
సాక్షి, విజయవాడ : చంద్రబాబు వాడే భాష సక్రమంగా లేదని పద్దతి మార్చుకోవాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ హెచ్చరించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల నుంచి తొలగించినప్పటికి ఏబీ వెంకటేశ్వర రావు హవా ఇంకా అనధికారికంగా కొనసాగుతుందని ఆరోపించారు. పోలింగ్ దగ్గర పడటంతో అధికార పార్టీ నేతలు పోలీసులతో కలిసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు.. ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాబు మేక వన్నె పులి : నాగిరెడ్డి
నూరు తప్పులు చేసిన చంద్రబాబు మేక వన్నె పులి లాంటి వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. పోలింగ్ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను బయటకు రాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం గురించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.