
మేతకు వెళ్లిన పశువులు మాయం!
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు మండలం వట్టిగుడిపాడులో మాయమవుతున్న పశువులన్నీ అక్కడ ఉన్న కబేళాకు తరలివెళుతున్నాయి. వందలాది గేదెలను దొంగిలించి పారిశ్రామికవేత్త పుట్టగుంటకు చెందిన బీఫ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. విషయం తెలిసి రైతులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మాయమైన పలు గేదెలు ఫ్యాక్టరీ వద్ద ఉండటంతో రైతులు ఆందోళనకు దిగారు.పోలీసులకు ఫిర్యాదు చేశారు. గేదెలను దొంగిలించి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా బీఫ్ను పంపుతున్నట్లు చెప్పారు.
**