‘గరుడవేగ’ దర్శకుడితో రామ్‌ | Praveen Sattaru Adventurous Thriller With Ram | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 15 2018 10:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

Praveen Sattaru Adventurous Thriller With Ram - Sakshi

హీరో రామ్‌ పోతినేని

ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో డిసెంట్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్‌ ప్రస్తుతం త్రినాథ్‌ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హలో గురు ప్రేమకోసమే అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా తరువాత రామ్‌ ఓ అడ‍్వంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటించనున్నాడట.

ఇటీవల రాజశేఖర్‌ హీరోగా ఘనవిజయం సాధించిన పీఎస్‌వీ గరుడవేగ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రవీన్‌ సత్తారు దర్శకత్వంలో రామ్‌ ఈ భారీ చిత్రాన్ని చేయనున్నారు. పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement