన జోనల్ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు చల్లాచంద్రయ్యకు వివరించారు. చల్లాచంద్రయ్య మాట్లాడుతూ కనీసం కారుకు తీసుకున్న జాగ్రత్తల్ని సైతం బస్సుకు తీసుకోకపోవడం దారుణమన్నారు. మానవశక్తి, విడిభాగాలు అందించడంలో యాజమాన్యం విఫలమయ్యిందన్నారు. అవి లేక గ్యారేజీల్లో కార్మికులు పనులు చేయలేకపోతున్నారన్నారు. మారుతున్న కాలనుగుణంగా విడిభాగాల్ని అందించలేకపోతున్నారన్నారు. దశబ్దాలుగా గ్యారేజీలో బస్సు పరిశీలన విభాగంలో ఉన్న 4 షెడ్డుల్ని కుదించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారన్నారు. ఈ సమస్యల్ని యాజమాన్యం పరిష్కరించకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొత్త బస్సులు వస్తేనే సమస్యలకు పరిష్కారమన్నారు. చల్లా చంద్రయ్య మాట్లాడుతూ ఈ సమస్యలపై యాజమాన్యంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రావి సుబ్బారావు, తోట వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, జోన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మైదుకూరు టౌన్ : ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ ఎన్ఎంయూ కార్మికులు డిపో గేట్ వద్ద ఎర్రబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి వి.ఎస్ రాయుడు మాట్లాడుతూ కార్మికులకు రావాలసిన బకాయిలు, కార్మికులపై యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు అన్నిడిపోల వద్ద ధర్నా, ఎర్రబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తుందన్నారు. కార్మికులకు గత ఏడాది నుంచి ఇవ్వవలసిన డీఏ బకాయిలు, సమైక్యాంద్ర ఉద్యమంలో 60 రోజులను స్పెషల్ లీవ్‌ల పరిగణించాలని, 2017 వ సంవత్సరంలో ఏప్రియల్ నుంచి నూతన స్కేల్ పై తక్షణం స్పందించి జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరిని రెగ్యులర్ చేయడంతో పాటు కార్మికుల పై పెడుతున్న పనిభారాన్ని తగ్గించి తదితర డిమాండ్లు వెంటనే పరిష్కారించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఇలానే వ్యవహరిస్తూ పోతే రాబోవు కాలంలో తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాశం శీనయ్య, టి.పీ మునెయ్య, రమణారెడ్డి, పీ.వీ ఆంజనేయులు, కె.సీ కొండయ్య, జెవీఎస్ రెడ్డి, ఆచారీ, వినోద్‌కుమార్, ఎంసీ నాయక్, యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆర్టీసీ సీసీఎస్ పోరులో సమాన ఫలితాలు
ఎన్ఎంయూ –16, ఎంప్లాయీస్ యూనియన్ –16 తిరుపతి కల్చరల్: జిల్లాలో శుక్రవారం జరిగిన ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల పోరులో ప్రధాన యూనియన్ లు ఎన్ ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ సమ ఫలితాలను కైవసం చేసుకున్నాయి. ఎన్ ఎంయూను ఓడించడమే లక్ష్యంగా ఎంప్లాయీస్ యూనియన్ఎస్డబ్ల్యూఎఫ్ కార్మిక పరిషత్ వంటి యూనియన్ ల కూటమితో సీసీఎస్ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలిపింది. అయితే ఎన్ ఎంయూ సీసీఎస్ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసి ఎంప్లాయీస్ యూనియన్ కూటమికి ధీటుగా నిలిచింది. తిరుమల –2, మంగళం–1, చి త్తూరు 2–2, మదనపల్లి1–1, మదనపల్లి 2–2, పీలేరు–2, పలమనేరు–1, సత్యవేడు –1, వర్క్‌షాప్–1 చొప్పున మొత్తం –15 ఎన్ఎంయూ అభ్యర్థులు గెలుపొందగా తిరుపతి డిపోలో యూ నియన్ బలపరుస్తున్న కార్మిక పరిషత్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఎన్ఎంయూ 16 మంది అభ్యర్థులు గెలుపొందారు. కాగా ఆర్ఎం ఆఫీసు, చిత్తూరు, మంగళం వంటి డిపోల్లో రెండు మూడు ఓట్లతో ఎన్ఎంయూ అభ్యర్థులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అలాగే కూటమితో బరిలోకి దిగిన ఎంప్లాయీస్ యూనియన్ చి త్తూరు1–2, తిరుపతి –2, మంగళం–1, చిత్తూరు1–2, చిత్తూరు2–1, కుప్పం–2, శ్రీకాళహస్తి–2, వర్క్‌షాపు–1, అలిపిరి–2 మొ త్తం 14 స్థానాల్లో ఎంప్లాయీస్ యూనియన్ గెలుపొందారు. అలాగే యూనియన్ బలపరుస్తున్న అభ్యర్థులు మదనపల్లి1–1, ఆర్ఎం ఆఫీసులో ఒకటి, మొత్తం 16 సీట్లను కైవసం చేసుకుంది. ప్రశాంతంగా ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలు ఆర్టీసీ కో–ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 14 డిపోలతో పా టు తిరుపతిలోని వర్క్‌షాపు, ఆర్ఎం ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో పగడ్భందీగా ఎన్నికలు సాగాయి. ఐదేళ్ల కొసారి ఈ సీసీఎస్ ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ. ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఓటర్లు 32 మంది డెలిగేట్స్‌ను ఎన్నుకుంటారు. ఇలా అన్ని జిల్లాల నుంచి ఎంపికైన డెలిగేట్స్ కలిసి సీసీఎస్‌కు 9 మంది డైరెక్టర్లు ఎంపిక చేసి వారి ద్వారా పాలన సాగిస్తారు. ప్రస్తుతం సీసీఎస్‌లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కు చెందిన పాలక మండలి కొనసాగుతోంది. ఇప్పటికే అధికార యూనియన్ గా కొనసాగుతున్న నేషనల్ మజ్దూర్ యూనియన్ ఈ ఏడాది సీసీఎస్ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారం చేసింది. ఈ మేరకు తమ అభ్యర్థులను ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిపింది. అయితే ఎంప్లాయీ స్ యూనియన్ అటు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఇటు ఆర్టీసీ వైఎస్ఆర్ మ జ్దూర్ యూనియన్ మద్దతుతో సీసీఎస్ ఎన్నికల బరిలో అభ్యర్థులను పోటీకి దిం పారు. అధికార పార్టీ అనుబంధమైన కార్మిక పరిషత్ కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కార్మికుల సంక్షేమమే ఎన్ఎంయూ లక్ష్యం
* ఎన్ఎంయూ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు డీఎస్పీ రావు రేపల్లె: ఏపీఎస్ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థిగా రేపల్లె డిపో నుంచి పోటీచేస్తున్న ఇంకొల్లు శ్రీనివాసరావును బలపరచాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు డీఎస్పీ రావు ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. సీపీఎస్ ఎన్నికలను పురస్కరించుకుని స్థానిక డిపో కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన గేట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమమే ఎన్ఎంయూ లక్ష్యమన్నారు. గత సీసీఎస్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయని ఘనత ఎంప్లాయీస్ యూనియన్‌కే దక్కుతుందన్నారు. కార్మికులకు అవసరమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలంటే ఎన్ఎంయూ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్ఎంయు పాలకవర్గంగా ఉన్న సమయంలో సీసీఎస్‌లో స్వల్పకాలిక రుణాల వరకు మాత్రమే ఉండగా గృహ రుణాలను ప్రవేశపెట్టిందన్నారు. గృహ రుణాలపై ఉన్న 12.5 శాతం వడ్డీని 9శాతంకు తగ్గించిందని, పిల్లల చదువులకై నూతనంగా విద్యారుణాలు ప్రవేశపెట్టింది ఎన్‌ఎంయునే అని తెలిపారు. ప్రతి సభ్యుడికి 10రోజులలో లోన్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎడ్యుకేషన్ లోన్లు పెంచడం, నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు. ఇన్సూరెన్స్ పథకంను లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచుతామని వెల్లడించారు. ప్రతి జోన్లో ఒక సీసీఎస్ బ్రాంచ్ ఆఫీసును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.హనుమంతరావు, రీజియర్ సెక్రటరీ కేవిఎస్ నరసింహారావు, జోనల్ ట్రెజరర్ ప్రభాకరరావు, ఎన్ఎంయు అభ్యర్ధి ఇంకొల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని కాపాడుకుందాం
నష్టాలకు కారణం యాజమాన్య వైఖరే -ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య నెల్లూరు (అర్బన్) : ప్రజల ఆస్తి ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో బుధవారం జిల్లాలోని 10 డిపోలకు చెందిన సంఘం అధ్యక్ష, కార్యదర్శలు, ముఖ్యులతో సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల్లోకి పోవడానికి కారణం కార్మికులేనని ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటించడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. నష్టాలకు కారణమేంటో అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి పంపి వాస్తవాలు వెలుగులోకి తెస్తామన్నారు. మేనేజ్మెంట్ లోపాలు, ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేయలేకపోవడం, అక్రమ ప్రైవేట్ వాహనాల రవాణాను అరికట్టలేక పోవడంతోనే ఆర్టీసీ నష్టాల పాలయిందన్నారు. ఆర్టీసీ ఆస్తులన్ని తెలంగాణలో మిగిలిపోయాయని, వాటిలో వాట తెస్తే నష్టాల నుంచి బయట పడొచ్చన్నారు. ఇవన్ని మరచి యాజమాన్యం కార్మికులపై పనిభారం, ఒత్తిడి పెంచుతుందన్నారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణరాజు మాట్లాడుతూ నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గట్టెక్కించాడని తెలిపారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ పాలనలో నష్టాలు వచ్చాయన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణరాజు, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జోనల్ కార్యదర్శి ఎంవీరావు, రుక్సన్ పాల్గొన్నారు. -
అక్రమ రవాణా, ప్రైవేటీకరణపై పోరే లక్ష్యం
గోపాలపట్నం : అక్రమ రవాణా, ప్రైవేటు బస్సుల పెంపుపై ఉద్యమించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎన్ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీవీవీ మోహన్ స్పష్టం చేశారు. ఇక్కడి సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపో వద్ద బుధవారం కార్మిక ఐక్యత కోరుతూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా డిపో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు బస్సులను ఉంచాలన్న నిబంధన ఆచరణలో ఉండాలని, మేక్సీ క్యాబ్‌లు, జీపులు, ఆటోలు పరిమితికి మించి రవాణా చేయకూడదని, హైవేలో ఆటో ప్రయాణాలు ఆపాలని ఇప్పటికే డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌కు నివేదించామన్నారు. టూరిస్టు పర్మిట్లతో స్టేజి కేరియరు సర్వీసులు నడపడం, ఒకే నంబరుతో మూడు నాలుగు బస్సులు అక్రమ రవాణా జరిగిపోతుండడంపైనా తాము అభ్యంతరం చెప్పామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 3000 ఆర్టీసీ బస్సులు రానున్నాయని తొలి విడతగా పుష్కరాల సర్వీసులకు ఆరువందల బస్సులు ప్రారంభమవుతాయన్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లపై అధికారులు అన్యాయంగా పనిష్మెంట్లు ఇస్తున్నారని, ఇలాంటి ఇబ్బందులు రాకుండా గుర్తింపు యూనియన్ నుంచి నలుగురు, ఆర్టీసీ అధికారుల నుంచి నలుగురితో ఒక కమిటీ ఏర్పాటు కానుందన్నారు. రీజినల్ పబ్లిసిటీ కార్యదర్శి టీవీ శర్మ, డివిజినల్ వర్కింగ్ అధ్యక్షుడు డీకే రాజు, డిపో అధ్యక్ష కార్యదర్శులు డీఏనాయుడు, ఎస్. అప్పారావు, గ్యారేజి అధ్యక్షుడు సాయిబాబా తదితర నాయకులు పాల్గొన్నారు. -
కార్మికులకు వడదెబ్బ తగలకుండా చూడాలి
ఎన్ఎంయూ సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మండే ఎండల్లో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని టీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ పేర్కొంది. పగలు విధుల్లో ఉండే కార్మికుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు కూడా పేర్కొన్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్ల కోసం నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరింది. హైదరాబాద్‌లో ప్రధాన పాయింట్లలో వైద్యులను కూడా అందుబాటులో ఉంచాలని సంఘం ప్రతినిధులు నాగేశ్వరరావు, లక్ష్మణ్, మౌలానా గురువారం ఓ ప్రకటనలో కోరారు. లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. -
18న బస్‌భవన్ ముట్టడి: ఎన్ఎంయూ
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు ఆర్థిక చెల్లింపుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 18న బస్‌భవన్‌ను ముట్టడించనున్నట్టు ఎన్ఎంయూ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2013 ఏప్రిల్ నుంచి అందాల్సిన వేతన సవరణ బకాయిలు, మూడేళ్ల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు, కొత్త డీఏ చెల్లింపు, 22 మాసాల ఎస్బీటీ, ఎస్‌ఆర్‌డీసీరుణాల చెల్లింపులు, గతంలో యాజమాన్యం ఖర్చుచేసిన పీఎఫ్ డబ్బులు ఈనెల 13 లోపు చెల్లించాలని, లేకుంటే బస్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆ సంఘం ప్రతినిధులు నాగేశ్వరరావు, లక్ష్మణ్, మౌలానా, రఘురాంలు ప్రకటనలో హెచ్చరించారు. -
పెన్షనర్ల ప్రయోజనాలు కాపాడాలి:ఎన్ఎంయూ
సాక్షి, హైదరాబాద్: తరచూ నిబంధనలు మారుస్తూ కార్మికుల భవిష్య నిధితో ఆటలాడుకోవటం సరికాదని, పీఎఫ్ పింఛనుదారుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎన్ఎంయూ కోరింది. కార్మికులు దాచుకున్న భవిష్య నిధి భవితవ్యాన్ని గందరగోళం చేయటం తగదని సంఘ నేతలు నాగేశ్వరరావు, మౌలానా, రఘురాం, లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు. కనీస పీఎఫ్ పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.7 వేలకు పెంచాలని, పెరుగుతున్న డీఏను పెన్షన్‌కు వర్తింపచేయాలని, భవిష్య నిధిలోని రూ.30 వేల కోట్ల అన్క్లెయిమ్డ్ మొత్తాన్ని పెన్షన్ స్కీమ్‌కు తరలించాలని, పీఎఫ్ మీద పన్ను రద్దు చేయాలని, ధర్మకర్తల మండలి అధికారాన్ని పెంచాలని కోరారు. -
ఉద్యోగాల పేరిట టోకరా..అరెస్టు
ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి కోట్లు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ. 2.5 కోట్లు వసూలు చేసిన ఎన్ఎమ్యు సెక్రెటరీ సయ్యద్ బహ్ముద్ తో పాటు మరో ఏడుగురిని కోదాడ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17లక్షలు నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విక్రంజిత్దుగ్గల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. -
ఎన్నికల కోలాహలం
18న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు ప్రచారాలతో హోరెత్తిస్తున్న కార్మిక సంఘాలు కార్మిక ఓట్లు రాబట్టేందుకు ముమ్మర యత్నాలు పట్నంబజారు (గుంటూరు): ఏపీఎస్ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికల కోలాహలం నెలకొంది. కార్మిక సంఘాలు పూర్తిస్థాయిలో రీజియన్ పరిధిలోని 13 డిపోల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నెల 18న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గుంటూరు రీజయన్ పరిధిలో 5963 కార్మిక ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న తొలి గుర్తింపు ఎన్నికలు కావడంతో సంగ్రామాన్ని తలపిస్తోంది. కార్మిక సంఘాలు ఈ ఎన్నికలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూ, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కార్మిక సంఘాల నేతలు తమదైన శైలిలో ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్)తోపాటు మరో నాలుగు కార్మిక సంఘాల పోటీకి దిగుతున్నాయి. బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళ ఇప్పటికే ఆర్టీసీ బస్‌స్టాండ్‌తో పాటు, రీజియన్ పరిధిలోని డిపోలన్నీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. కార్మిక నేతలను సైతం పోటీలు పడి మరీ బ్యానర్లు, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీ నేతలతో ఎన్ఎంయూ, ఎస్డ బ్ల్యూఎఫ్ సంఘాలు భారీ బహిరంగ సభలు నిర్వహించగా, కార్మిక పరిషత్, ఎంప్లాయీస్ యూనియన్లు సభలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి.ఎన్ఎంయూ రీజియన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ నరసింహారావు, కార్మిక పరిషత్ నేత మురళి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ ప్రధాన కార్యదర్శి డీవీ స్వామి ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణను పరిశీలిస్తున్నారు. దీంతోపాటు పలువురు ఎన్ఎంయూ నేతలు ఈయూలో చేరడం, పలువురు ఈయూ నేతలు ఎన్‌ఎంయూలో చేరడంతో గట్టిపోటీ వాతవరణం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పూర్తిచేసేస్తున్నాయి. ప్రచారానికి ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉండడంతో కార్మిక సంఘాల నేతలు చకచకా పావులు కదపుతున్నారు. కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు, పోస్టర్ల ప్రచారాన్ని భారీగా చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పైనా కార్మిక సంఘాల నేతలు దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల ముందు రోజు రాత్రి గుంటూరు రీజియన్ నుంచి దూరప్రాంతాలు వెళ్లే వారి లిస్టులు సేకరించే పనిలో ఉన్నారు. సుమారు 100 నుంచి 150 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉండే అవకాశం ఉందని కార్మిక నేతలు చెబుతున్నారు. -
ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
{పచార శిబిరాలు ప్రారంభం ఈ నెల 18న ఎన్నికల నిర్వహణ నెక్ రీజియన్‌లో 4,214 మందికి ఓటు విజయనగరం అర్బన్: ఆర్టీసీలో ఎన్నికల సందడి మొదలైంది. సంస్థలో గుర్తింపు కార్మిక సంఘానికి ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నా రు. ఈ నేపథ్యంలో నార్త్ ఈస్ట్ కోస్టు (నెక్) రీజియన్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల తొమ్మిది డిపో ల్లో పోటీ పడుతున్న ప్రధాన కార్మిక సంఘాలు ప్రచారంలో తలములకలయ్యాయి. రెండోళ్లకోసారి నిర్వహించే ఈ ఎన్నికల్లో సంస్థ గుర్తింపు పొందిన సం ఘాలు 8 వరకు పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఏడా ది కొత్తగా వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘం వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్, టీఎన్టీయూసి అనుబంధ సంఘం కార్మిక పరిషత్‌ను రంగంలోకి దిగుతున్నాయి. వీటిలో నేషనల్ మజ్దూర్ యూని యన్ (ఎన్ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈ.యూ.), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ల మధ్య మాత్రమే నెక్ రీజి యన్ పరిధిలో ప్రధానంగా పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్ 22న నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఏపీఆర్ఈయూ) విజయం సాధించింది. ప్రాంతీయ (రీజియన్ స్థాయి కమిటీ) ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) ఆధిక్యత పొందినా స్థానిక నెక్ రీజయన్లో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్ గెలిచింది. ఈ ఏడా ది ఆలస్యంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో అదే రోజు ఓ ట్ల లెక్కింపు జరిగేలా కార్మిక శాఖ ప్రకటన చేసింది.అధికారులు, పర్యవేక్షకులు (సూపర్వైజర్లు), భద్రత సి బ్బంది మినహా అంతా ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు. ఒక్కో కార్మికుడు రెండు ఓట్లు వినియోగించుకోవాలి. ఒకటి ప్రాంతీయ (స్థానిక) సంఘానికి, రెండోది రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం కోసం ఓట్లు వేయాలి. నెక్ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో ప్రస్తుతం ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లోనూ మరోసారి విజయం కోసం ప్రస్తుత గుర్తింపు సంఘం ఎంప్లాయీ స్ యూనియన్ ప్రయత్నిస్తోంది. మూడేళ్లుగా చేపట్టిన కార్మిక సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ నేతలు రంగంలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో నెక్ ప్రాంతీయ స్థాయిల్లో ఓటమి చవిచూసిన ఎన్ఎంయూ కూడా తమ మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేసింది. ఈ సారి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక డిపో గ్యారేజీ ఆవరణలో రెండు సంఘాల ప్రచార శిబిరాలను ఏర్పాటు చేశారు. నెక్ రీజయన్లో 4,214 మందికి ఓటు హక్కు నెక్ పరిధిలోని తొమ్మిది డిపోల పరిధిలో 4,214 మంది ఉన్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. విజయనగరం జి ల్లాలోని విజయనగరం డిపో-535 మంది, పార్వతీపు రం డిపో-455, సాలూరు డిపో-369, ఎస్.కోట డిపో-294, ఆర్ఎం కార్యాలయం డిస్పేన్షరీ కలిపి 35 మం ది ఓటర్లను గుర్తించారు. అదే విధంగా శ్రీకాకుళం పరి ధిలోని శ్రీకాకుళం-1 డిపోలో 480, శ్రీకాకుళం-2 డిపోలో 494 మంది, పాలకొండ డిపో-530, పలాస డిపో-379, టెక్కలి డిపో-343, డిపోల్లో సిబ్బంది 13 మందిగా ఓటర్లను ఖరారు చేశారు. అదే విధంగా జోన ల్ వర్క్‌షాప్ పరిధిలోని నాన్ ఆపరేషన్ విభాగంలో 287 మంది ఓటు హక్కుకు అర్హులని కార్మిక శాఖకు పంపారు. -
ఎన్ఎంయూ ఆధ్వర్యంలో 24న ధర్నా
హైదరాబాద్ సిటీ: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 24న ఆర్టీసీ బస్‌భవన్ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్టు ఎన్ఎంయూ తెలంగాణ శాఖ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. వేతన సరవణ కమిటీ గడువు పూర్తయి 24 మాసాలు గడుస్తున్నా ఇప్పటికీ యాజమాన్యం స్పందించకపోవటం సరికాదని విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తగ్గట్టుగా వేతన సవరణ జరగకపోవటంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. -
తిరుపతి రీజియన్‌లో ఎన్ఎంయూ మెరుపు సమ్మె
-
తిరుపతి రీజియన్‌లో ఎన్ఎంయూ మెరుపు సమ్మె
తిరుపతి: ఆర్టీసీ తిరుపతి రీజియన్‌లోని వివిధ డిపోలలోని మహిళా ఉద్యోగులపై వేధింపులు, ఆర్ఎం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా ఎన్ఎంయూ కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మెకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 3.00 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1500 బస్సులలో 850 బస్సులు డిపోలకే పరిమితమైనాయి. జిల్లాలోని వివిధ డిపోల ముందుకు చేరిన ఎన్ఎంయూ కార్మికులు... సీఎం సొంత జిల్లాలో మహిళా కండక్టర్లకు రక్షణ కరువైందని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మహిళా కండక్టర్లను ఆర్టీసీ కంట్రోలర్ నాదముని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఆర్ఎంకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఎన్ఎంయూ కార్మికులు విమర్శించారు. దీంతో మెరుపు సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు వారు తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
2న బస్సుల దిగ్బంధం
ఆర్టీసీ కార్మికుల పోరుబాట వేతన సవరణకోసం డిమాండ్ బస్‌భవన్ ముట్టడికి నిర్ణయం పదోతరగతి విద్యార్థులకు ఇబ్బంది సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేసేందుకు గుర్తింపు పొందిన సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు ఏప్రిల్ 2న బస్‌భవన్ ముట్టడి నిర్వహించాలని నిర్ణయించాయి. దాదాపు 20 వేల మంది కార్మికులతో సుందరయ్య భవన్ నుంచి ఆర్టీసీ భవన్ వరకు ర్యాలీగా వచ్చి కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించాయి. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యేలా దిగ్బంధం చేయబోతున్నారు. దీంతో పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే దానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ఆందోళనకు గురవుతున్న అధికారులు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కార్మిక సంఘాలను కోరుతున్నారు. కానీ తాము ఎట్టిపరిస్థితిలోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. నిజానికి అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ, పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏప్రిల్ రెండుకు కార్యాచరణను వాయిదా వేసుకున్నారు. ఆ రోజు బహిరంగసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటామని కార్మిక నేతలు పేర్కొంటున్నారు. ఎన్ఎంయూ నిరాహారదీక్షలు.. వేతన సవరణ, ఆర్టీసీ విభజన ప్రధాన డిమాండ్లుగా ఎన్ఎంయూ సోమ, మంగళవారాల్లో ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు నిర్వహించనుంది. తమ డిమాండ్లపై యాజమాన్యం స్పందించటం లేదని, గుర్తింపు సంఘాలు గందరగోళంగా వ్యవహరిస్తున్నాయని ఎన్ఎంయూ రెండు రాష్ట్రాల ప్రతినిధులు నరేందర్, రమేశ్, చెన్నారెడ్డి, శ్రీనివాసరావు, చంద్రయ్య, రమణారెడ్డిలు ఓ ప్రకటనలో ఆరోపించారు. సమ్మె నోటీసులు ఇచ్చి వాటి గడువు ముగిసేదాక కాలయాపన చేసి ఇప్పుడు బస్‌భవన్ ముట్టడి పేర గుర్తింపు సంఘాలు అయోమయానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. సామూహిక సెలవులో వెళ్లాలని అధికారుల నిర్ణయం ఆర్టీసీ విభజనలో జరుగుతున్న జాప్యంతో విసిగిపోయిన తెలంగాణ అధికారులు ఆందోళనకు సిద్ధమయ్యారు. సంస్థ విభజనపై ప్రకటనలు తప్ప ఎలాంటి కసరత్తు జరగకపోవడంతో అధికారులు, సూపర్వైజర్ స్థాయి సిబ్బంది సామూహిక సెలవులో వెళ్లాలని నిర్ణయించారు. ఆదివారం ఆర్టీసీ తెలంగాణ అధికారుల సంఘం, సూపర్వైజర్ల సంఘ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఇందులో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. వచ్చే నాలుగైదు రోజుల్లో విభజన పరిణామాలు పరిశీలించి తగిన స్పందన రాకపోతే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ స్థాయి నుంచి డిపో సూపర్వైజర్ వరకు సామూహిక సెలవులో వెళ్లాలని తీర్మానించారు. విభజన జరగనప్పటికీ తెలంగాణలో ‘తెలంగాణ ఆర్టీసీ’ అంటూ ఉంచిన బోర్డులను తిరిగి ‘ఏపీఎస్ ఆర్టీసీ’గా మార్చాలని నిర్ణయించారు. విభజన జరగకపోవటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఉద్యోగులందరికీ వివరించి ఆందోళనకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అప్పటికీ చలనం రాకుంటే బస్‌భవన్‌ను ముట్టడించాలని తీర్మానిం చారు. దీనికి సంబంధించి రెండుమూడు రోజుల్లో తేదీలు ప్రకటించనున్నట్టు వెల్లడించారు. -
ఆర్టీసీ సమ్మె లేనట్లే...
-
ఆర్టీసీ సమ్మె లేనట్లే...
* ఎంప్లాయీస్ యూనియన్‌తో యాజమాన్యం చర్చలు సఫలం * ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధ్యయన కమిటీ.. * ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి నివేదిక * సీసీఎస్‌కు రూ.130 కోట్లు.. జూలై నుంచి కొత్త డీఏకి 50 కోట్లు * దసరా అడ్వాన్స్‌కు రూ. 30 కోట్లు సాక్షి, హైదరాబాద్/విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తలపెట్టిన ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెను ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) విరమించింది. బుధవారం ఈయూ నేతలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇక్కడి బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, కె.పద్మాకర్, పి.దామోదర్‌రావు, హన్మంతరావు, రాజేంద్రప్రసాద్, ప్రసాదరెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందని, గత నెల 2న ఇచ్చిన సమ్మె నోటీసులో పేర్కొన్న డిమాండ్లపై సానుకూలంగా స్పందిం చినందున సమ్మెను విరమిస్తున్నట్లు ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, కె.పద్మాకర్, దామోదర్‌రావులు ప్రకటించారు. సమ్మె నోటీసు ఒప్పందం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్‌లో ఈయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము పెట్టిన 11 డిమాండ్లు అమలు చేస్తామని యాజ మాన్యం హామీ ఇవ్వడంతో సమ్మె యోచన విరమించినట్టు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు విజయవాడలో చెప్పారు. యాజమాన్యంతో ఈయూ నేతల చర్చల అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విజ యవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా మూడు రోజులు దీక్షలు చేపట్టామన్నారు. అయినా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకపోవడం తో 40 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. యూనియన్ నేతల వివరాల ప్రకారం యాజమాన్యం ఒప్పుకున్న ముఖ్య డిమాండ్లు.. * ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై అధ్యయన కమిటీ. ఈ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి కమిటీ నివేదిక * ఏపీలో ఆర్టీసీ రుణాల కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు వెంటనే చెల్లింపునకు అంగీకారం. ఆగస్టు 31 వరకు పెండింగ్‌లో ఉన్న రుణాలకు, పదవీ విరమణ చేసిన వారి సెటిల్మెంటుకు రూ.130 కోట్లు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) కింద చెల్లించేందుకు సుముఖత * ఈ నెలలో దసరా అడ్వాన్స్ ఇచ్చేందుకు రూ.30 కోట్లు మంజూరు * కార్మికులకు 5.5 శాతం కొత్త డీఏ ఈ ఏడాది జూలై నుంచి అమలు. అక్టోబరు నెల నుంచి చెల్లింపు. రూ. 50 కోట్లు మంజూరు * పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రొడక్షన్ యూనిట్లకు కొత్త మేన్ అవర్ రేట్ వచ్చే నెల నుంచి అమలు * టి.ఆర్.ఎస్. కార్మికుల బకాయిలు ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నెలల్లో రెండు వాయిదాల్లో చెల్లింపు * డీఏ బకాయిలు, ఆర్జిత సెలవును సమీక్షించి, ప్రకటన చేయడానికి అంగీకారం * కారుణ్య నియామకాలు, ఉద్యోగాలు పెండింగ్‌లో ఉంటే వాటిపై సర్క్యులర్ * పల్లె వెలుగు బస్సులకు సింగిల్ డోర్ ఏర్పాటుపై యాజమాన్యం సానుకూల స్పందన * అలవెన్సులు, సర్వీసు కండిషన్లపై ఈ నెల 20న పే కమిటీకి రిపోర్టు ఇచ్చిన వెంటనే అమలు * ఆగస్టు 2న ఇచ్చిన సమ్మె నోటీసులో పొందుపరిచిన ఇతర డిమాండ్లపై యాజమాన్యం లిఖితపూర్వక హామీ ఈయూ మరోసారి కార్మిక ద్రోహం చేసింది: ఎన్ఎంయూ కార్మికుల ప్రధాన అంశమైన వేతన సవరణను పక్కన పెట్టి ఇతర అంశాల పేరుతో సమ్మె చేస్తామని చెప్తూ వచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ మరోసారి కార్మికులకు ద్రోహం చేసిందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) అధ్యక్షుడు నాగేశ్వరరావు ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇటీవలి కాలంలో ఐదుసార్లు సమ్మె పేరుతో కార్మికులను ఈయూ మభ్య పెట్టిందని ఆరోపించారు. -
ఎన్ఎంయూ సమ్మె నోటీసు
-
ఎన్ఎంయూ సమ్మె నోటీసు
ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణే ఏకైక ఎజెండా సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణే ఏకైక డిమాండ్‌గా సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) తెలిపింది. కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం తమతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఎన్ఎంయూ అధ్యక్షుడు ఎం.నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్, మరికొందరు ప్రతినిధులతో కలిసి ఆయన మంగళవారం ఆర్టీసీ పరిపాలన విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీస్‌ను అందజేశారు. జనవరి 8లోపు కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని నాగేశ్వర్రావు యాజమాన్యాన్ని హెచ్చరించారు. గతేడాది జూలై 28న రవాణామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సి ఉందన్నారు. సీమాంధ్రలో సకల జనుల సమ్మె సమయంలో ప్రభుత్వం కార్మికసంఘాలతో చర్చించిందని, ఉద్యోగుల క్రమబద్ధీకరణకు డిసెంబర్‌లోపు జీవో విడుదల చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదన్నారు. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు సిద్ధమవ్వాల్సి వస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులైరె జ్ చేసేవరకు విశ్రమించబోమని చెప్పారు. గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్‌కు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఆ సంఘం ఇచ్చిన సమ్మె నోటీస్‌లో కార్మికుల డిమాండ్లపై స్పష్టత లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాగా ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని నాగేశ్వర్రావు అంతకుముందు బస్‌భవన్ ఎదుట జరిగిన కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూలు కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని, ఏడాది కాలంలో ఒక్క సమస్యనూ పరిష్కరించ లేకపోయాయని విమర్శించారు. ఈ ధర్నాలో పలు డిపోలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
సమైక్య బస్సులపై దాడిని ఖండించిన ఆర్టీసీ సంఘాలు
శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సేవ్ ఏపీ సభకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో బస్సులపై దాడి చేయడాన్ని ఆర్టీసీ ఈయూ, ఎన్ఎంయూ ఖండించాయి. ఈమేరకు రెండు సంఘాలు ఆదివారం వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రజాస్వామ్యయుతంగా, అత్యంత క్రమశిక్షణతో సభకు వచ్చిన వారిపై దాడులు చేయడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు బాలమునెయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశాయి. అపోలో ఆసుపత్రికి తరలింపు శనివారం బస్సులపై జరిగిన దాడిలో గాయపడిన సత్యనారాయణ(వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, రాజమండ్రి)ని వనస్థలిపురంలోని స్థానిక ఆసుపత్రి నుంచి ఆదివారం ఆపోలో ఆసుపత్రికి తరలించారు. దవడ ఎముక విరగడంతో పాటు పలు చోట్ల గాయాలయ్యాయి. దవడ ప్రాంతంలో శస్త్ర చికత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులు ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయిస్తున్నారు.