1983లో ఏం జరిగింది? | Rajasekhar and Prasanth Varma film Pre Look | Sakshi
Sakshi News home page

1983లో ఏం జరిగింది?

Published Thu, Aug 23 2018 1:51 AM | Last Updated on Thu, Aug 23 2018 1:51 AM

Rajasekhar and Prasanth Varma film Pre Look - Sakshi

రాజశేఖర్‌

1983లో ఇండియాకు తొలిసారి వరల్డ్‌ కప్‌ వచ్చింది. చిరంజీవి ‘ఖైదీ’ రిలీజైంది. అలాగే ఓ మర్డర్‌ కూడా జరిగింది. ఆ మర్డర్‌ చేసింది ఎవరు? తెలియదు. ఆ  మిస్టరీ ఛేదించేందుకు సిద్ధమయ్యారు హీరో రాజశేఖర్‌. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ‘పీయస్‌వి గరుడ వేగ’తో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న రాజశేఖర్‌ స్క్రిప్ట్‌ సెలెక్షన్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. 1980లో జరిగే పీరియాడికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ–లుక్‌ను విడుదల చేశారు. ఆగస్ట్‌ 26న ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement