తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. ఆర్టీసీ కార్మికులకు 40 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. ఆర్టీసీ కార్మికులకు 40 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సచివాలయంలో కార్మిక సంఘ ప్రతినిధులతో సీఎం అధికారికంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఆయన... ఆర్టీసీ కార్మికుల సమక్షంలో 40 శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు.
అంతకు ముందు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, ఆర్టీసీ జేఎండీ రమణారావు పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లపై కేసీఆర్.. టీఎంయూ నేతలు తిరుపతి, అశ్వత్థామరెడ్డిలతో మాట్లాడారు. సమ్మె విరమింపజేయడం, ఆర్టీసీని రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్మికుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారు.