
రిజ్వాస్ కలసిస్
రిజ్వాస్ కలసిస్ ప్రధాన పాత్రలో కృష్ణమూర్తి రాజ్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఓ మనిషి నీవు ఎవరు..?’. సుమన్, చలపతిరావు, జూనియర్ రేలంగి, బి.హెచ్.ఇ.ఎల్ ప్రసాద్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. స్వర్ణ కుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. కె. దుర్గా భవాని సహ నిర్మాత. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. ప్రస్తుతం విజయవాడలో చిత్రీకరణ జరుగుతోంది. ‘‘తొలి షెడ్యూల్‌లో కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించాం’’ అన్నారు దర్శకుడు. ‘‘అవుట్‌పుట్ బాగా వస్తుంది. సంతోషంగా ఉంది. త్వరలో ఆడియో వేడుకను, గుడ్ ఫ్రైడే రోజున సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు నిర్మాత.
Comments
Please login to add a commentAdd a comment