సాక్షి, హైదరాబాద్: కార్మికులకు ఆర్థిక చెల్లింపుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 18న బస్‌భవన్‌ను ముట్టడించనున్నట్టు ఎన్‌ఎంయూ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2013 ఏప్రిల్ నుంచి అందాల్సిన వేతన సవరణ బకాయిలు, మూడేళ్ల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు, కొత్త డీఏ చెల్లింపు, 22 మాసాల ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌డీసీరుణాల చెల్లింపులు, గతంలో యాజమాన్యం ఖర్చుచేసిన పీఎఫ్ డబ్బులు ఈనెల 13 లోపు చెల్లించాలని, లేకుంటే బస్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆ సంఘం ప్రతినిధులు నాగేశ్వరరావు, లక్ష్మణ్, మౌలానా, రఘురాంలు ప్రకటనలో హెచ్చరించారు.