
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. ‘నామ్ తో సునా హోగా’ అన్నది ట్యాగ్‌లైన్ . హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
చెస్ మూవ్‌ని చేతిలో పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న లుక్ బాగుంది. ‘‘మిస్టర్ బచ్చన్’లో జగపతి బాబు పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండువగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ సిరీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: అయనంక బోస్.
Comments
Please login to add a commentAdd a comment