కూతురికి విలన్గా మారుతున్న హీరో రాజశేఖర్ | Angry Hero rajashekar become villain to his daughter | Sakshi
Sakshi News home page

కూతురికి విలన్గా మారుతున్న హీరో రాజశేఖర్

Published Tue, Dec 15 2015 8:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

కూతురికి విలన్గా మారుతున్న హీరో రాజశేఖర్

కూతురికి విలన్గా మారుతున్న హీరో రాజశేఖర్

హీరోగా సూపర్ సక్సెస్ సాధించి విలన్గా మారుతున్నవాళ్ల లిస్ట్లో మరో హీరో చేరిపోయాడు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంగ్రీ హీరో రాజశేఖర్, ఇటీవల ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఎవడైతే నాకేంటి సినిమా తరువాత ఒక్క హిట్ కూడా సాధించలేకపోయిన రాజశేఖర్.. ఇప్పుడు జగపతిబాబు బాటలోనే విలన్గా టర్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

రాజశేఖర్ కూతురు శివాని 'వందకు వంద' పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాతోనే తను కూడా విలన్గా మారాలని ప్లాన్ చేసుకుంటున్నాడు రాజశేఖర్. ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'ఎవడో ఒకడు' సినిమాలో నెగెటివ్ పాత్ర చేయాలంటూ దిల్ రాజు అడిగినా, కాదన్న రాజశేఖర్.. తన కూతురి సినిమాతో విలన్గా ఎంట్రీ ఇస్తే ఇద్దరికీ ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట. మరి రాజశేఖర్ కూడా జగపతిబాబు తరహాలో ప్రతినాయక పాత్రలో కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement