తరచూ నిబంధనలు మారుస్తూ కార్మికుల భవిష్య నిధితో ఆటలాడుకోవటం సరికాదని, పీఎఫ్ పింఛనుదారుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎన్‌ఎంయూ కోరింది.
సాక్షి, హైదరాబాద్: తరచూ నిబంధనలు మారుస్తూ కార్మికుల భవిష్య నిధితో ఆటలాడుకోవటం సరికాదని, పీఎఫ్ పింఛనుదారుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎన్‌ఎంయూ కోరింది. కార్మికులు దాచుకున్న భవిష్య నిధి భవితవ్యాన్ని గందరగోళం చేయటం తగదని సంఘ నేతలు నాగేశ్వరరావు, మౌలానా, రఘురాం, లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
కనీస పీఎఫ్ పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.7 వేలకు పెంచాలని, పెరుగుతున్న డీఏను పెన్షన్‌కు వర్తింపచేయాలని, భవిష్య నిధిలోని రూ.30 వేల కోట్ల అన్‌క్లెయిమ్డ్ మొత్తాన్ని పెన్షన్ స్కీమ్‌కు తరలించాలని, పీఎఫ్ మీద పన్ను రద్దు చేయాలని, ధర్మకర్తల మండలి అధికారాన్ని పెంచాలని కోరారు.