రాజశేఖర్
రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘అర్జున’. ఇందులో మరియం జకారియా హీరోయిన్‌గా నటించారు. కన్మణి దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ‘‘ఇందులో సూర్యనారాయణ అనే రైతు, అతని కొడుకు అర్జునగా ద్విపాత్రాభినయం చేశారు రాజశేఖర్. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. వాస్తవ సంఘటనల ప్రేరణగా రాజకీయ నేపథ్యంలో కన్మణి బాగా తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, శివాజీరాజా తదితరులు నటించిన ఈ సినిమాకు ‘వందేమాతరం’ శ్రీనివాస్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment