
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్ స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది' అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్)