
విష్ణువిశాల్ శివాని
తమిళసినిమా: సినీ వారసుల ఎంట్రీలు ఈజీనే. అయితే ఇక్కడ నిలదొక్కుకోవడం అనేది వారి ప్రతిభ, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యమే. అలా నవ నటి శివాని కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షంచుకోనుంది. శివాని అంటే ఎవరన్నది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఎస్ నటి జంట రాజశేఖర్, జీవిత దంపతులు పెద్ద కూతురే ఈ శివాని. ఈ బ్యూటీని ఇంతకు ముందే దర్శకుడు బాలా తన చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో జరగలేదు. తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది. హిందీ చిత్రం 2 స్టేట్స్ తెలుగు రీమేక్‌లో శివాని హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఇలాంటి పరిస్థితిలో కోలీవుడ్ నుంచి శివానికిప్పుడు పిలుపు వచ్చింది. తన యువ నటుడు విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ విషయం గురించి శివాని తెలుపుతూ ఇటీవల విష్ణు విశాల్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పింది.
తన ఫొటోలు పంపించమని చెప్పారని తెలిపింది. ఆ తరువాత తాను చెన్నైకి వచ్చి, దర్శకుడు వెంకటేశ్, విష్ణువిశాల్‌లను కలిశానని చెప్పింది. దర్శకుడు చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, అయితే ఆ సమయంలో వారు హీరోయిన్‌గా తనను కన్ఫార్మ్ చేయలేదని అంది. మరి కొన్ని రోజుల తరువాత తమ చిత్రంలో హీరోయిన్‌వి నువ్వే అని చెప్పారని తెలిపింది. ప్రేమతో కూడిన చాలా ఢిపరెంట్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పింది. తన పాత్రలో నటించడానికి చాలా స్కోప్ ఉంటుందని అంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఎప్పుడెప్పుడు నటిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న శివానికి నటన గురించి చెప్పనక్కర్లేదు. తను నటనలో శిక్షణ తీసుకోవలసిన అవసరం ఉండదనుకుంటా. కారణం ఆమె తల్లిదండ్రులిద్దరూ నటీనటులే కాబట్టి. తను సినిమా వాతావరణంలోనే పుట్టి పెరిగింది.శివాని కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. అదే విధంగా తను చిన్న వయసులోనే హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందట. అయితే ప్రస్తుతం తాను డాన్స్ క్లాసులకు వెళ్లుతున్నట్లు, బెల్లీ, కథక్ నృత్యాలను నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. వేల్‌రాజ్ ఛాయాగ్రహణం, గాయకుడు క్రిష్ సంగీతాన్ని అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment