భారత ఇతిహాసాల్లో ఒకటిగా చెప్పుకునే మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని 'మహాభారతం' అనే సీరియల్ తెరకెక్కింది. హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ఇది అందుబాటులో ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో మహాభారతం కూడా ఒకటి. 269 ఏపిసోడ్స్ ఉన్న ఈ సీరియల్‌కు IMDb రేటింగ్ 9.0 ఉంది. మహాభారతం సీరియల్‌లో అర్జునుడిగా నటించిన హిందీ సీరియల్ నటుడు షహీర్ షేక్‌ను ఎవరూ మరచిపోలేరు. ఆయన మరోసారి తండ్రి అయ్యాడు.
2020లో రుచికా కపూర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జంటకు ఒక పాప ఉంది. ఇప్పుడు మరో ఆడ శిశువుకు రుచికా జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. భారతీయ వెండితెర ప్రముఖ నటులలో ఒకరైన షహీర్ షేక్ తన చిరకాల స్నేహితురాలు రుచికా కపూర్‌ను మార్చి 2020లో వివాహం చేసుకున్నాడు. వారి మొదటి కుమార్తె అనయను 2021లో స్వాగతించారు. తమ పర్సనల్ లైఫ్‌ను ఎక్కువగా కెమెరా కళ్లకు దూరంగా ఉంచిన ఈ జంట ఈసారి తన జీవితంలోకి వచ్చిన కొత్త అతిథి గురించి షహీర్ భార్య రుచిక ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.
సోదరిని కలిగి ఉండటానికి మించిన గొప్పదనం నిజంగా ఏమీ లేదని రుచికా కపూర్ డిసెంబర్ 31 న తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అక్కడ తన ఇద్దరు పిల్లల ఫోటోలను పోస్ట్ చేసింది. పెద్ద పాప పేరు అనయ అయితే రెండో కుమార్తె పేరు కుద్రత్ అని ఆమె తెలిపింది. తన చెల్లెల్ని అనయ ఎంతో ముద్దుగా కౌగిలించుకోవడం ఆ ఫోటోలో చూడవచ్చు. షహీర్ షేక్ త్వరలో బాలీవుడ్ చిత్రం అయిన డు పట్టి (Do Patti ) సినిమాలో నటి కృతి సనన్ సరసన నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజోల్ కూడా ఓ పాత్ర పోషించింది.
కన్నికా ధిల్లాన్ కథను అందించిన ఈ చిత్రానికి శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించారు. షహీర్ షేక్ కుచ్ రంగ్ ప్యార్ కే ఐసా బీ, మహాభారత్, నవ్య, బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ, క్యా మస్త్ హై లైఫ్ మొదలైన హిందీ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు. అతని భార్య రుచిక ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా, మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఇది కాకుండా, ఆమె బాలాజీ మోషన్ పిక్చర్ డిప్యూటీ హెడ్‌గా కూడా పనిచేసింది. ఆమె ఉడ్తా పంజాబ్, ఏక్ విలన్ రిటర్న్, దొబారా వంటి చిత్రాలకు సహ దర్శకత్వం వహించింది.
Comments
Please login to add a commentAdd a comment