సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బస్సు పేరు మారింది.. ఇక మీదట TSRTC కాదు.. TGSRTCగా యాజమాన్యం పేరు మార్చింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు పేరు మార్పు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో పలు కీలక మార్పులు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్(TS)ను తెలంగాణ(TG) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టీఎస్ఆర్టీసీ ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీగా లోగో మార్పులు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చడం జరిగిందని.. సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాల పేర్లను తెలియజేశారు. ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq గా సంస్థ మార్చిందన్నారు. ప్రయాణీకులు, ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఏవైనా ఫిర్యాదులు ఉంటే మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి సమాచారం తీసుకురావాలని విజ్ఙప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq అనే ఎక్స్ ఖాతాలను ఫాలో అవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ముఖ్య గమనిక: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చడం జరిగింది. ఆ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చింది. మీ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని… pic.twitter.com/vwwnklHttw
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 22, 2024
Comments
Please login to add a commentAdd a comment