
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ గా ఉన్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు. ఆమె చార్జీ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ మరణించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment