జై హనుమాన్‌లో ‘కాంతార’ హీరో! | Rishab Shetty Play Key Role In Prasanth Varma Jai Hanuman Movie | Sakshi
Sakshi News home page

జై హనుమాన్‌లో ‘కాంతార’ హీరో!

Published Fri, Oct 18 2024 2:29 PM | Last Updated on Fri, Oct 18 2024 3:05 PM

Rishab Shetty Play Key Role In Prasanth Varma Jai Hanuman Movie

‘జై హనుమాన్‌’ సినిమాలో రిషబ్‌ శెట్టి నటించే అవకాశం ఉందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హనుమాన్‌’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రానున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్‌’ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. 

(చదవండి: నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్‌)

చిరంజీవి, రామ్‌చరణ్‌ వంటి స్టార్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమాలో కన్నడ హీరో ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, చైతన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్‌తో బిజీగా ఉన్నారు రిషబ్‌ శెట్టి. మరి...  ‘జై హనుమాన్‌’ సినిమాలో రిషబ్‌ శెట్టి నటించనున్నారనే వార్త నిజమేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement