
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఈ నెల 11 నుంచి తలపెట్టిన సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) మద్దతు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. ఏకపక్ష వైఖరితో కార్మికులకు నష్టం కలిగేలా గుర్తింపు కార్మిక సంఘం వ్యవహరిస్తోందని ఎన్‌ఎంయూ నేతలు నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, నరేందర్, మౌలానా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ సిబ్బందికి తక్కువ వేతనాలున్నందున తాము 62 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేశామని, కానీ టీఎంయూ 50 శాతం ఫిట్‌మెంట్‌నే కోరిందన్నారు.