Slaughterhouse
-
స్టోరీ రాస్తావా..! అంటూ రిపోర్టర్‌పై దాడి
-
గోమా(ఫి)య
వారానికి రూ.4 కోట్లు.. నెలకు రూ.16 కోట్లు.. ఏడాదికి రూ.200 కోట్లు.. ఏంటి.. ఈ అంకెలనుకుంటున్నారా? కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పశువులపై జరుగుతున్న వ్యాపారం ఇది. వ్యవసాయం భారంగా మారిన తరుణంలో అన్నదాత పశుపోషణ వదులుకుంటున్నాడు. రైతు అవసరాల కోసం కొంత పశుసంపద ఉంచుకున్నా.. మిగిలినది మాత్రం పశు మాఫియా ద్వారా కబేళాలకు తరలుతోంది. ప్రకృతి అనుకూలించకపోవడం.. చీడపీడల బెడద.. అక్కరకు రాని ప్రభుత్వ పథకాలు.. గిట్టుబాటు కాని ధరలు.. ఆదుకోని ప్రభుత్వం.. వెరసి వ్యవసాయానికి దూరమై వేరే వ్యాపకాలు చూసుకుంటున్న రైతులు తాము ప్రేమగా పెంచుకున్న పశువులను అమ్ముకుంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో వారానికి ఒకరోజు జరిగే సంత పశువుల మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రైతులు, పాడిపోషకులు, వ్యాపారులు ఇక్కడ పశువుల క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఈ సంతల ద్వారా మార్కెట్ యార్డు కమిటీలకు దండిగా ఆదాయం చేరుతోంది. ఈ మార్కెట్ యార్డుల కమిటీలను పశుమాఫియా తమ చేతి కీలుబొమ్మలుగా మార్చుకుని, పశు సంపదను దోచుకుని కబేళాలకు తరలిస్తోంది. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, క్రోసూరులో పశువుల సంతలు ఉన్నాయి. వారంలో ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో పశువుల సంతలు నిర్వహిస్తుంటారు. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట యార్డు పరిధిలోని చిల్లకొల్లు గొర్రెల మండీలు, నందిగామ పశువుల సంతతో పాటు జీవాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఆయా సంతలో గేదెలు, దున్నలు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు సంతలకు వస్తున్నాయి. ప్రతివారం వేల సంఖ్యలో వస్తుండగా, వచ్చిన వాటిలో 40శాతం మాత్రమే పాడిపోషణకు, వ్యవసాయ అవసరాలకు కొంటున్నారు. మిగిలిన 60 శాతం పాడి పశువులు, ఎద్దులు, ఆవులను తమిళనాడులోని కబేళాలకు తరలిస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో గోవులు, గేదెలను కుక్కి తీసుకెళ్తూ పట్టుబడిన కంటైనర్లు, లారీలే∙ఇందుకు నిదర్శనం. అంతా ‘అమ్మ’ కనుసన్నల్లో.. గుంటూరు జిల్లాలో జరిగే పశువుల సంతలో లావాదేవీలన్నీ మంత్రి సతీమణి కనుసన్నల్లో జరుగుతాయి. చిలకలూరిపేటలో మంత్రి కీలక అనుచరుడు రంగంలోకి దిగి ప్రైవేట్‌గా సంతనే నిర్వహిస్తున్నాడు. సంత చుట్టూ ప్రహరీ నిర్మించి బౌన్సర్లను నియమించుకున్నాడు. ఆ సంతలోకి వెళ్తే.. వారు చెప్పినట్టే రైతులు ఇచ్చుకోవాలి. కాదు.. అంటే బౌన్సర్ల చేతి దెబ్బలు తిని రావాలి. ఇక్కడి నుంచే మూగజీవాలు కబేళాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సంతలో పశు క్రయవిక్రయాలు జరిగినా అమ్మ అనుమతితో పాటు మంత్రి అనుచరుడికి కప్పం చెల్లించాలి. చిలకలూరిపేటలో కప్పం చెల్లిస్తే రాష్ట్ర సరిహద్దుల వరకూ ఏ స్థాయి అధికారి వాహనాన్ని అడ్డుకునేది లేదు. నిబంధనలు ఇవీ.. పశువుల సంత నిర్వహణకు చాలా నిబంధనలు ఉన్నాయి. సంత నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన ఎనిమిది మందితో ఎస్ఎల్ఎంసీ కమిటీ ఏర్పాటుచేయాలి. వారు నిత్యం సంతలను పర్యవేక్షిస్తుండాలి. సంతల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, పాకలు, పశుగ్రాసం, తాగునీటి సౌకర్యం, పశువులు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఏర్పాటు చేయించాలి. రవాణాచేసే ప్రతి జీవానికి సంబంధిత కమిటీలో పశువైద్యుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. సంతలో విక్రయించిన, కొనుగోలు చేసిన వివరాలను రికార్డు చేయించాలి. తక్కువ వయస్సు (యంగ్ యానిమల్) అయితే, అవి వ్యవశాయానికా, పాల దిగుబడి, లేదా పునరుత్పత్తి (బ్రీడింగ్) కోసమా అనే డిక్లరేషన్‌ను పశువుల కొనుగోలుదారుల వద్ద తీసుకోవాలి. ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్స్ యాక్ట్–1977 (సెక్షన్–6) ప్రకారం ఇతర రాష్ట్రాలకు ఆవులను రవాణా చేయరాదు. సంత నుంచి రవాణా చేసే వాహనాల ధ్రువపత్రాలను పోలీస్, రవాణా, పశు సంవర్ధకశాఖ, మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు పరిశీలించాలి. కానీ, పై నిబంధనలు ఎక్కడ అమలుకావు. -
కబేళాలకు తరలుతున్న పశువులు
– పట్టించుకోని ప్రభుత్వాలు – పోషణభారమై సంతలో విక్రయిస్తున్న రైతులు – నిత్యం మైదుకూరు సంతలో వందల గేదలు కలేబరాలకు తరలింపు మైదుకూరు టౌన్: రోజు రోజుకు పశువుల పోషణ భారమై.. పాల ఉత్పత్తి దూరమై ప్రజలు సంతలో పశువులను కలేబలాలకు తరలిస్తున్నారు. పాడి ఉన్న ఇంట్లో సిరి సంపనలకు కొదవ ఉండేది కాదని ఒకప్పటి మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాడి పోషణ రైతులకు భారంగా మారింది. శనివారం వచ్చిందంటే చాలు సంతలో పోషణ భారమైన పోషించలేక కబేళాకు తరలిస్తున్న ఘటనలు మైదుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. నియోజవర్గంలో పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్న బి.మఠం, దువ్వూరు, వనిపెంట, మైదుకూరులో వేలాది మంది రైతులు జీవిస్తున్నారు. ఒక్కసారిగా పాడి పరిశ్రమ దెబ్బతినడుటంతో రైతులు తీవ్రం గా నష్టపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లోని రైతులు పాడి పరిశ్రమకు స్వస్తి పలుకుతుండడంతో పాల కొరత ఏర్పడుతోంది. ఆహార పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు పాడిపరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో పాడి పరిశ్రమ కూడా సంక్షోభంలో కూరుకుపోతుండంతో రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ సాగు సమయంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొనడంతో దిగుబడి చేతికందక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వేసవిలో పశుగ్రాసం కొరత ఉండడంతో పల్లెలో పాలు ఉత్పత్తికి గడ్డుకాలం దాపురించింది. పశుగ్రాసం, దానా తదితర ఖర్చులు రెట్టింపు పెరగడంతో పాడి పెంపకంపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. లీటరు రూ.55 చెల్లిద్దామన్నా నాణ్యమైన పాలు దొరకడం లేదు. భారమైన పశుపోషణ: గతంలో గేదెలను మేతకు పొలానికి తోలుకెళ్లేతే పశువుల కాపర్లకు ఏడాదికి రూ.15వేలు చెల్లిస్తే సరిపోయోది. ప్రస్తుతం రూ. 40వేలు చెల్లించినా పశువుల కాపరులు దొరకడం లేదు. దీనికి తోడు పశువుల ధరలు అమాంతంగా పెరిగాయి. వేసవికాలంలో వర్షాభావం కారణంగా పల్లెల్లో గడ్డిపోచ కరువైంది. ఎక్కడా పశువులకు మేత దొరకని పరిస్థితి. గేదెలను మేపడం వీలుకాక చాలామంది పాడి రైతులు ఒకటి, రెండు గేదెలతో సరిపెట్టుకొంటున్నారు. మిగిలిన వాటిని అమ్మేసుకుంటున్నారు. పాడి ఆవులు, గేదెలకు అందించే గడ్డితోపాటు దాణా, తౌడు ధరలు పూర్తిగా పెరిగిపోయాయి. గిట్టుబాటు కాకా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఎండుగడ్డి ధర రూ.15వేలు ఉంటే ప్రస్తుతం ట్రాక్టర్ గడ్డి రూ.25వేలకు చేరింది. బస్తా తౌడు ధర రూ.1700లకు చేరింది. ఒక గేదకు అయ్యే ఖర్చు పాలదిగుబడికంటే అధిగమౌతోంది. దీంతో పాడి రైతులు నష్టాల పాలవుతున్నారు. చేసేది ఏమిలేక గేదలు బక్కచిక్కిపోవడం తట్టుకోలేక కలేబలాలకు తరలిస్తున్నారు. గిట్టుబాటు గాని పాల ధర: పాల ధర గిట్టుబాటు కావటం లేదు. డెయిరీల్లో 10 పాయింట్లు వెన్న శాతం చూపిస్తేనే లీటరు రూ.50 నుంచి55వరకు ధర చెల్లిస్తున్నారు. వెన్నశాతం తక్కువగా ఉన్న పాలకు రూ. 40నుంచి45 మించి చెల్లించడం లేదు. పశులు పోషణ,మేత ఖర్చులకు వచ్చే రాబడి ఏమాత్రం సరిపోక రైతులు పశువులు కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం సబ్సీడీతో పశుగ్రాసం ప్రోత్సాహాలను అందించాలని పాడి రైతులు కోరుతున్నారు. రోజు రోజుకు పశువుల పోషణ భారమైంది..: కరువు పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుండటతో పశువుల పోషణ భారమైంది. ఒక్క తౌడు మూట కొనాలన్నా.. వాటి కి ధానా వేయాలన్నా.. ట్రాక్టర్ చెత్త కొనాలన్నా వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చేసేది ఏమీలే పశువులను సంతలో విక్రయించాల్సి వస్తోంది. పాల ఉత్పత్తి వచ్చ అధాయం కాన్న.. వాటి పోషణే భారమవుతోంది. -
ఇక నుంచి కోడి, మేక మాంసమే దిక్కు!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో కబేళాలు మూతపడటంతో కాన్పూర్‌లోని జూలో పలు జంతువులకు చిక్కు వచ్చిపడింది. నిన్నమొన్నటి దాకా అవి గేదెమాంసాన్ని ఆరగించేవి. కాన్పూర్‌లో కబేళాల మూసివేత ఫలితంగా గేదె, దున్నపోతు మాంసం దొరక్కపోవడంతో జూ అధికారులు మేక, కోడి మాంసాన్ని వడ్డిస్తున్నారు. కోడి, మేక మాంసాలను క్రూరమృగాలు ఇష్టపడటం లేదట. బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అక్రమ, అనుమతుల్లేని కబేళాలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ మాంసానికి కొరత ఏర్పడింది. కాన్పూర్ జూలో మగ సింహం అజయ్, ఆడసింహం నందినితోపాటు మాంసాహారం తినే జంతువులు 70 ఉన్నాయి. మగ మాంసాహార జంతువులు రోజుకి 12 కేజీల మాంసాన్ని, ఆడ జంతువులు 10 కేజీల మాంసాన్ని తింటాయి. రోజు 150 కేజీల దున్నపోతు మాంసాన్ని జూ కొనుగోలు చేస్తుంది. జూలోని కొన్ని జంతువులకు కోడి మాంసాన్ని ఆహారంగా పెడితే తినేందుకు ఆసక్తి చూపడం లేదని, కొన్ని అయితే దానిని ముట్టుకోవడమే లేదని అధికారులు చెబుతున్నారు. -
కబేళాకు తరలిస్తున్న గోవులను రక్షించిన పోలీసులు
ఆవులను కబేళాకు తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మంగళవారం తొండపల్లి సమీపంలో పట్టుకున్నారు. తొండుపల్లి సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారిపై డీసీఎం వాహనంలో ఆవులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆవులను గోశాలకు పంపారు. -
గడ్డుకాలం
♦ అలమటిస్తున్న మూగజీవాలు ♦ గ్రాసమూ లేదు.. నీళ్లూ లేవు ♦ కబేళాలకు తరలుతున్న పశుసంపద ♦ కొన్నిచోట్ల అయినకాడికి విక్రయాలు ♦ కరువు కాలంలో భారంగా మారిన పశుపోషణ ♦ చేతికొచ్చిన పంటే గ్రాసమాయె.. కొన్యాలకి చెందిన యాదాగౌడ్ మాదూర గ్రామంలో ఎకరం ఎనిమిది కుంటల పొలంలో రబీ కింద వరి సాగు చేశాడు. పొట్టపోసుకునే దశలో నీరందక పంటంతా ఎండిపోయింది. దీంతో పొలంలో పశువులను వదిలేశాడు. స్వేదం చిందించి చేసిన సేద్యం తనకు కలిసి రాకున్నా.. కనీసం పశువుల ఆకలినైనా తీరుస్తుందని ఆ రైతు అంటున్నాడు. - హత్నూర నెమరు వేసేందుకు గడ్డి పరకలు కరువు.. గొంతు తడిసే దారే లేదు. కనీసం నిలువ నీడా లేకుండాపోయింది. దుర్భిక్షం రైతులనే కాదు.. వ్యవసాయంలో రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే పశుసంపదనూ నకనకలాడిస్తోంది. నిన్నటి వరకు వెన్నంటి ఉన్న మూగజీవాల్ని.. పోషించే దారి లేక రైతులు వదిలించుకుంటున్నారు. గడ్డి మోపు ధర రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతుండటంతో కరువు కాలంలో అంత పెట్టి కొనే స్థోమత లేక వారాంతపు సంతల్లో అయిన కాడికి అమ్మేసుకుంటున్నారు. కొందరు కబేళాలకు తరలిస్తున్నారు. - జోగిపేట మెదక్ జిల్లాలో మూగజీవాలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పశువులకు తినడానికి గడ్డి లభించక, తాగేందుకు నీరు దొరకక, కనీసం నిలబడేందుకు చెట్ల నీడ లేక అల్లాడిపోతున్నాయి. వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో రైతులు భూములన్నింటినీ సాగు చేయలేక వృథాగా వదిలేశారు. పొలాల్లోని చెట్లను నరికి వేస్తూ కలపను విక్రయించుకుంటున్నారు. పశుగ్రాసం దొరకకపోవడంతో గ్రామాల్లో ఉన్న పశువులను అమ్ముకుంటున్నారు. మరికొన్ని పశువులను ఎంత దొరికితే అంతకే లాభం ఆశించకుండా విక్రయిస్తున్నారు. నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ఎక్కువగా జహీరాబాద్ ప్రాంతంలో గల అల్లానా ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోనే పశుసంపద అత్యధికంగా ఉండే మెదక్ జిల్లా.. ప్రస్తుతం గడ్డు పరిస్థితి నెలకొంది. కరవు నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండుగడ్డి కూడా లభించ క వ్యవసాయదారులు పక్క జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ఎద్దులు, ఆవులు 4.42 లక్షలు, గేదెలు 4.37 లక్షలు, గొర్రెలు 10.83 లక్షలు, మేకలు 5.72 లక్షలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఐదేళ్ల కొకసారి జరిగే పశుగణన ప్రకారం నిర్ధారించిన లెక్కలివి. ఇంత పెద్దసంఖ్యలో పశుసంపద గల జిల్లాలో వాటికి మేత సమస్యగా మారింది. మేకలు, గొర్రెలు తినడానికి పచ్చిగరక, తాగడానికి నీళ్లు లభించక వీటి పెంపకందారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశుగ్రాసం కొరత వాస్తవమే జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడిన విషయం వాస్తవమేనని పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి చెప్పారు. ఆయనేమన్నారంటే.. ‘జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నుల గ్రా సం కొరత ఉంది. దాన్ని అధిగమించేందుకు పశు సంవర్ధక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా 160 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం విత్తనాలకు రూ.40 లక్షలు వెచ్చించి 5 వేల ఎకరాలలో పండించాం. మరో 10 వేల ఎకరాలలో విత్తనాలు పండిస్తే కొంత వరకు కొరత తీరే అవకాశం ఉంది. జిల్లాలోని అన్ని మండలాల్లో పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచాం. జిల్లాలో 8.50 లక్షల పశుసంపద ఉంది. కేవలం వ్యవసాయానికి ఉపయోగానికి రాని పశువులను మాత్రమే విక్రయించాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పశువులు కబేళాలకు తరలించొద్దు. జిల్లాలోని అల్లానా, ఆల్‌కబీర్ ఫ్యాక్టరీలకు పశువులను తరలిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సాధ్యమైనంత వరకు వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తాము పండిస్తున్న పంటలతో పాటే పశుగ్రాసాన్ని కూడా పండించుకోవాలి. పశువులకు తాగునీటి అవసరాల కోసం నీటి తొట్టెలను ఈజీఎస్ ద్వారా నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’. ఊహకందని వేదన.. నాకు ఊహ వచ్చిన నాటి నుంచి ఇంత దుర్భిక్షాన్ని చూడలేదు. గతంలో పశువులకు ఎంతంటే అంత పశుగ్రాసం లభించేది. రెండేళ్ల నుంచి పరకే కరువైంది. గడ్డి మోపు రూ.250 పెట్టి కొన్నా.. పశుగ్రాసం కోసం ఎన్నడూ ఇన్ని తిప్పలు పడింది లేదు. పశువులకు మేతే కాదు.. నీళ్లూ అందించలేకపోతున్నాం. