ఆ ముగ్గురికీ కీలకమే | teja to do aham with navadeep and rajashekar | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురికీ కీలకమే

Published Sun, Mar 20 2016 10:40 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

ఆ ముగ్గురికీ కీలకమే

ఆ ముగ్గురికీ కీలకమే

దర్శకుడిగా ఒకప్పుడు టాప్ స్టార్ డమ్ను అందుకున్న తేజ, కొంత కాలంగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు మినిమమ్ కలెక్షన్లు వసూళు చేసే సినిమాను కూడా ఇవ్వలేకపోతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే ఆలోచనలో ఓ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేస్తున్నాడు. తానే ఇంట్రడ్యూస్ చేసిన ఓ యువ నటుడు హీరోగా,  మరో సీనియర్ హీరోను విలన్గా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన అహం సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు తేజ. ఈ సినిమాలో తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నవదీప్ హీరోగా నటిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం జై సినిమాతో తేజ డైరెక్షన్లో పరిచయం అయిన నవదీప్, ఇన్నేళ్ల తరువాత తిరిగి తన గురువుతో కలిసి నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో యాంగ్రీ హీరో రాజశేఖర్ తొలిసారిగా నెగెటివ్ రోల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం రాజశేఖర్, తేజ, నవదీప్ల కెరీర్లు భారీ కష్టాల్లో ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురికి అహం సినిమా సక్సెస్ చాలా కీలకం కానుంది. మరి ఈ అహం ఆ ముగ్గురి కెరీర్లను గాడిలో పెడుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement