
Rajasekhar Removed From Sriwass and Gopichand Movie: ఫ్యామిలీ హీరోలుగా మెప్పించిన నటుడు జగపతి బాబు, శ్రీకాంత్‌లు విలన్స్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే విలనిజంలో జగపతి బాబుకు వందకు వందశాతం మార్కులు కొట్టెసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అఖండతో శ్రీకాంత్ కూడా ప్రతి కథనాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక వీరి జాబితాల్లోకి యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా చేరాలనుకున్నాడు. మంచి అవకాశం వస్తే తాను విలన్‌గా చేసేందుకు సిద్ధం అంటూ ఇప్పటికే స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు.
చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు!
ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్న రాజశేఖర్‌కు జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఎలాంటి పాత్ర అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా రాజశేఖర్ ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను నుంచి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు నుంచి రాజశేఖర్‌ను మేకర్స్ తప్పించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ స్థానంలో జగపతి బాబును రీప్లేస్ చేసినట్లు సమాచారం.
చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా?
అయితే గోపిచంద్ సినిమా నుంచి రాజశేఖర్‌ను తప్పించడానికి కారణమేంటో తెలియదు కానీ, ఆయనకు ఈ ఆఫర్ పోవడానికి ఆయన భార్య జీవిత కారణమంటూ కొందరూ అంటున్నారు. ఈ సినిమా రాజశేఖర్ పాత్ర విషయంలో జీవిత ఎక్కువగా కలుగ చేసుకుందట. ఈ విషయంలో ఆమె ప్రమేయం నిర్మాతలకు చికాకు తెప్పించిదట. దీంతో గోపించంద్-శ్రీవాస్ ప్రాజెక్ట్ నుంచి రాజశేఖర్‌ను తీసేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై చిత్ర బృందం కానీ, జీవిత రాజశేఖర్లు స్పందించే వరకు వేచి చూడాలి. అయితే ఇది విన్న పలువురు విలన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న రాజశేఖర్ ఆశలకు జీవిత విలన్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment