సాక్షి, హైదరాబాద్: సినిమాకు మూడు వారాల ముందు నా తల్లి మరణం.. ఇక మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది అనగా జీవిత సోదరుడు చనిపోవడంతో నా టైమ్ బాగలేదు.. ఈ సినిమా ఆడదేమోననుకున్నానని హీరో రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పీఎస్‌వీ గరుడవేగ’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చిత్రయూనిట్ మంగళవారం ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు. సినిమాకు ముందు బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకోవడంతోపాటు చెన్నైలో వరదలు ముంచెత్తడంతో నా టైం బాలేదనుకొని సినిమా ఆడదేమోననుకున్నాను. కానీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌కు సహకరించిన చిరంజీవి.. బాలకృష్ణలకి ఎంతగానో రుణపడి ఉంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment