రాజశేఖర్
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘అర్జున’. మరియం జకారియా హీరోయిన్. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను నట్టికుమార్ ఆవిష్కరించారు. నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది. వాస్తవ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించాం. సూర్యనారాయణ అనే రైతు పాత్రలో, ఆయన తనయుడు అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఓ హైలైట్. దాదాపు 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment