గ్రాఫిక్స్‌ హైలెట్‌ | shiva pralayam title logo release | Sakshi
Sakshi News home page

గ్రాఫిక్స్‌ హైలెట్‌

Published Mon, Nov 20 2017 12:15 AM | Last Updated on Mon, Nov 20 2017 12:15 AM

shiva pralayam title logo release - Sakshi

అభిమన్యుసింగ్, సుమన్, చలపతిరావు, తనాశ్రీ, ‘తాగుబోతు’ రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘శివ ప్రళయం’. ఎం.ఏ. చౌదరి దర్శకత్వంలో శ్రీపాద నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ లోగోని హీరో రాజశేఖర్, దర్శకుడు మారుతి రిలీజ్‌ చేశారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ–‘‘శివప్రళయం’ మంచి టైటిల్‌. టైటిల్‌ ఇంత బాగుందంటే సినిమా ఎంత బాగుంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.

దర్శక–నిర్మాతలు ఈ సినిమాతో మంచి హిట్‌ అందుకుంటారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా రష్‌స్‌ కొంత చూశా. కొత్త తరహా కథలా ఉంది. గ్రాఫిక్స్‌ బాగున్నాయి’’ అన్నారు మారుతి. ‘‘సరికొత్త జానర్‌లో రూపొందిస్తోన్న చిత్రమిది. గంటపాటు సాగే గ్రాఫిక్స్‌ సినిమాకి హైలెట్‌. ఓ ప్రముఖ హీరోయిన్‌పై త్వరలో చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ చేయనున్నాం’’ అన్నారు చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: ఎస్‌. మహి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement