కార్మికుల సంక్షేమమే ఎన్‌ఎంయూ లక్ష్యం
కార్మికుల సంక్షేమమే ఎన్‌ఎంయూ లక్ష్యం
Published Sun, Dec 11 2016 8:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
* ఎన్‌ఎంయూ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు డీఎస్‌పీ రావు
రేపల్లె: ఏపీఎస్ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థిగా రేపల్లె డిపో నుంచి పోటీచేస్తున్న ఇంకొల్లు శ్రీనివాసరావును బలపరచాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు డీఎస్‌పీ రావు ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. సీపీఎస్ ఎన్నికలను పురస్కరించుకుని స్థానిక డిపో కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన గేట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమమే ఎన్‌ఎంయూ లక్ష్యమన్నారు. గత సీసీఎస్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయని ఘనత ఎంప్లాయీస్ యూనియన్‌కే దక్కుతుందన్నారు. కార్మికులకు అవసరమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలంటే ఎన్‌ఎంయూ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్‌ఎంయు పాలకవర్గంగా ఉన్న సమయంలో సీసీఎస్‌లో స్వల్పకాలిక రుణాల వరకు మాత్రమే ఉండగా గృహ రుణాలను ప్రవేశపెట్టిందన్నారు. గృహ రుణాలపై ఉన్న 12.5 శాతం వడ్డీని 9శాతంకు తగ్గించిందని, పిల్లల చదువులకై నూతనంగా విద్యారుణాలు ప్రవేశపెట్టింది ఎన్‌ఎంయునే అని తెలిపారు. ప్రతి సభ్యుడికి 10రోజులలో లోన్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎడ్యుకేషన్ లోన్లు పెంచడం, నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు. ఇన్సూరెన్స్ పథకంను లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచుతామని వెల్లడించారు. ప్రతి జోన్‌లో ఒక సీసీఎస్ బ్రాంచ్ ఆఫీసును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.హనుమంతరావు, రీజియర్ సెక్రటరీ కేవిఎస్ నరసింహారావు, జోనల్ ట్రెజరర్ ప్రభాకరరావు, ఎన్‌ఎంయు అభ్యర్ధి ఇంకొల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement