అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం మోపాలి | Impose haircuts on the kinds of pornographic films | Sakshi
Sakshi News home page

అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం మోపాలి

Published Wed, Oct 8 2014 1:34 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం మోపాలి - Sakshi

అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం మోపాలి

ఐద్వా నేతల డిమాండ్
విద్యార్థినుల మానవహారం

 
తగరపువలస : అశ్లీల చిత్రాలను తీసి వివాదాలనే పబ్లిసిటీగా చేసుకుంటున్న దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను ‘ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్’ చట్టం కింద అరెస్టు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి టి.అరుణ డిమాండ్ చేశారు. ‘సావిత్రి’ సినిమా పోస్టర్‌లో నెలకొన్న అశ్లీలం వివాదంపై మంగళవారం స్థానిక అంబేద్కర్ కూడలిలో చేపట్టిన మానవహారంలో ఆమె విద్యార్థినులనుద్దేశించి మాట్లాడారు. సెన్సార్ నిబంధనలు కఠినతరం చేసి అసభ్యంగా ఉన్న సావిత్రిలాంటి సినిమాల ప్రదర్శనను నిలిపి వేయాలని కోరారు.

జిల్లా అధ్యక్షురాలు కె. నాగరాణి మాట్లాడుతూ ఉపాధ్యాయినులను కించపరుస్తూ, బాలల మనోభావాలను కలుషితం చేసేలా సినిమాను నిర్మించటం దారుణమని విమర్శించారు. తొలుత చిట్టివలస శ్రీకృష్ణా డిగ్రీ కళాశాలకు చెందిన వందమంది విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో రామ్‌గోపాల్‌వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో ఐద్వా, సిటు నాయకులు బా గం లక్ష్మి, కె. దాక్షాయణి, రవ్వ నరసింగరావు, ఎస్. అప్పలనాయుడు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement