
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ అక్రమ రవాణాతో ఆర్టీసీకి రూ.వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) నేతలు ఎం.నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, మౌలానా, రఘురాం తదితరులు పేర్కొన్నారు. రవాణా శాఖ తక్షణమే వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి నియమించిన కో ఆర్డినేటర్ చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. తక్షణమే ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోకపోతే రవాణా శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని గురువారం హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment