
రిజ్వాన్ కలసిన్, సుమన్, చలపతిరావు, జూనియర్ రేలంగి, బి.హెచ్.ఇ.ఎల్. ప్రసాద్, జెన్నీ ముఖ్య తారలుగా కృష్ణమూర్తి రాజ్ కుమార్ దర్శకత్వంలో స్వర్ణకుమారి దొండపాటి నిర్మిస్తోన్న చిత్రం ‘ఓ మనిషి నీవు ఎవరు?’. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైన సందర్భంగా నటులు చలపతిరావు, సుమన్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. చలపతిరావు కెమెరా స్విచాన్ చేయగా, సుమన్ క్లాప్ ఇచ్చారు. కృష్ణమూర్తి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ‘‘ఇప్పటివరకూ వచ్చిన ఏసుక్రీస్తు సినిమాల్లో ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో ఉంటాయి.
ఇందులో నేను చైతన్ అనే పాత్ర పోషిస్తున్నాను’’ అన్నారు చలపతిరావు. ‘‘ఇది ఆధ్యాత్మిక చిత్రంలా కనిపించినప్పటికీ కమర్షియల్ సినిమాలా కథ, కథనం ఉంటాయి. ఇందులో నేను యోహాన్ పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సుమన్. ‘‘రాజ్‌కుమార్‌గారు చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నాను. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది గుడ్ ఫ్రైడే సందర్భంగా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు రిజ్వాన్ కకలసిన్.
Comments
Please login to add a commentAdd a comment