PSV Garudaega 126.18 M
-
అ! దర్శకుడితో రాజశేఖర్
చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక్సెస్ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న యాంగ్రీ హీరో త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నారట. కొత్త సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనే ఉండనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రయోగాత్మకంగా తెరకెక్కిన అ! సినిమాతో పరిచయం అయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ యువ దర్శకుడు రాజశేఖర్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు కల్కి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. జూన్ లేదా జూలై మాసాల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లనుంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ మహిళా దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఒక సినిమా, మరో మల్టీ స్టారర్ సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ వరుస సినిమాలతో రాజశేఖర్ తిరిగి ఘన వైభవాన్ని అందుకుంటాడేమో చూడాలి. -
‘గరుడవేగ’ దర్శకుడితో రామ్
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో డిసెంట్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హలో గురు ప్రేమకోసమే అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా తరువాత రామ్ ఓ అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నాడట. ఇటీవల రాజశేఖర్ హీరోగా ఘనవిజయం సాధించిన పీఎస్వీ గరుడవేగ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో రామ్ ఈ భారీ చిత్రాన్ని చేయనున్నారు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
‘పీఎస్వీ గరుడవేగ’ ఆడదనుకున్నా
సాక్షి, హైదరాబాద్: సినిమాకు మూడు వారాల ముందు నా తల్లి మరణం.. ఇక మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది అనగా జీవిత సోదరుడు చనిపోవడంతో నా టైమ్ బాగలేదు.. ఈ సినిమా ఆడదేమోననుకున్నానని హీరో రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పీఎస్వీ గరుడవేగ’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చిత్రయూనిట్ మంగళవారం ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు. సినిమాకు ముందు బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకోవడంతోపాటు చెన్నైలో వరదలు ముంచెత్తడంతో నా టైం బాలేదనుకొని సినిమా ఆడదేమోననుకున్నాను. కానీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌కు సహకరించిన చిరంజీవి.. బాలకృష్ణలకి ఎంతగానో రుణపడి ఉంటానన్నారు. -
నెక్ట్స్ మిషన్...
మిషన్ గరుడవేగ... రాజశేఖర్ హీరోగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన ‘పీఎస్వీ గరుడవేగ’ మంచి హిట్ టాక్‌తో రన్ అవుతోంది! గరుడవేగ హిట్‌తో ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడి నెక్ట్స్ సినిమా ఎవరితో? నితిన్‌తో! యస్, ప్రవీణ్ సత్తారు నెక్ట్స్ మిషన్... నితిన్‌తోనే. ‘‘నా తర్వాతి చిత్రాన్ని వెరీ టాలెంటెడ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో చేయబోతున్నా’’ అన్నారు నితిన్. -
బడ్జెట్‌తో డైరెక్టర్‌కి సంబంధం లేదు
‘‘పోస్టర్స్, ట్రైలర్స్ నచ్చితేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు. ప్రజెంట్ సిట్యువేషన్లో సినిమా బాగుంటే చాలు. బాగా లేకపోతే వంద కోట్లతో తీసిన సినిమా 20 కోట్లు కూడా వసూలు చేయలేకపోవచ్చు. బడ్జెట్, హీరో ఇంపార్టెంట్ మేటర్ కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది. లేకపోతే ఆడదు’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తారు చెప్పిన సంగతులు... ► రాజశేఖర్‌గారి మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాకు అంత బడ్జెట్ ఖర్చుపెట్టారా? అంటే... ఇప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ 4 కోట్లతో తీశారు. సినిమా హిట్ కాకముందు ఆ హీరో (విజయ్ దేవరకొండ) సిన్మాకి 4 కోట్లు ఎక్కువే కదా! విడుదలైన తర్వాత 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ► ప్లానింగ్ ఉంటే ఇంకా తక్కువ బడ్జెట్లోనే ‘పీఎస్వీ గరుడవేగ’ను తీయొచ్చంటున్నారు. డైరెక్టర్‌కి, బడ్జెట్‌కి సంబంధం లేదు. బడ్జెట్ ప్లానింగ్ లైన్ ప్రొడ్యూసర్స్ది. తెలుగులో ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ పట్టుకుని వస్తే సిన్మా బడ్జెట్ ఎంత? అనడుగుతారు. మోస్ట్ స్టుపిడ్ క్వశ్చన్ అది. డైరె క్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి అసలు సంబంధం ఏంటి? స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు లైన్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడక్షన్ టీమ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. బేసికల్లీ లైన్ ప్రొడ్యూసర్స్ అందరూ ఎమ్.బి.ఏ చేయాలి. వారు బడ్జెట్‌ను తగ్గించేలా ప్లాన్ చేయాలి. ► నా ప్రతి సినిమాకి సెన్సార్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ‘చందమామకథలు’ సినిమాలో నరేశ్, ఆమని ముద్దు సీన్‌కి సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పారు. ఈ ఏజ్‌లో ఏంటి? అన్నారు. క్యారెక్టర్ పరంగా ఆ ఎమోషన్స్‌ను వారు అర్థం చేసుకోలేకపోయారు. సెన్సార్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలా... మార్నింగ్ వెళ్లి ఏవో నాలుగు సంతకాలు పెట్టి ఇంటికెళ్లిపోతే చాలు అన్నట్టుంది. ఎవరికీ రూల్స్ తెలియవు. ఈ సినిమాకి ‘యు’ సర్టిఫికెట్ వస్తుందనుకున్నా. సినిమాలో పోలీసాఫీసర్లను, గవర్నమెంట్ ఉద్యోగులను తిట్టకూడదట! ఎవరైతే గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తున్నారో... వారందరూ మంచోళ్లు. వాళ్లను పొగడాలి. సినిమాలో సీన్‌కి తగ్గట్టు గవర్నమెంట్ ఆఫీసర్ని వ్యతిరేకంగా చూపించడం తప్పా? తప్పే అంటే... మనం చైనాలో బతుకుతున్నామా? ఇండియాలో బతుకుతున్నామా? ఈ సినిమాకి 10 కట్స్ అన్నారు. ఫైనల్‌గా 5 ఆడియో కట్స్ వచ్చాయి. ఫైవ్ కట్స్కి కూడా రివైజింగ్ కమిటీకి వెళ్లేవాణ్ణి. కానీ టైమ్ లేదని వదిలేశా. అందులో ఒకటే వ్యాలిడ్ కట్ అనుకుంటున్నా. ► నెక్ట్స్ సుధీర్‌బాబు హీరోగా తెలుగు, హిందీ భాషల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లల గోపీచంద్ బయోపిక్ తీయబోతున్నా. వచ్చే ఏడాది మార్చిలో షూట్ స్టార్ట్ చేసి, 2019లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ గ్యాప్‌లో నేను మరో సినిమా చేసే అవకాశం ఉంది. -
భార్య పాత్రలు బోర్ కొట్టవు
‘‘ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ ఉంటారు. కానీ, ‘గరుడవేగ’ చిత్రంలో అలా కాదు. 10 ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర ఎక్కువ, మరో పాత్ర తక్కువ కాకుండా ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది’’ అని కథానాయిక పూజాకుమార్ అన్నారు. రాజశేఖర్, పూజాకుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పి.ఎస్.వి.గరుడవేగ 126.18ఎం’. జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కోటేశ్వర్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూజ చెప్పిన సినిమా ముచ్చట్లు... ► నేను ఇప్పటి వరకూ చాలా స్క్రిప్ట్స్ విన్నాను. కానీ, ప్రవీణ్ సత్తారు 120 పేజీల బౌండెడ్ స్క్రిప్ట్ నాకిచ్చారు. బౌండెడ్ స్క్రిప్ట్ చదవడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా ఆసక్తికరంగా అనిపించింది. అతని విజన్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ‘గరుడవేగ’ లో చేశా. ► యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. డ్రామా, ఎమోషన్స్ కూడా ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీకి మార్గం చూపే సినిమా అవుతుంది. బైక్స్, ట్రైన్స్... యాక్షన్ సీక్వెన్సులు చాలా బాగుంటాయి. సినిమాని థియేటర్లో చూసినప్పుడే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ► ఈ సినిమాలో నాది హౌస్ వైఫ్ క్యారెక్టర్. దేశం కోసం ఎక్కువ టైమ్ కేటాయించే భర్తకు ఏమవుతుందో అని ఎప్పుడూ టñ న్షన్ పడుతూ, భర్త నుంచి కేరింగ్, అటెన్షన్ కోరుకునే భార్యగా నటించా. భార్య పాత్రలు ఎప్పటికీ బోర్ కొట్టవు. పైగా ఆ పాత్రలో చాలా విశేషాలుంటాయి. ► ఈ సినిమాకి ముందు రాజశేఖర్‌గారు పోలీస్‌గా నటించిన కొన్ని సినిమాలు చూశా. అద్భుతంగా నటించారు. ఆయన ఎనర్జీ సూపర్. ‘గరుడవేగ’లో యాక్షన్స్ సన్నివేశాలు చాలా బాగా చేశారు. ► సాధారణంగా క్లైమాక్స్‌లో హీరో, విలన్ మాత్రమే ఉంటారు. కానీ, ఈ మూవీ క్లైమాక్స్‌లోని కొన్ని యాక్షన్ సీన్స్‌లో నేనూ ఉంటా. మలేషియా, జార్జియాలోనూ షూట్ చేశాం. కఠినమైన వాతావరణంలో కష్టపడి చేశాం. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి. -
ఇది... ఎన్ఐఎ ఏజెంట్ కథ
తెలుగులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ)పై ఇప్పటి వరకూ సినిమా రాలేదు. దేశం కోసం ఎన్ఐఎ అధికారులు ఎలా కష్టపడతారు? అనేది మా సిన్మాలో చూపించామని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. ఆయన దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ను నవంబర్ 3న రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత కోటేశ్వర్ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ సిన్సియర్ ఎన్ఐఎ ఆఫీసర్ దేశం కోసం, కుటుంబం కోసం ఏం చేశాడనే కథతో రూపొందిన చిత్రం ఇది. పవర్ఫుల్ హీరోయిజమ్, హృదయాన్ని తాకే ఎమోషన్స్, ఉత్కంఠ రేపే సన్నివేశాలతో దర్శకుడు చిత్రాన్ని తీశారు. రాజశేఖర్‌కి జోడీగా పూజాకూమార్, జర్నలిస్ట్‌గా శ్రద్ధాదాస్, స్పెషల్ సాంగులో సన్నీ లియోన్ కనిపిస్తారు’’ అన్నారు. -
ఇప్పుడు 25 కోట్లు... తర్వాత 2 కోట్లైనా ఓకే!
‘‘కథను బట్టే బడ్జెట్ ఉంటుంది. ఈ సిన్మాను పాతిక కోట్లతో తీశామని... నా తర్వాతి సినిమాను అంత కంటే ఎక్కువ బడ్జెట్‌తో తీయాలనుకోను. కథకు రెండు కోట్లు చాలనుకుంటే... రెండు కోట్లలోనే తీస్తా’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ సినిమా గురించి ప్రవీణ్ చెప్పిన విశేషాలు... ⇒ జీవితాగారు ఓ రోజు ఫోన్ చేసి రాజశేఖర్‌గారికి ఏదైనా కథ ఉంటే చెప్పమన్నారు. హాలీవుడ్ హిట్ ‘డై హార్డ్’ టైప్ కథ చెప్పా. నేను తీసిన గత రెండు సినిమాలు ‘చందమామ కథలు, గుంటూరు టాకీస్’ కంటే డిఫరెంట్ జానర్ సిన్మా. భారీ స్కేల్ ఉన్న సిన్మా, భారీ బడ్జెట్ కావాలి. బహుశా... వేరే నిర్మాతలైతే అంతకు ముందు ఏం తీశావమ్మా? అనడిగేవారేమో! ఎం. కోటేశ్వరరాజుగారు, హీరోగారు కథను, నన్ను నమ్మారు. ⇒ రాజశేఖర్‌గారి ‘మగాడు’ సినిమాకు, అందులో ఆయన యాక్టింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్. ఇందులో ఆయనది అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రే. ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ (ఎన్ఐఏ) ఆఫీసర్‌గా చేశారు. షూటింగ్ ఫినిష్ చేశాం. తాను తప్ప వేరేవాళ్లు చేయలేరన్నంతగా రాజశేఖర్‌గారు నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సిన్మా ఇది. స్టోరీ, యాక్షన్ సీక్వెన్లు చాలా కొత్తగా ఉంటాయి. ⇒ ఈ సినిమాకు ముందు రాజశేఖర్‌గారి మార్కెట్ ఎంతని ఆలోచించలేదు. ఈ రెండేళ్లలో వచ్చిన సినిమాలు పరిశీలిస్తే... కొత్తవాళ్లతో రెండు కోట్లలో తీసిన సినిమా 20 కోట్లు వసూలు చేసింది. పదేళ్లుగా ఇల్లు–టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను ‘బాహుబలి’ థియేటర్లకు రప్పించింది. సినిమాలో కంటెంట్ ఉంటే ఆకాశమే హద్దుగా వసూళ్లు వస్తున్నాయి. హీరో స్లంపులో ఉన్నాడనేది మేటర్ కాదు. అదే... ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. బాగోకపోతే రెండో రోజు కలెక్షన్స్ ఉండవు. ⇒ సన్నీ లియోన్‌తో ఐటమ్ సాంగ్ చేయించాలనేది నిర్మాత ఐడియా. భీమ్స్ మంచి బీటున్న సాంగ్ చేశారు. ఆడియన్స్‌ను సన్నీ సాంగ్ బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. బట్, రిలీజైన తర్వాత సిన్మాలో కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకముంది. పూజాకుమార్, శ్రద్ధా దాస్, కిశోర్.. అద్భుతంగా నటించారు. తెలుగులో యాక్షన్ బేస్డ్ ఎంటర్టైనర్స్కు ‘పీఎస్వీ గరుడవేగ’ కొత్త టెంప్లేట్ అవుతుందనుకుంటున్నా.