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. కుళాయిల ద్వారా వచ్చే నీళ్లు మనుషుల అవసరాలకే సరిపోవట్లేదు. పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నా అవి ఎవరికి ఇస్తున్నారో మాకైతే తెలియదు. - కిష్టయ్య, రైతు, అన్నాసాగర్ పశువులను అమ్ముకోవద్దు పంటలు పండకపోవడం, విస్తీర్ణం తగ్గిపోవడం, ధరలు పెరగడం, కూలీల లభ్యత లేకపోవడంతో పశువులను రైతులు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు అమ్మితే తిరిగి కొనాలంటే ధరలు విపరీతంగా పెరడం వల్ల కొనలేకపోతామన్న విషయాన్ని గమనించాలి. మండలాల వారిగా పశుసంవర్ధక శాఖ డాక్టర్లను పర్యటింపజేసి రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడతాం. పశువుల సంత, దళారుల అమ్మకాలపై నిఘా పెట్టి అక్రమంగా పశువుల్ని తరలించడం, అమ్ముకోవడం లాంటి వాటిని నియంత్రణ చేస్తాం. జిల్లాలో పశుసంపదను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ లక్ష్మారెడ్డి, జేడీ, పశుసంవర్ధకశాఖ గడ్డి కొరత.. తీరని వెత.. జిల్లాలో సగటున ఒక్కో రైతు నాలుగు నుంచి ఆరేడు పశువుల వరకు పోషిస్తున్నారు. కరువు కారణంగా రైతులు తమకున్న పశువుల్లో కొన్నింటిని అమ్మేసుకుంటున్నారు. నారాయణఖేడ్, జోగిపేట, మెదక్, రామాయంపేట, సిద్దిపేట ప్రాంతాల్లో రైతులు పశువులకు అవసరమన గ్రాసం కొరతతో పశువులను వదిలించుకుంటున్నారు. పశువులను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న వారి వద్దకు దళారులు చేరుకొని క్రయవిక్రయాలు జరుపుతున్నారు. సంతల్లో ఎక్కువగా ఎద్దులు, గేదెల విక్రయాలకు పశుగ్రాసం కొరతే కారణమని రైతులు అంటున్నారు. ఇతర ప్రాంతాలకు తరలింపు.. పశువులు లేని రైతులు తాము పండించిన వరి ధాన్యం పంటలో వచ్చే గడ్డిని డబ్బులు వస్తున్నాయన్న ఆశతో ఇతర ప్రాంతాలకు రూ.150 చొప్పున గడ్డిమోపును అమ్ముకుంటున్నారు. ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు గడ్డి తరలిపోవడం వల్ల కూడా స్థానికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత ఖరీఫ్, రబీ సీజన్లోనే సుమారుగా 25 శాతం ఎద్దులు, గేదెలు తగ్గిపోయినట్లుగా సమాచారం. గడ్డిలేకపోవడంతో చేసేది లేక రైతులు పశువులను వదిలించుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో జరిగే సంతల రోజున ఇతర జిల్లాలకు చెందిన వారు వచ్చి స్థానికంగా ఉన్న రైతులు విక్రయించే పశువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పశువులను జహీరాబాద్ ప్రాంతంలోని అల్లానా ఫ్యాక్టరీకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. -
మేతకు వెళ్లిన పశువులు మాయం!
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు మండలం వట్టిగుడిపాడులో మాయమవుతున్న పశువులన్నీ అక్కడ ఉన్న కబేళాకు తరలివెళుతున్నాయి. వందలాది గేదెలను దొంగిలించి పారిశ్రామికవేత్త పుట్టగుంటకు చెందిన బీఫ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. విషయం తెలిసి రైతులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాయమైన పలు గేదెలు ఫ్యాక్టరీ వద్ద ఉండటంతో రైతులు ఆందోళనకు దిగారు.పోలీసులకు ఫిర్యాదు చేశారు. గేదెలను దొంగిలించి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా బీఫ్‌ను పంపుతున్నట్లు చెప్పారు. **