కబేళాలకు తరలుతున్న పశువులు
– పట్టించుకోని ప్రభుత్వాలు
– పోషణభారమై సంతలో విక్రయిస్తున్న రైతులు
– నిత్యం మైదుకూరు సంతలో వందల గేదలు కలేబరాలకు తరలింపు
మైదుకూరు టౌన్: రోజు రోజుకు పశువుల పోషణ భారమై.. పాల ఉత్పత్తి దూరమై ప్రజలు సంతలో పశువులను కలేబలాలకు తరలిస్తున్నారు. పాడి ఉన్న ఇంట్లో సిరి సంపనలకు కొదవ ఉండేది కాదని ఒకప్పటి మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాడి పోషణ రైతులకు భారంగా మారింది. శనివారం వచ్చిందంటే చాలు సంతలో పోషణ భారమైన పోషించలేక కబేళాకు తరలిస్తున్న ఘటనలు మైదుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. నియోజవర్గంలో పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్న బి.మఠం, దువ్వూరు, వనిపెంట, మైదుకూరులో వేలాది మంది రైతులు జీవిస్తున్నారు. ఒక్కసారిగా పాడి పరిశ్రమ దెబ్బతినడుటంతో రైతులు తీవ్రం గా నష్టపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లోని రైతులు పాడి పరిశ్రమకు స్వస్తి పలుకుతుండడంతో పాల కొరత ఏర్పడుతోంది. ఆహార పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు పాడిపరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో పాడి పరిశ్రమ కూడా సంక్షోభంలో కూరుకుపోతుండంతో రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ సాగు సమయంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొనడంతో దిగుబడి చేతికందక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వేసవిలో పశుగ్రాసం కొరత ఉండడంతో పల్లెలో పాలు ఉత్పత్తికి గడ్డుకాలం దాపురించింది. పశుగ్రాసం, దానా తదితర ఖర్చులు రెట్టింపు పెరగడంతో పాడి పెంపకంపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. లీటరు రూ.55 చెల్లిద్దామన్నా నాణ్యమైన పాలు దొరకడం లేదు.
భారమైన పశుపోషణ: గతంలో గేదెలను మేతకు పొలానికి తోలుకెళ్లేతే పశువుల కాపర్లకు ఏడాదికి రూ.15వేలు చెల్లిస్తే సరిపోయోది. ప్రస్తుతం రూ. 40వేలు చెల్లించినా పశువుల కాపరులు దొరకడం లేదు. దీనికి తోడు పశువుల ధరలు అమాంతంగా పెరిగాయి. వేసవికాలంలో వర్షాభావం కారణంగా పల్లెల్లో గడ్డిపోచ కరువైంది. ఎక్కడా పశువులకు మేత దొరకని పరిస్థితి. గేదెలను మేపడం వీలుకాక చాలామంది పాడి రైతులు ఒకటి, రెండు గేదెలతో సరిపెట్టుకొంటున్నారు. మిగిలిన వాటిని అమ్మేసుకుంటున్నారు. పాడి ఆవులు, గేదెలకు అందించే గడ్డితోపాటు దాణా, తౌడు ధరలు పూర్తిగా పెరిగిపోయాయి. గిట్టుబాటు కాకా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఎండుగడ్డి ధర రూ.15వేలు ఉంటే ప్రస్తుతం ట్రాక్టర్ గడ్డి రూ.25వేలకు చేరింది. బస్తా తౌడు ధర రూ.1700లకు చేరింది. ఒక గేదకు అయ్యే ఖర్చు పాలదిగుబడికంటే అధిగమౌతోంది. దీంతో పాడి రైతులు నష్టాల పాలవుతున్నారు. చేసేది ఏమిలేక గేదలు బక్కచిక్కిపోవడం తట్టుకోలేక కలేబలాలకు తరలిస్తున్నారు.
గిట్టుబాటు గాని పాల ధర: పాల ధర గిట్టుబాటు కావటం లేదు. డెయిరీల్లో 10 పాయింట్లు వెన్న శాతం చూపిస్తేనే లీటరు రూ.50 నుంచి55వరకు ధర చెల్లిస్తున్నారు. వెన్నశాతం తక్కువగా ఉన్న పాలకు రూ. 40నుంచి45 మించి చెల్లించడం లేదు. పశులు పోషణ,మేత ఖర్చులకు వచ్చే రాబడి ఏమాత్రం సరిపోక రైతులు పశువులు కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం సబ్సీడీతో పశుగ్రాసం ప్రోత్సాహాలను అందించాలని పాడి రైతులు కోరుతున్నారు.
రోజు రోజుకు పశువుల పోషణ భారమైంది..: కరువు పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుండటతో పశువుల పోషణ భారమైంది. ఒక్క తౌడు మూట కొనాలన్నా.. వాటి కి ధానా వేయాలన్నా.. ట్రాక్టర్ చెత్త కొనాలన్నా వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చేసేది ఏమీలే పశువులను సంతలో విక్రయించాల్సి వస్తోంది. పాల ఉత్పత్తి వచ్చ అధాయం కాన్న.. వాటి పోషణే భారమవుతోంది.