వైవిధ్యంగా ఓ మనిషీ... | o manishi nivevaro songs release | Sakshi
Sakshi News home page

వైవిధ్యంగా ఓ మనిషీ...

Published Tue, May 14 2019 3:23 AM | Last Updated on Tue, May 14 2019 3:23 AM

o manishi nivevaro songs release - Sakshi

రిజ్వాన్‌ కల్‌షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్‌ కుమార్‌ ప్రధానపాత్రల్లో కృష్ణమూర్తి రాజ్‌కుమార్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ మనిషీ నీవెవరు’. గాడ్‌ మినిస్ట్రీస్‌ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్‌ పతాకంపై స్వర్ణకుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను నటులు కృష్ణ విడుదల చేశారు. అనంతరం మొదటి వీడియో సాంగ్‌ను నటులు తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ రిలీజ్‌ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘జీసస్‌ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంటుంది’’ అన్నారు.

‘‘ఇలాంటి చిత్రాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు అనూప్‌ రూబెన్స్‌. ‘‘ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిధ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా’’ అన్నారు సుమన్‌. ‘‘గోపాలకృష్ణగారికి నేను వేరే కథ చెప్పాను. కానీ ఆయన ఈ కథ చెప్పి సినిమా తీయించారు. శివప్రసాద్‌గారి సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తి చేసేవాణ్ణి కాను’’ అని కృష్ణమూర్తి రాజ్‌కుమార్‌ నాయుడు అన్నారు. సీనియర్‌ దర్శకులు సాగర్, నటి కవిత, రిజ్వాన్‌ కులషాన్, స్క్రీన్‌ ప్లే రచయిత గోపాలకృష్ణ దొండపాటి, కెమెరామేన్‌ సూర్యభగవాన్‌ మోటూరి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య భగవాన్‌ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవాని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement