Ramgopalvarma director
-
రాజశేఖర్ సరికొత్త దెయ్యం.. ప్రేక్షకులను భయపెడతాడా..!
రాజశేఖర్ హీరోగా, స్వాతీ దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవా, బెనర్జీ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 16న విడుదల కానుంది. బుధవారం రామ్‌గోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సరికొత్త దెయ్యం కథ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ మేకప్ లేకుండా సహజంగా నటించడం విశేషం. స్వాతీ దీక్షిత్ యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ప్రొడ్యూసర్స్: కొమ్మురి ప్రేమ్‌సాగర్, జె. సాయి కార్తీక్ గౌడ్, కెమెరా: సతీష్ ముత్తాల, సంగీతం: డీఎస్ఆర్. చదవండి: ఫుల్ స్పీడ్‌లో రాజశేఖర్.. 92వ సినిమా అదేనట -
సీసీఎస్‌లో ముగిసిన రామ్‌గోపాల్ వర్మ విచారణ
-
టీడీపీ ఎమ్మెల్యేకి వర్మ దిమ్మతిరిగే కౌంటర్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీయార్' సినిమా ప్రకటించిన నేపథ్యంలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యంగా ఈ సినిమాపై చెలరేగిన రాజకీయ సెగ అంతకంతకూ రాజుకుంటోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విమర్శలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి కామెంట్స్‌కి తన సమాధానాలంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. ముఖ్యంగా నా సినిమా నా ఇష్టం అంటూ వర్మ చేస్తున్న వరుస కామెంట్స్ మీద ప్రభాకర్ చౌదరి స్పందించిన నేపథ్యంలో వర్మ ఈ పోస్ట్ పెట్టారు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు తియ్యడానికి కుదరదు.. ఇది ఎన్టీయార్ జీవితం అన్న టీపీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు డైరెక్టర్ వర్మ ఇవిగో నా రిప్లైస్ అంటూ అంతే సీరియస్ గా స్పందించారు. ఆర్జీవీ చేసిన ఫేస్బుక్ పోస్ట్.. యథాతథంగా మీ కోసం.. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి కామెంట్స్ కి నా రిప్లైస్: ప్రభాకర్ చౌదరి: రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి ఓ సైకో. RGV : అవునా డాక్టర్ గారు ..మీకు సైకియాట్రీ మీద డిగ్రీ కూడా ఉందా? అరెరే మీరు చదువు రాని వారనుకున్నాను ..సారి నా బాడ్ ప్రభాకర్ చౌదరి: కులాల మధ్య, రాజకీయాల మధ్య ఇష్టం వచ్చినట్లు సినిమాలు తియ్యకూడదు. RGV : అంటే ఇష్టం లేనట్టు తీస్తే, ఓకేనా డాక్టర్ గారు? ప్రభాకర్ చౌదరి: సినిమా తీసేటప్పుడు అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడాలి RGV : ఇంతకన్న సైకో కామెంట్ బహుశా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్లు కూడా ఇఛ్చి వుండరు ప్రభాకర్ చౌదరి: రామారావు వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా మూవీ ఉండాలి RGV : ఛా మా నాయనే.. ఎవరికి తట్టని ఎంత గొప్ప మాట చెప్పావు చౌదరి ..నీ కడుపు చల్లగుండ ప్రభాకర్ చౌదరి: ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మచ్చ కలిగే రీతిలో ఏమి తీసినా తగిన మూల్యం చెల్లించుకుంటావు RGV : అంటే మీ జేబులనిండా డబ్బులు నింపితే NTR గారిని తిట్టినా పర్వాలేదా ? నీ తస్సాదియ్యా ప్రభాకర్ చౌదరి: నా సినిమా నా ఇష్టం అంటే చూస్తు ఊరుకోం. RGV : ఊరుకోక డాన్స్ చేస్తారా సార్? లేక పాట కూడా పడతారా? ప్రభాకర్ చౌదరి: దర్శకుడంటే తన సినిమా ద్వారా ప్రేక్షకులను ఆనందింపజేయాలి.. రంజింపజేయాలి. సందేశాత్మక చిత్రాలతో సమాజానికి ఉపయోగపడాలి. RGV : అబ్బో సినిమా పట్ల మీకున్న ఈ అత్యంత అమోఘమైన అవగాహన చూస్తుంటే రాజమౌళి పొట్ట కూడా కొట్టేడట్టు వున్నారు మీరు..బాబోయ్ ప్రభాకర్ చౌదరి: లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉంది. RGV : ఆ హస్తం వెనక మీ హస్తం ఉందా సార్? లేకపోతే మీకెలా తెలుసు ఎవరి వెనుక ఎవరున్నారో ? అయినా ముందు వెనకాలవున్న ,వెనక ముందు గ్రూపుల గురించి మీ వెనకున్న గ్రూపులకి బాగా తెలుసని నాకు కూడా తెలుసని మీకు కూడా తెలుసు..ఈ కామెంట్‌ని అర్ధం చేసుకునే మైండ్ మీకు లేకపోతే నేను మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్లి చెప్తా. -
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం మోపాలి
ఐద్వా నేతల డిమాండ్ విద్యార్థినుల మానవహారం తగరపువలస : అశ్లీల చిత్రాలను తీసి వివాదాలనే పబ్లిసిటీగా చేసుకుంటున్న దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను ‘ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్’ చట్టం కింద అరెస్టు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి టి.అరుణ డిమాండ్ చేశారు. ‘సావిత్రి’ సినిమా పోస్టర్లో నెలకొన్న అశ్లీలం వివాదంపై మంగళవారం స్థానిక అంబేద్కర్ కూడలిలో చేపట్టిన మానవహారంలో ఆమె విద్యార్థినులనుద్దేశించి మాట్లాడారు. సెన్సార్ నిబంధనలు కఠినతరం చేసి అసభ్యంగా ఉన్న సావిత్రిలాంటి సినిమాల ప్రదర్శనను నిలిపి వేయాలని కోరారు. జిల్లా అధ్యక్షురాలు కె. నాగరాణి మాట్లాడుతూ ఉపాధ్యాయినులను కించపరుస్తూ, బాలల మనోభావాలను కలుషితం చేసేలా సినిమాను నిర్మించటం దారుణమని విమర్శించారు. తొలుత చిట్టివలస శ్రీకృష్ణా డిగ్రీ కళాశాలకు చెందిన వందమంది విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో రామ్‌గోపాల్‌వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో ఐద్వా, సిటు నాయకులు బా గం లక్ష్మి, కె. దాక్షాయణి, రవ్వ నరసింగరావు, ఎస్. అప్పలనాయుడు పాల్గొన్నారు.