
రాజశేఖర్ హీరోగా, స్వాతీ దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవా, బెనర్జీ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 16న విడుదల కానుంది. బుధవారం రామ్‌గోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సరికొత్త దెయ్యం కథ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ మేకప్ లేకుండా సహజంగా నటించడం విశేషం. స్వాతీ దీక్షిత్ యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ప్రొడ్యూసర్స్: కొమ్మురి ప్రేమ్‌సాగర్, జె. సాయి కార్తీక్ గౌడ్, కెమెరా: సతీష్ ముత్తాల, సంగీతం: డీఎస్‌ఆర్.
Comments
Please login to add a commentAdd a comment