విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించాడు. రీసెంట్‌గా రిలీజైన 'కల్కి' సినిమాలో ఇతడు అర్జునుడి పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే ఇతడి డైలాగ్ డెలివరీపై విమర్శలు వచ్చాయి. రెండు మూడు రోజుల నుంచి కర్ణుడు గొప్పా? అర్జునుడు గొప్పా? అనే విషయమై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. 'కల్కి' సక్సెస్‌పై రౌడీ హీరో తొలిసారి స్పందించాడు. తానేం లక్కీ ఛార్మ్ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?)
'మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాం. నాగీ, ప్రభాస్ అన్న కోసమే ఇందులో నేను నటించాను. ఇలాంటి సినిమాలో చివరలో అలా రావడం నాకు సంతోషంగా ఉంది. నాగీ యూనివర్స్‌లో ఓ పాత్ర పోషించాను అంతే. వాళ్లందరి కోసం ఈ పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. వైజయంతీ మూవీస్‌లోనే నా కెరీర్ మొదలైంది. అందుకే నాగీ ప్రతి సినిమాలో చేస్తుంటా. మహానటి అద్భుతమైన సినిమా, 'కల్కి' అద్భుతమైన సినిమాలు అంతే. అవి నా వల్ల అవి హిట్ కాలేదు. నేనేం లక్కీ ఛార్మ్ కాదు' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అతడిని మీడియా 'కల్కి' గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానమిచ్చాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే నాగ్ అశ్విన్ తర్వాత తీయబోయే మూవీస్‌లోనూ విజయ్ ఉండటం పక్కా.
(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్)
#VijayDeverakonda about #Kalki2898AD movie ❤️
The way he say #Prabhas anna 😍 is what I really like 😍 pic.twitter.com/o5D4g7538e— The Chanti (@chanticomrade_) June 30, 2024
Comments
Please login to add a commentAdd a comment