టీడీపీ ఎమ్మెల్యేకి వర్మ  దిమ్మతిరిగే కౌంటర్‌ | Director Ramgopal varma counter attack on tdp mla Prabhakar chowdary | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేకి వర్మ  దిమ్మతిరిగే కౌంటర్‌

Published Tue, Oct 17 2017 8:33 PM | Last Updated on Tue, Oct 17 2017 10:53 PM

Director Ramgopal varma counter attack on tdp mla Prabhakar chowdary

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీయార్'   సినిమా ప్రకటించిన నేపథ్యంలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యంగా ఈ సినిమాపై  చెలరేగిన రాజకీయ సెగ అంతకంతకూ రాజుకుంటోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి    విమర్శలపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ   సోషల్‌ మీడియాలో  తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి కామెంట్స్కి తన  సమాధానాలంటూ  ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ చేశారు. 

 ముఖ్యంగా నా సినిమా నా ఇష్టం అంటూ వర్మ చేస్తున్న వరుస కామెంట్స్ మీద ప్రభాకర్ చౌదరి  స్పందించిన నేపథ్యంలో  వర‍్మ ఈ పోస్ట్‌ పెట్టారు.  మీ ఇష్టం వచ్చినట్లు మీరు తియ్యడానికి కుదరదు.. ఇది ఎన్టీయార్ జీవితం అన‍్న టీపీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు డైరెక్టర్ వర్మ ఇవిగో నా రిప్లైస్ అంటూ  అంతే సీరియస్ గా స్పందించారు.  ఆర్‌జీవీ చేసిన ఫేస్‌బుక్‌  పోస్ట్‌.. యథాతథంగా మీ కోసం..

టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి కామెంట్స్ కి నా రిప్లైస్:

ప్రభాకర్ చౌదరి:
రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి ఓ సైకో.
RGV :
అవునా డాక్టర్ గారు ..మీకు సైకియాట్రీ మీద డిగ్రీ కూడా ఉందా? అరెరే మీరు చదువు రాని వారనుకున్నాను ..సారి నా బాడ్
ప్రభాకర్ చౌదరి:
కులాల మధ్య, రాజకీయాల మధ్య ఇష్టం వచ్చినట్లు సినిమాలు తియ్యకూడదు.
RGV :
అంటే ఇష్టం లేనట్టు తీస్తే, ఓకేనా డాక్టర్ గారు?
ప్రభాకర్ చౌదరి:
సినిమా తీసేటప్పుడు అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడాలి
RGV :
ఇంతకన్న సైకో కామెంట్ బహుశా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్లు కూడా ఇఛ్చి వుండరు
ప్రభాకర్ చౌదరి:
రామారావు వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా మూవీ ఉండాలి
RGV :
ఛా మా నాయనే.. ఎవరికి తట్టని ఎంత గొప్ప మాట చెప్పావు చౌదరి ..నీ కడుపు చల్లగుండ
ప్రభాకర్ చౌదరి:
ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మచ్చ కలిగే రీతిలో ఏమి తీసినా తగిన మూల్యం చెల్లించుకుంటావు
RGV :
అంటే మీ జేబులనిండా డబ్బులు నింపితే NTR గారిని తిట్టినా పర్వాలేదా ? నీ తస్సాదియ్యా
ప్రభాకర్ చౌదరి:
నా సినిమా నా ఇష్టం అంటే చూస్తు ఊరుకోం.
RGV :
ఊరుకోక డాన్స్ చేస్తారా సార్? లేక పాట కూడా పడతారా?
ప్రభాకర్ చౌదరి:
దర్శకుడంటే తన సినిమా ద్వారా ప్రేక్షకులను ఆనందింపజేయాలి.. రంజింపజేయాలి. సందేశాత్మక చిత్రాలతో సమాజానికి ఉపయోగపడాలి.
RGV :
అబ్బో సినిమా పట్ల మీకున్న ఈ అత్యంత అమోఘమైన అవగాహన చూస్తుంటే రాజమౌళి పొట్ట కూడా కొట్టేడట్టు వున్నారు మీరు..బాబోయ్
ప్రభాకర్ చౌదరి:
లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉంది.
RGV :
ఆ హస్తం వెనక మీ హస్తం ఉందా సార్? లేకపోతే మీకెలా తెలుసు ఎవరి వెనుక ఎవరున్నారో ? అయినా ముందు వెనకాలవున్న ,వెనక ముందు గ్రూపుల గురించి మీ వెనకున్న గ్రూపులకి బాగా తెలుసని నాకు కూడా తెలుసని మీకు కూడా తెలుసు..ఈ కామెంట్ని అర్ధం చేసుకునే మైండ్ మీకు లేకపోతే నేను మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్లి చెప్తా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement