బడ్జెట్‌తో డైరెక్టర్‌కి సంబంధం లేదు | Praveen Sattaru on PSV Garuda Vega | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌తో డైరెక్టర్‌కి సంబంధం లేదు

Published Thu, Nov 2 2017 12:39 AM | Last Updated on Thu, Nov 2 2017 12:39 AM

Praveen Sattaru on PSV Garuda Vega  - Sakshi

‘‘పోస్టర్స్, ట్రైలర్స్‌ నచ్చితేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు. ప్రజెంట్‌ సిట్యువేషన్‌లో సినిమా బాగుంటే చాలు. బాగా లేకపోతే వంద కోట్లతో తీసిన సినిమా 20 కోట్లు కూడా వసూలు చేయలేకపోవచ్చు. బడ్జెట్, హీరో ఇంపార్టెంట్‌ మేటర్‌ కాదు. సినిమాలో కంటెంట్‌ ఉంటే ఆడుతుంది. లేకపోతే ఆడదు’’ అన్నారు ప్రవీణ్‌ సత్తారు. రాజశేఖర్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రవీణ్‌ సత్తారు చెప్పిన సంగతులు...

► రాజశేఖర్‌గారి మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాకు అంత బడ్జెట్‌ ఖర్చుపెట్టారా? అంటే... ఇప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ 4 కోట్లతో తీశారు. సినిమా హిట్‌ కాకముందు ఆ హీరో (విజయ్‌ దేవరకొండ) సిన్మాకి 4 కోట్లు ఎక్కువే కదా! విడుదలైన తర్వాత 30 కోట్లకు పైగా వసూలు చేసింది.

► ప్లానింగ్‌ ఉంటే ఇంకా తక్కువ బడ్జెట్‌లోనే ‘పీఎస్వీ గరుడవేగ’ను తీయొచ్చంటున్నారు. డైరెక్టర్‌కి, బడ్జెట్‌కి సంబంధం లేదు. బడ్జెట్‌ ప్లానింగ్‌ లైన్‌ ప్రొడ్యూసర్స్‌ది. తెలుగులో ఒక డైరెక్టర్‌ స్క్రిప్ట్‌ పట్టుకుని వస్తే సిన్మా బడ్జెట్‌ ఎంత? అనడుగుతారు. మోస్ట్‌ స్టుపిడ్‌ క్వశ్చన్‌ అది. డైరె క్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి అసలు సంబంధం ఏంటి? స్క్రిప్ట్‌ ఇచ్చినప్పుడు లైన్‌ ప్రొడ్యూసర్స్‌ అండ్‌ ప్రొడక్షన్‌ టీమ్‌ పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేయాలి. బేసికల్లీ లైన్‌ ప్రొడ్యూసర్స్‌ అందరూ ఎమ్‌.బి.ఏ చేయాలి. వారు బడ్జెట్‌ను తగ్గించేలా ప్లాన్‌ చేయాలి.

► నా ప్రతి సినిమాకి సెన్సార్‌ ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాను. ‘చందమామకథలు’ సినిమాలో నరేశ్, ఆమని ముద్దు సీన్‌కి సెన్సార్‌ వాళ్లు అభ్యంతరం చెప్పారు. ఈ ఏజ్‌లో ఏంటి? అన్నారు. క్యారెక్టర్‌ పరంగా ఆ ఎమోషన్స్‌ను వారు అర్థం చేసుకోలేకపోయారు. సెన్సార్‌ అంటే ప్రభుత్వ ఉద్యోగంలా... మార్నింగ్‌ వెళ్లి ఏవో నాలుగు సంతకాలు పెట్టి ఇంటికెళ్లిపోతే చాలు అన్నట్టుంది. ఎవరికీ రూల్స్‌ తెలియవు. ఈ సినిమాకి ‘యు’ సర్టిఫికెట్‌ వస్తుందనుకున్నా. సినిమాలో పోలీసాఫీసర్‌లను, గవర్నమెంట్‌ ఉద్యోగులను తిట్టకూడదట! ఎవరైతే గవర్నమెంట్‌ కోసం వర్క్‌ చేస్తున్నారో... వారందరూ మంచోళ్లు. వాళ్లను పొగడాలి. సినిమాలో సీన్‌కి తగ్గట్టు గవర్నమెంట్‌ ఆఫీసర్‌ని వ్యతిరేకంగా చూపించడం తప్పా? తప్పే అంటే... మనం చైనాలో బతుకుతున్నామా? ఇండియాలో బతుకుతున్నామా? ఈ సినిమాకి 10 కట్స్‌ అన్నారు. ఫైనల్‌గా 5 ఆడియో కట్స్‌ వచ్చాయి. ఫైవ్‌ కట్స్‌కి కూడా రివైజింగ్‌ కమిటీకి వెళ్లేవాణ్ణి. కానీ టైమ్‌ లేదని వదిలేశా. అందులో ఒకటే వ్యాలిడ్‌ కట్‌ అనుకుంటున్నా.

► నెక్ట్స్‌ సుధీర్‌బాబు హీరోగా తెలుగు, హిందీ భాషల్లో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లల గోపీచంద్‌ బయోపిక్‌ తీయబోతున్నా. వచ్చే ఏడాది మార్చిలో షూట్‌ స్టార్ట్‌ చేసి, 2019లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. ఈ గ్యాప్‌లో నేను మరో సినిమా చేసే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement