చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్ను కూడా మెప్పించిన యాంగ్రీ హీరో రాజశేఖర్ కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్నాడు. స్ట్రయిట్ సినిమాలతో పాటు రీమేక్లు కూడా సక్సెస్ ఇవ్వకపోవటంతో ఆలోచనలో పడ్డ రాజశేఖర్ ఓ ఆసక్తికరమైన కాంబినేషన్కు రెడీ అవుతున్నాడు.
చిత్రం, జయం, నువ్వునేను లాంటి సినిమాలతో స్టార్ హీరోలకు పోటీగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజ. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఉన్న తేజ ఇటీవల కాలంలో మినిమమ్ కలెక్షన్లు సాదించే సినిమాలు కూడా అందించలేకపోతున్నాడు. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ' కూడా ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయింది. దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ తేజ, రాజశేఖర్ లీడ్రోల్లో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాను 'నిజం' తరహాలో సోషల్ ఎలిమెంట్తో కూడిన చిత్రంగా తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి, వీలైనంత త్వరగా రిలీజ్ కు రెడీ చేయాలని భావిస్తున్నారు.
యాంగ్రీ హీరోతో క్రేజీ డైరెక్టర్
Published Fri, Oct 23 2015 9:24 AM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM
Advertisement
Advertisement