ఓ వైపు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశించినా ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం పట్టువీడటం లేదు.
హైదరాబాద్ : ఓ వైపు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశించినా ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం పట్టువీడటం లేదు. బుధవారం ఉదయం 10.30 గంటలకు బస్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. మరోవైపు ఉదయం 11గంటలకు ఏపీ ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించగా, మరోవైపు తెలంగాణ సర్కార్ ఫిట్మెంట్పై నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక సమ్మెపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తర్జనభర్జనలు పడుతున్నాయి.