
రాజశేఖర్
చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ తర్వాతి చిత్రంపై తొందర పడకుండా ఆచి తూచి అడుగులేస్తున్నారు. తదుపరి చిత్రాన్ని చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ‘గరుడవేగ’ తర్వాత రాజశేఖర్ చేయబోయే సినిమాపై ఫిల్మ్‌నగర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నా ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా తన తర్వాతి సినిమాపై రాజశేఖర్ ఓ హింట్ ఇచ్చి రూమర్లకు తెరదించారు.
‘‘నా తర్వాతి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. అది ఆసమ్‌గా (awe some) ఉంటుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన తర్వాతి చిత్రం ‘అ’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మతోనే అన్న క్లారిటీ వచ్చిందంటున్నారు సినీ జనాలు. ‘అ’ వంటి వైవిధ్యభరిత చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రశాంత్. ప్రస్తుతం తమన్నా లీడ్ రోల్‌లో ‘క్వీన్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు ప్రశాంత్. సో.. ఆ సినిమా పూర్తయ్యాక రాజశేఖర్ సినిమా పట్టాలెక్కనుందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment