
ప్రస్తుతం హీరో రాజశేఖర్ హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన శేఖర్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరో ప్రాజక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో రాజశేఖర్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబో ఎన్టీఆర్30(#NTR30) ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: డబ్బు కోసం ఇంత దిగజారాలా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్
కాగా చిత్రంలో ఎన్టీఆర్ బాబాయ్‌ది చాలా పవర్ ఫుల్ రోల్ అని, ఆ పాత్రకు రాజశేఖర్ అయితే సరిగ్గా సరిపోతారని కొరటాల భావించాడట. దీంతో వెంటనే ఆయనను సంప్రదించి పాత్ర గురించి వివరించగా రాజశేఖర్ దీనిక ఫిదా అయ్యారని వినికిడి. దీంతో ఎన్టీఆర్‌కు బాబాయ్‌గా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ఈ ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా గతంలో పవర్ఫుల్ క్యారెక్టర్స్.. విలన్ రోల్స్ చేసే అవకాశం వస్తే నటించేందుకు తాను రెడీ అని గతంలో రాజశేఖర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ పాత్ర చేయాలనుకుంటున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ హీరోలుగా ఆకట్టుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోయిన జగపతి బాబు, శ్రీకాంత్‌లు ఇప్పటికే విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన విలక్షణ నటనతో విలన్‌గా జగపతి బాబు పరిశ్రమలో సెటిలైపోయాడు. ఇక తాజాగా అఖండతో ప్రతికథానాయకుడిగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు శ్రీకాంత్.
Comments
Please login to add a commentAdd a comment